ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2) / నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో / నను నిలుపుమో యేసు ||నిను గాక|| / నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా / నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే / వివరింప తరమా నీ కార్యముల్ / ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా / నా యేసువా – నా యేసువా ||నిను గాక|| / రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో / ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో / చుక్కాని నీవే నా దరి నీవే / నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే / నా యేసువా – నా యేసువా ||నిను గాక||
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు / యేసు కొరకే జీవింతును (2) / నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే / నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే / జీవింతును జీవింతును / జీవింతును జీవింతును (2) ||జీవింతు|| / నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే / బహుమానము పొందగ పరుగిడుదున్ / వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి / కొరకే నే వేగిరపడుదును (2) / నన్ను ప్రేమించిన యేసుని చూతును / నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును / గురి వైపుకే – పరుగెడుదును / వెనుదిరుగను – వెనుదిరుగను (2) ||జీవింతు|| / శ్రమయైనా బాధైననూ – హింసయైనా / కరువైనా ఎదురైననూ / ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా / ఎతైనా లోతైననూ (2) / నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి / నేను విడిపోదునా ప్రభు నీడనుండి / జీవింతును – నా యేసుతో / జయమిచ్చును – నా యేసుడే (2) ||జీవింతు||
భూమ్యాకాశములు సృజించిన / యేసయ్యా నీకే స్తోత్రం (2) / నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2) / హల్లెలూయ లూయ హల్లెలూయా (4) / బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను / దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥ / జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను / ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) ॥భూమ్యాకాశములు॥ / భుజంగములను అణచివేసి కాచినావు నన్ను / ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2) ॥భూమ్యాకాశములు॥ / నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి / నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) ॥భూమ్యాకాశములు॥
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా / ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు / అర్హతేలేని నన్ను – ప్రేమించినావు / జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| / పదే పదే నిన్నే చేరగా / ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) / కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) / కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన / దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం|| / నిరంతరం నీవే వెలుగని / నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) / నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2) / నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా / సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం|| / సర్వసత్యమే నా మార్గమై / సంఘక్షేమమే నా ప్రాణమై (2) / లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2) / నీతోనే నిలవాలి నిత్య సీయోనులో / ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||
అంత్య దినములయందు ఆత్మను / మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2) / దేవా యవ్వనులకు దర్శనము / కలుగజేయుము (2) ||అంత్య|| / కోతెంతో విస్తారము / కోసేడి వారు లేరు / యవ్వనులకు నీ పిలుపునిచ్చి / సేవకు తరలింపుము (2) ||దేవా|| / సౌలు లాంటి యవ్వనులు / దమస్కు మార్గము వెళ్లుచుండగా (2) / నీ దర్శనము వారికిచ్చి / పౌలు వలె మార్చుము (2) ||దేవా|| / సంసోను లాంటి యవ్వనులు / బలమును వ్యర్ధ పరచుచుండగా (2) / నీ ఆత్మ బలమును వారికిచ్చి / నీ దాసులుగా మార్చుము (2) ||దేవా||
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి / కొన్నట్టి సంఘమున / ఎవరు చేరెదరో వారే ధన్యులు / పరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| / అపొస్తలుల బోధను నమ్మి / స్థిరపరచబడిన వారే (2) / ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు / సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| / పరిశుద్ధులతో సహవాసమును / ఎవరు కలిగియుందురో (2) / వారే పొందెదరు క్షేమాభివృద్ధి / క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| / ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే / తన యందు నిలిచెదరు (2) / ప్రకటించెదరు ఆయన మరణ / పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| / పట్టు వదలక సంఘముతో కూడి / ఎవరు ప్రార్ధించెదరో (2) / ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు / బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| / క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు / ఎవరెదురు చూచెదరో (2) / నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు / సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||
పలుకలేని నాకు పాట నేర్పినావు / చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు / మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2) / యేసయ్యా స్తోత్రమయా / యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| / కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు / నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2) / ప్రతి ఉదయం వేకువనే / ఎదురు చూచు ప్రియుడవు నీవు (2) / ప్రతి క్షణము కాపరివై / కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| / అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది / వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2) / ప్రతి పగలు మేఘమై / నీడనిచ్చుఁ దేవుడ నీవు (2) / ప్రతి రాత్రి దీపమై / వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా||
యేసు దేవుని ఆశ్రయించుమా / సోదరా సోదరీ ఈ క్షణమే / విశ్వసించుమా తండ్రిని వేడుమా / గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే / స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? / యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత / యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన / రోగియైన దాసుని కొరకు / శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను / మాట మాత్రం సెలవిమ్మనగా / విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను / విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) / యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| / దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను / దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను / మొక్కుబడి చేసి ప్రార్థించెను / దీవింపబడెను కుమారుని పొందెను / నీవు అడుగుము నీకివ్వబడును (2) / యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే|| / శోధనలనైనా సమస్తమును కోల్పోయిన / యోబువంటి విశ్వాసం గమనించుమా / యధార్ధతతో నిరీక్షించెను / రెండంతల దీవెనలు పొందుకొనెను / సహనము చూపుము సమకూడి జరుగును (2) / యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా / విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) / ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా / పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| / కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె / వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) / పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు / ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| / నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది / తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) / పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము / నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని||
అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో / పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) / భూమియే కంపించెను – చెరసాల అదిరెను / వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) / వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా / రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము / ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని / మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| / ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో / ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో / ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై / యేసుని వేడెదము – శోకము తొలగించమని ||అంధకార|| / మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును / ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును / మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును / దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో ||అంధకార||
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు / నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2) / యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా / నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2) / కన్నవారు నీ దారి నీదన్నారు / నమ్మినవారే నవ్విపోయారు / విరిగి నలిగి నీవైపు చూశాను / తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా|| / ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు / ఎంతగానో ప్రేమించి లాలించావు / నా ఊపిరీ నా ప్రాణమూ / నీ దయలోనే నా జీవితం ||యేసయ్యా|| / నీ మాటలో నా బాటను / నీ ప్రేమలో నా పాటను / సాగిపోనీ నా యాత్రనూ / నీ దరి నేను చేరువరకు ||యేసయ్యా||
సర్వశక్తుని స్తోత్రగానము / సల్పరే జగమెల్లను / నిర్వహించును దాస భారము / నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| / ముదముతో నిర్మానకుండగు / మూల కర్తను బాడరే / వదన మీక్ష్మాన్వoచి దేవుని / వందనముతో వేడరే (2) ||సర్వ|| / వేదపారాయణము సేయుచు / విశ్వమంత జయింపరే / సాదరముగా దేవు నిక మీ / స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| / ఎదను విశ్రాంతిన్ పరేశుని / హెచ్చుఁగా నుతి జేయరే / సదమలంబగు భక్తితో మీ / సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| / చావు పుట్టుక లేనివాడుగ / సంతతము జీవించును / ఈవులిచ్చుచు దన్ను వేడు మ- / హేష్టులను రక్షించును (2) ||సర్వ|| / దాసులై దేవునికి నెదలో / దర్పమును బోగాల్పరే / యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము / నే మరక మైదాల్పరే (2) ||సర్వ||