ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను / తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| / ఎనలేని పాప కూపమున – నేను / తనికి మిణుకుచును నే దరి గానకుండన్ / కనికరము పెంచి నాయందు – వేగ / గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| / పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను / మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు / నను నీచుడని త్రోయలేక – తనదు / నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| / నెమ్మి రవ్వంతైనా లేక – చింత / క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి / సమ్మతిని నను బ్రోవ దలచి – కరము / జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| / పనికిమాలిన వాడనైన – నేను / కనపరచు నా దోష కపటవర్తనము / మనసు నుంచక తాపపడక యింత / ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| / నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది / లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ / చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము / నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| / శోధనలు నను చుట్టినప్పుడు – నీతి / బోధ నా మనసులో పుట్టించి పెంచి / బాధలెల్లను బాపి మాపి – యిట్టి / యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||
నూతన సంవత్సరం దయచేసిన దేవా / నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) / ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2) / అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || / పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు / శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు / చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా / ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా / నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని / నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| / కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా / కష్టాలతో నేను సతమతమౌతుండగా / నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా / ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి / నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని / నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని ||నూతన||
లేచినాడయ్యా / మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా (2) / పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు / మహిమా స్వరూపుడై లేచినాడయ్యా / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) / క్రీస్తు లేచెను హల్లెలూయా / సాతాను ఓడెను హల్లేలూయా / క్రీస్తు లేచెను హల్లెలూయా / మరణాన్ని గెలిచెను హల్లేలూయా ||లేచినాడయ్యా|| / శ్రమలనొందెను సిలువ మరణమొందెను / లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను (2) / విజయుడై జయశీలుడై / సజీవుడై పరిశుద్ధాత్ముడై (2) ||క్రీస్తు|| / జీవ మార్గము మనకు అనుగ్రహించెను / మన పాపములన్ని తుడిచివేసెను (2) / ప్రేమయై మనకు జీవమై / వెలుగునై మంచి కాపరియై (2) ||క్రీస్తు||
నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా / నేను పాపము చేసినా చూపావు నీ దయా / నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా / సిలువ నీడలో నన్ను దాచుమయ్యా / లోకమంతా నన్ను దోషిగ చూసినా / ప్రేమతోనే నన్ను చేరదీసిన ||నన్ను|| / నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా / లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా / అందరు నన్ను అనాథ చేసి పోయినా / అంధకారమే నాకు బంధువై మిగిలినా / నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా ||నన్ను|| / నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా / నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే / ఏ యోగ్యత నాకు లేకపోయినా / నీ వారసునిగా నన్ను ఎంచిన / ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా ||నన్ను||
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా / ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| / వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ / కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| / నీవు నాతో పరదైసున – నేడే యుందువు / పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| / అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి / క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| / నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు / శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా|| / దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా / యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా|| / శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా / సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా|| / అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును / గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||
నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము / ఊహించలేను నా యేసయ్యా / నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు / ఊహించలేను నా యేసయ్యా (2) / నీదు స్వరము వినకనే నేను / నిను విడచి తిరిగితి నేను / నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| / నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి / అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) / అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ / నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| / నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ / నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) / నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు / నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||
యేసూ నన్ ప్రేమించితివి / ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే / నా పాప భారము తొలగే (2) ||యేసూ|| / నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2) / నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ|| / నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2) / నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ|| / రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2) / క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ||
అయ్యా నా కోసం కల్వరిలో / కన్నీరును కార్చితివా (2) / నశించిపోవు ఈ పాపి కొరకై / సిలువను మోసితివా / అయ్యా వందనమయ్యా / యేసు వందనమయ్యా (2) ||అయ్యా|| / పడిపోయి ఉన్న వేళలో / నా చేయి పట్టి లేపుటకు / గొల్గొతా కొండపై పడిపోయిన / యేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా|| / అనాథ నేను కాదని / సిలువపై నాకు చెప్పుటకు / ఒంటరిగా ఉన్న మరియను / యేసు యోహానును అప్పగించితివి (2) ||అయ్యా వందనమయ్యా||
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా / ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా / నీకేమి చెల్లింతును / నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| / కలుషితుడైన పాపాత్ముడను / నిష్కళంకముగా నను మార్చుటకు (2) / పావన దేహంలో గాయాలు పొంది (2) / రక్తమంత చిందించినావా ||నీకేమి|| / సుందరమైన నీ రూపమును / మంటివాడనైన నాకీయుటకు (2) / వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2) / నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| / పాపము వలన మృతినొందిన / అపరాధినైన నను లేపుటకు (2) / నా స్థానమందు నా శిక్ష భరించి (2) / మరణించి తిరిగి లేచావా ||నీకేమి||
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) / ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) / ఆత్మతో సత్యముతో ఆరాధింతును / నీదు క్రియలు కొనియాడెదను (2) / అత్యున్నతుడా నా యేసయ్యా / నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| / పరమందు దూతలు నిను పొగడుచుందురు / నీవే ప్రభువుల ప్రభువని (2) / నీ ఘన కీర్తిని వివరించగలనా / నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| / ఆకాశమనాడు ఆసీనుడైనవాడా / నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) / ఊహించువాటి కంటే అత్యధికముగా / దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||
అంతే లేని నీ ప్రేమ ధార / ఎంతో నాపై కురిపించినావు / వింతైన నీ ప్రేమ కొంతైన గాని / కాంతింప కృప నాకు చూపించినావు (2) / ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో / పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను / అంతో ఇంతో ఆ ప్రేమను నేను / పంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే|| / పరిశుద్ధుడు పరిశుద్ధుడు / అని దూతలతో పొగడబడే దేవా / పదివేలలో అతి సుందరుడా / నీవేగా అతి కాంక్షనీయుడా (2) / నా దోషములకై ఆ కలువరి సిలువలో / బలియాగమైనావ దేవా (2) / సొంతముగా నే చేసిన నా పాపములన్ని / శాంతముతో సహియించి క్షమియించినావు / పంతముతో నిను వీడి నే పారిపోగా / నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ||అంతే|| / ఏమున్నదీ నాలో దేవా / మంచన్నదే లేనే లేదు / అయినా నీవు నను రక్షించి / నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2) / అర్హతయే లేదు నీ పేరు పిలువ / నీ సొత్తుగా నను మార్చినావా (2) / ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు / నా జీవితమంతయును నీ కొరకే దేవా / నీ సేవలో నేను కొనసాగెదనయ్యా / ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు ||అంతే||
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను / మనకెంతో భాగ్యంబు / వింతైన తన మహిమనంత విడచి మన కొరకై / చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| / పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె / నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| / బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే / ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| / పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు / పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||