ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఎడబాయని నీ కృప / నను విడువదు ఎన్నటికీ (2) / యేసయ్యా నీ ప్రేమానురాగం / నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| / శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో / కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) / అర్ధమేకాని ఈ జీవితం / ఇక వ్యర్థమని నేననుకొనగా (2) / కృపా కనికరముగల దేవా / నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| / విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు / లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) / దుష్టుల క్షేమమునే చూచి / ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) / దీర్ఘశాంతముగల దేవా / నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| / నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో / నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) / భారమైన ఈ సేవను / ఇక చేయలేనని అనుకొనగా (2) / ప్రధాన యాజకుడా యేసు / నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం / అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం / నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం / కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2) / అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో / ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| / కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం / తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2) / మోషేగా మారిన పసివాడిని / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2) / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా|| / సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం / దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2) / హన్నా చేసిన ఆ త్యాగమే కాదా / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2) / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా|| / కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము / ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2) / ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2) / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||
నా దేవ ప్రభువా నీ చెంతను / సదా వసింపను నా కిష్టము / ఏవైనా శ్రమలు తటస్థమైనను / నీ చెంత నుందును నా ప్రభువా / ప్రయాణకుండను నడవిలో / నా త్రోవ జీకటి కమ్మినను / నిద్రించుచుండగా స్వప్నంబునందున / నీ చెంత నుందును నా ప్రభువా / యాకోబు రీతిగా ఆ మెట్లను / స్వర్గంబు జేరను జూడనిమ్ము / నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా / నీ చెంత నుందును నా ప్రభువా / నే నిద్రలేవగా నా తండ్రి నే / నీకుం గృతజ్ఞత జెల్లింతును / నే చావునొందగా ఇదే నా కోరిక / నీ చెంత నుందును నా ప్రభువా
మహాత్ముడైన నా ప్రభు / విచిత్ర సిల్వ జూడ నా / యాస్తిన్ నష్టంబుగా నెంచి / గర్వం బణంగ ద్రొక్కుదున్ / నీ సిల్వ గాక యో దేవా / దేనిన్ బ్రేమింప నీయకు / నాన్నాహరించు సర్వమున్ / నీ సిల్వకై త్యజింతును / శిరంబు పాద హస్తముల్ / సూచించు దుఃఖ ప్రేమలు / మరెన్నడైన గూడెనా / విషాద ప్రేమ లీ గతిన్? / ముండ్లన్ దుర్మార్గులల్లిన / కిరీట మేసు కుండినన్ / ఈ భూ కిరీటములన్ని / దానం దూగంగ జాలు నే? / లోకంబు నే నేర్పించిన / నయోగ్యమైన యీవి యౌ / వింతైన యేసు ప్రేమకై / నా యావజ్జీవ మిత్తును / రక్షింప బడ్డ లోకమా / రక్షింప జావు బొందిన / రక్షకు-డేసు నిన్ సదా / రావంబు తోడ గొల్వుమా
ఎంత పాపినైనను / యేసు చేర్చుకొనును / అంచు నీ సువార్తను / అంత జాటించుడి / హల్లెలూయ హల్లెలూయ / ఎంత పాపినైనను / యేసు చేర్చుకొనున / టంచు బ్రకటించుడి / మెండుగా క్షమాపణన్ / పూర్ణ సమాధానము / నెంత పాపి కైన దా / నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| / తన దివ్య సిల్వచే / దీసి పాప శాపమున్ / నను బవిత్రపర్చెను / నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| / ఘోర పాపినైనను / నన్ను జేర్చుకొనును / పూర్ణ శుద్ధి నిచ్చును / స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ||
తారా వెలిసెను ఈ వేళ / యేసు పుట్టిన శుభవేళ (2) / వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం / తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2) / రండి వార్తను చాటుదాము / ఆ రక్షణను పంచుదాము (2) ||తారా|| / పశుల పాకే పావనమాయె / మంద గొల్లలే తన వారాయె (2) / జ్ఞానులొచ్చిరి ఆరాధింప / రాజులలో భీతిని నింప (2) ||తారా|| / పాపమెరుగని నీతి పరుడు / లోకమును కాచే రక్షకుడు (2) / కన్య మరియా గర్భమున / పుట్టెను దేవుని అంశమున (2) ||తారా|| / రాజులకు రాజైన తనకు / ఇచ్చుటకు ఏమున్నది మనకు (2) / వెండి బంగారముల కన్నా / హృదములనర్పిస్తే మిన్నా (2) ||తారా||
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ / పొంగి పారెనే – పొంగి పారెనే (2) / నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) / ఆరిపోవు లోక ప్రేమల కన్నా / ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| / నా కన్నీటిని తుడిచినా ప్రేమ / నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా దీన స్థితిని చూచిన ప్రేమ / తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా భారంబును మోసిన ప్రేమ / సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను / యేసు ప్రియ బిడ్డను (2) / సంతసముగ సాగిపోయెదన్ (2) / చెంత యేసు నాతో ఉండగా (2) ||చిన్న|| / ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా / తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2) / తొట్రిల్లను నేను చింతించను (2) / తోడుగా నా యేసు ఉండగా (2) ||చిన్న|| / పచ్చికగల చోటికి నన్ను నడుపును / శాంత జలముతో నన్ను తృప్తి పరచును (2) / నా కాపరి నా ప్రియుడేసుడే (2) / చిరకాలము నన్ను కాయును (2) ||చిన్న||
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) / ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి / చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2) / చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) / విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్! / యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2) / చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) / సాతాను మాటలా? దేవుని మాటలా? / ఏది వింటావు? ఏది చేస్తావు? / కాకి విన్నది చేప విన్నది / గాడిద విన్నది సృష్ఠి విన్నది (2) / యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు / వింటేనే రక్షణ యేసు కర్పణ ||చెవులు|| / ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా? / ఏది వింటావు? ఏది చేస్తావు? / భూతు మాటలా సినిమా పాటలా / వద్దు బాబోయ్ దురద చెవులు (2) / దేవుని మాటలు వినే చెవులు ఉండాలని / బైబిల్లో మన కోసమే వ్రాయబడినది ||చెవులు||
ఇహలోక పాపి కొరకు / ఎనలేని ప్రేమను చూపి / గెలిచావుగా నా ప్రేమను / నా ప్రేమ నీవే యేసు / నీ కృప నాకు చాలు / నేనెలా నిను మరతును ||ఇహలోక || / నీ శక్తియే అద్భుతం / నీ సృష్టియే అద్భుతం (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా / మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) / నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము / ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) / కరుణగల దేవుడు నీవు / కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| / ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి / గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) / నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము / నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| / ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము / నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2) / చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ / మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| / మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు / నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2) / నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న / వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||
మేము భయపడము – ఇక మేము భయపడము / ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము|| / దైవ భ్రష్టులమైన మమ్ము / దివ్యంపుగా రక్షించే (2) / దీవారాత్రులు దేవుడే కాయును ||మేము|| / శత్రు కోటి మమ్ము జుట్టన్ / పాతాళము మ్రింగ జూడన్ (2) / నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము|| / అగ్ని పరీక్షల యందు / వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) / ఏ ఘడియైనను విడువక కాయును ||మేము|| / బలమైన ప్రభు హస్తములు / వలయము వలె మమ్ము జుట్టి (2) / పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము|| / కునుకడు మన దేవుడు / యెన్నడు నిద్రించడు (2) / కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము|| / జీవిత కష్ట నష్టములు / ఆవరించి దుఃఖపరచ (2) / దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము|| / ఇహమందు మన శ్రమలన్ని / మహిమకు మార్చెడు ప్రభున్ (2) / మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||