తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

తీయని స్వరాలతో|Theeyani Swaraalatho

తీయని స్వరాలతో నా మనసే నిండెను / యేసుని వరాలతో నా బ్రతుకే మారెను / భావమధురిమ ఉప్పొంగెను / రాగసుధలతో భాసిల్లెను (2) / పరవశించి నిను స్తుతించి / ఘనపరచెద వైభవముగా ||తీయని|| / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను / నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను / సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను / యేసుతో రాజ్యము చేసే భాగ్యము / నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను / సహాయుడా నీలోనేగా నా సాఫల్యము / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / యేసుని సన్నిధి చేరే భాగ్యము / నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని||

నిరంతరమైన నీ కృపలో|Nirantharamaina Nee Krupalo

నిరంతరమైన నీ కృపలో / నే పొందుచున్న ఆనందమే అది / అవధులు లేని ఆనందమే అది / శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| / అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు / అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు / బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా / మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||

ప్రభుని గృహము|Prabhuni Gruhamu

ప్రభుని గృహము ఆయన మహిమతో / పరిపూర్ణముగా నిండెను (2) / అపరాధములచే ప్రజలందరును / దేవుని మహిమను కోల్పోయిరి (2) / తన మహిమను మన కిచ్చుటకు (2) / యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని|| / కృపా సత్యములు సంపూర్ణముగా / మన మధ్యలో వసించెను (2) / తండ్రి మహిమను తన సుతునిలో (2) / మనమందరము చూచితిమి (2) ||ప్రభుని|| / ప్రభువు యింటిని నిర్మించు చుండె / సజీవమైన రాళ్ళతో (2) / ఆయన మహిమ దానియందుండ (2) / తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని|| / శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు / మానవ హస్తము అందుండదు (2) / క్రయమునిచ్చి స్థలముకొనెను (2) / తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని|| / ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి / తన పునాదిని వేసెను (2) / రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2) / ప్రభువే సర్వము చేసెను (2) ||ప్రభుని|| / సింహాసనముపై కూర్చున్న ప్రభువే / అణగ ద్రొక్కెను శత్రువును (2) / సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2) / వెలిగించెను తన యింటిని (2) ||ప్రభుని|| / దేవుని యిల్లు ముగించబడగా / పైనుండి అగ్ని దిగివచ్చున్ (2) / దహించబడును సర్వ మలినము (2) / ఇంటిని మహిమతో నింపును (2) ||ప్రభుని||

ముళ్ళ కిరీటము|Mulla Kireetamu

ముళ్ళ కిరీటము రక్త ధారలు / పొందిన గాయములు జాలి చూపులు / చల్లని చేతులు పరిశుద్ధ పాదములు / దిగిన మేకులు వేదన కేకలు / ఎంత గొప్పది యేసు నీ హృదయము / మా కోసమే ఇన్ని బాధలా / ఇంత ప్రేమ ఏలనో / సన్నుతింతుము సత్యవంతుడా / నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో / యేసు నీ త్యాగము మరువలేనిది / మా జీవితాలకు విలువ నిచ్చినది / ముళ్ళ కిరీటము రక్త ధారలు / పొందిన గాయములు జాలి చూపులు / లోక పాపము సిలువ భారము / జనుల పక్షము ఘోర మరణము / తండ్రి కార్యము పునరుద్దానము / ఉచిత దానము నిత్య జీవము / యేసు నీ కృప మాకు చాలును / నీ నీతియే మాకు సంపద / నిన్ను కీర్తించుట దీవెన / మా విమోచకా మా రక్షణాధారమా / అందుకోవయా మా స్తుతి అర్పణములు / వందనం ప్రభు వందనం నీకు / నీ ప్రాణదానముకై సదా వందనం / లోక పాపము సిలువ భారము / జనుల పక్షము ఘోర మరణము / తండ్రి కార్యము పునరుద్దానము / ఉచిత దానము నిత్య జీవము

వినరండి నా ప్రియుని విశేషము|Vinarandi Naa Priyuni Visheshamu

వినరండి నా ప్రియుని విశేషము… / వినరండి నా ప్రియుని విశేషము / నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) / నా ప్రియుని నీడలో చేరితిని / ప్రేమకు రూపము చూసితిని (2) / ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే / తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| / మహిమతో నిండిన వీధులలో / బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) / జతగా చేరెదను ఆ సన్నిధిలో / కురిసె చిరుజల్లై ప్రేమామృతము / నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే / జతగా చేరెదను ఆ సన్నిధిలో / నా ప్రేమను ప్రియునికి తెలిపెదను / కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| / జగతికి రూపము లేనప్పుడు / కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) / స్తుతినే వస్త్రముగా ధరించుకొని / కృపన్ జయధ్వనితో కీర్తించెదను / నా ప్రభు యేసు చెంతన చేరెదను / స్తుతినే వస్త్రముగా ధరించుకొని / నా ప్రభు యేసు చెంతన చేరెదను / యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| / తలపుల ప్రతి మలుపు గెలుపులతో / నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) / ఫలము ప్రతిఫలము నే పొందుకొని / ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను / ఆ శుభవేళ నాకెంతో ఆనందమే / ఫలము ప్రతిఫలము నే పొందుకొని / ఆ శుభవేళ నాకెంతో ఆనందమే / నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||