తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

బేత్లెహేము పురములో|Bethlehemu Puramulo

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి / ఊహలకు అందని అద్భుతము జరిగెను / లోక చరిత మార్చిన దైవకార్యము / కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను / అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము / రారాజు యేసు క్రీస్తుని జననము / అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము / సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము / నన్నాన నా.. నా.. నా న నా న నా (4) / తనన్న నన్నాన నా – (3) తనననా (2) / ధన్యులం హీనులం మనము ధన్యులం / దైవమే మనల కోరి దరికి చేరెను / మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో / పశువుల తొట్టెలోన నిదుర చేసెను / అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు / మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి ||బేత్లెహేము || / పుట్టెను యూదులకు రాజు పుట్టెను / వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి / నడిపెను ఆకశాన తార కనపడి / నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను / తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు / యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి ||బేత్లెహేము || / దొరికెను రక్షకుడు మనకు దొరికెను / తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను / దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను / యేసుని రూపమే మనకు సాక్ష్యము / యేసు జన్మ నింపెను లోకమంత సంబరం / నింపెను నిరీక్షణ కృపయు సమాధానము ||బేత్లెహేము ||

ఆశీర్వాదం|Aasheervaadam

యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక (2) / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) / తన జాలి – నీ పైన / వెయ్యి తరములు – ఉండు గాక / నీ వంశం – సంతానం / వారి పిల్లల – వారి పిల్లలు (4) / నీ ముందు – నీ వెనుక / నీ పక్కన – నీ చుట్టూ / నీతోనూ – నీలోనూ / తన సన్నిధి ఉండు గాక / ఉదయాన – సాయంత్రం / నీ రాక – పోకలలో / కన్నీటిలో – సంతోషంలో / నీ పక్షం – నీ తోడు / నీ నీడగా – ఉంటాడు / మన ప్రభువు – నీ వాడు / నా వాడు – మన వాడు / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)

ఆహా హల్లెలూయా|Thaara Joopina Maargamade

తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… / గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే… / ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2) / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా…. / తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే / గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2) / ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది / పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2) / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. / ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ.. / ఆహా హల్లెలూయా.. ఆహా హల్లె.. లూయా.. ||తార జూపిన|| / దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా / ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2) / పాపమేమో మరణమును వెంట దెచ్చెగా / ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా / భయము లేదు మనకింకా ఓ సోదరా / అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా / భయము లేదు మనకింకా ఓ సోదరీ / అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| / దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా / పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2) / సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా / రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా / బంధకములు తెంపబడెగా ఓ సోదరా / సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా / బంధకములు తెంపబడెగా ఓ సోదరీ / సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా|| / దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా / లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2) / అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా / అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా / సందేహమేల సమయమిదే ఓ సోదరా / నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా / సందేహమేల సమయమిదే ఓ సోదరీ / నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||

దేవా ఇలలోన నీవు|Devaa Ilalona Neevu

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము / మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2) / మా యజమానివి నీవై మమ్ములను నడిపించు / నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2) / వందనములు అందుకో మా యేసయ్యా / కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| / నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా / పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2) / ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా / నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| / నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా / నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2) / శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా / నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా ||వందనములు|| / నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి / నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2) / సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి / కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి ||వందనములు||

Telugu Songs — Page 20 | UEC Telugu Church