85 songs found

ఆ నింగిలో వెలిగింది|Aa Ningilo Veligindi

ఆ నింగిలో వెలిగింది ఒక తార / మా గుండెలో ఆనందాల సితార / నిజ ప్రేమను చూసాము కళ్ళారా / ఈ లోకంలో నీ జన్మము ద్వారా / ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల / హృదయంలోని యేసు పుట్టిన వేళ / ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల / మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ / యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ / యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ / యేషు మేరా గాన్ హాయ్ తూ / యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ / లోకంలో యాడ చూసిన శోకాలేనట / పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట / అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట / అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట / విశ్వాన్ని సృష్టించిన దేవుడంట / పశువుల పాకలోన పుట్టాడంట / పాటలు పాడి ఆరాధించి / నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్ ||యేషు|| / చీకటిలో చిక్కుకున్న బీదవారట / చలి గాలిలో సాగుతున్న గొల్లవారట / అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట / వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట / దావీదు పట్టణమందు దేవుడంట / మనకొరకై భువిలో తానే పుట్టాడంట / వేగమే వెళ్లి నాథుని చూసి / పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్ ||యేషు||

ఆ రాజే నా రాజు|Aa Raaje Naa Raaju

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు / నా రాజు రాజులకు రాజు (2) / యేసు పుట్టెను ఈ లోకంలో / ఆనందమే గొప్ప ఆనందమే (2) / ఆనందమే గొప్ప ఆనందమే / సంతోషమే సర్వలోకమే (2) ||ఆ రాజే|| / యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా / లోక రక్షకుడు జన్మించెను / లోక పాపాలను కడిగి వేయగా / భువిలో బాలుడిగా అరుదించెను (2) / పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను / మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) (2) ||ఆనందమే|| / వీనుల విందుగా – దీనుల అండగా / కరుణా కారకుడు కడలివచ్చెను / పాపుల శాపాలను తానే మోయగా / పరమ పాలకుడు పుడమి చేరెను (2) / కుల మత బేధాలను హరియించ వచ్చెను / పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) (2) ||ఆనందమే||

ఆకశాన తార ఒకటి|Aakashaana Thaara Okati

ఆకశాన తార ఒకటి వెలసింది / ఉదయించెను రక్షకుడని తెలిపింది (2) / ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| / యూద దేశపు బెత్లెహేములో / కన్య మరియ గర్బమున జన్మించె / తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు / యూదుల రాజు ఎక్కడని వెతికారు / తూరుపు దిక్కున చుక్కను కనుగొని / ఆనందభరితులై యేసుని చేరిరి / కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| / రాత్రివేళలో మంద కాసెడి / కాపరులకు ప్రభువు దూత ప్రకటించే / లోక ప్రజలకు మిగుల సంతసం / కలిగించెడి వర్తమానమందించే / క్రీస్తే శిశువుగా యేసుని పేరట / ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా / సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||