తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

విధేయత కలిగి జీవించుటకు|Vidheyatha Kaligi Jeevinchutaku

విధేయత కలిగి జీవించుటకు / జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు / ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు / ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు / యేసయ్యతో ఉంటే సంతోషమే / యేసయ్యతో ఉంటే ఆనందమే / సాతానుతో ఉంటే కష్టాలు / సాతానుతో ఉంటే నష్టాలూ / అందుకని / ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి / దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి / మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి / మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా / సరే ఇప్పుడు ఏం చేయాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / ఏం చెయ్యాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / బుడి బుడి బుడి అడుగులతో / చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) / యేసయ్యను ఆరాధించెదము / యేసయ్యా ఈ రోజు నుండి / నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా

ఏడానుంటివిరా|Aedaa Nuntiviraa

ఏడానుంటివిరా – ఓరన్న / వేగి ఉరికి రారా – ఓరన్న (2) / యాదికొచ్చెరా యాదన్న / యేసు సిత్ర కథ వినరన్న (2) / ఏలియాలో ఏలియాలో ఏలియాలో / యేసే నా రక్షకుడు ఏలియాలో / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా / యేసే నా రక్షకుడు హల్లెలూయా (2) / యూదా దేశమందు – ఓరన్న / బెత్లెహేమునందు – ఓరన్న / పశువుల శాలయందు – ఓరన్న / ప్రభు యేసు జన్మించె – ఓరన్న / చుక్కల రెక్కలు ఎగుర వేయుచు / చల్లని దూతలు పాట పాడిరి (2) / చల్ల చల్లని చలిలోన – ఓరన్న / గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| / పెద్ద పెద్దని వాడై – యేసన్న / ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న / వింత వింతలు చేసె – యేసన్న / ఐదు రొట్టెలు రెండు చేపలు / ఐదు వేల మందికి పంచెను (2) / తుఫాను నణిచెను – యేసన్న / సంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో|| / ఏ పాపమెరుగని – ఓరన్న / యేసయ్య తండ్రిని – ఓరన్న / సిలువ వేయమని – ఓరన్న / కేకలు వేసిరి – ఓరన్న / సిలువ మోసెను శ్రమల నోర్చెను / మూడవ నాడు తిరిగి లేచెను (2) / పరలోకమెళ్లాడు – యేసన్న / త్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||

తెల్లారింది వేళ|Thellaarindi Vela

అన్నయ్య… తెల్లారింది లేరా.. / తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా / మనమంతా ఆయన సృష్టే రా / పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా / వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) / అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ / యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2) / వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను / రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2) / మరచిపోవునా ||తెల్లారింది|| / చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ / విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2) / వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని / నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2) / నీకు తెలియునా ||తెల్లారింది||

మధురం మధురం|Madhuram Madhuram

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం / శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) / దీన మనస్సు – దయ గల మాటలు / సుందర వదనం – తేజోమయుని రాజసం (2) ||మధురం|| / ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని / బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2) / నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు / ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2) / ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం|| / కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను / ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2) / జడియకు నీవు మహిమలో నిలుపుటకు / యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

ప్రభువా నిను కీర్తించుటకు|Prabhuvaa Ninu Keerthinchutaku

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పింపగలనా (2) / ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా / దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) / ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2) / నీ ఋణము నే తీర్చగలనా / తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| / కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి / నా గుడారమునే విశాల పరచి (2) / ఇంతగ నను హెచ్చించుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను దీవించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| / నీ నోటి మాట నా ఊటగ నుంచి / నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) / ఇంతగ నను వాడుకొనుటకు / నే తగుదునా… నే తగుదునా… / వింతగ నను హెచ్చించుటకు / నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||

ఎంత జాలి యేసువా|Entha Jaali Yesuvaa

ఎంత జాలి యేసువా / యింతయని యూహించలేను ||ఎంత|| / హానికరుడ హింసకుడను / దేవదూషకుడను నేను (2) / అవిశ్వాసినైన నన్ను (2) / ఆదరించినావుగా ||ఎంత|| / రక్షకుండ నాకు బదులు / శిక్ష ననుభవించినావు (2) / సిలువయందు సొమ్మసిల్లి (2) / చావొందితివి నాకై ||ఎంత|| / ఏమి నీ కర్పించగలను / ఏమి లేమి వాడనయ్యా (2) / రక్షణంపు పాత్రనెత్తి (2) / స్తొత్రమంచు పాడెద ||ఎంత|| / నీదు నామమునకు యిలలో / భయపడెడు వారి కొరకై (2) / నాథుడా నీ విచ్చు మేలు (2) / ఎంత గొప్పదేసువా ||ఎంత|| / నేను బ్రతుకు దినములన్ని / క్షేమమెల్ల వేళలందు (2) / నిశ్చయముగ నీవు నాకు (2) / ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| / నాదు ప్రాణమునకు ప్రభువా / సేద దీర్చు వాడ వీవు (2) / నాదు కాపరివి నీవు (2) / నాకు లేమి లేదుగా ||ఎంత|| / అందరిలో అతి శ్రేష్ఠుండా / అద్వితీయుడగు యేసయ్యా (2) / హల్లెలూయ స్తోత్రములను (2) / హర్షముతో పాడెద ||ఎంత||

Telugu Songs — Page 69 | UEC Telugu Church