ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా / ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) / నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా|| / అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2) / ఎన్నటికీ మారని మంచివాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| / నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2) / మాటతో మహిమలు చేయువాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| / అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2) / చింతలు తీర్చేటి గొప్పవాడా / కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||
పువ్వు విరిసి రాలినా / పరిమళంబు మిగులును (2) / జీవ నీవే తెలుసుకో / నీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| / ధరలో కలిమి లేములు / దరి చేరగానే కరగిపోవును (2) / దూరపర్చుమా లౌకికం / చేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| / పుడమిలో ఫలియించుమా / ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2) / నేల రాలిన పువ్వులా / తేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| / భువిలో బ్రతుకుట కన్నను / భగవంత సన్నిధి పెన్నిధి (2) / భారమనక పిలువవే / కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||
స్తుతియు మహిమ ఘనత నీకే / యుగ యుగములు కలుగును దేవా (2) / పరమందు దూతలతో / ఇహమందు శుద్ధులతో (2) / కొనియాడబడుచున్న దేవా (2) / ఆరాధన ఆరాధన (2) / పరిశుద్ధుడా పరిపూర్ణుడా / పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2) / ఆరాధన ఆరాధన (2) / ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4) / యుగ యుగములకు తర తరములకు / మహిమా నీకే / స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా / స్తుతుల మీద ఆసీనుడా (2) / ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు|| / మహిమా నీకే మహోన్నతుడా / మనసారా నిన్నే స్తుతియింతుము (2) / ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు||
మహిమాన్వితము మనోహరము / నీ దివ్య సన్నిధానము (2) / నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య / నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| / కోరలేదు ధన సంపద / కోరినాను నిను మాత్రమే (2) / ఐశ్వర్యము కంటే అధికుడవు (2) / నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| / జీవపు ఊటలు కల చోటికి / జీవ నదులు పారే చోటికి (2) / ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2) / నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| / తేజోనివాసుల నివాసము / చేరాలనునదే నా ఆశయ్యా (2) / యుగయుగములు నే నీతో ఉండి (2) / నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే||
నూతన సంవత్సరములో / యేసు.. నూతన పరచుము నన్ను / నూతన జీవమిచ్చి / నూతన కృపనిమ్మయా (2) / ఆనందమే సంతోషమే / యేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన|| / పాపమంత మన్నించయ్యా / పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2) / ప్రభు నీతో నడుచుటకు / నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| / వాక్యముతో కడుగుమయా / పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2) / ప్రభు నీతో నడుచుటకు / నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన|| / సత్యముతో నింపుమయా / నీ సాక్షిగ నేనుండుటకు (2) / ప్రభు నీతో నడుచుటకు / నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప / ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) / నీ ప్రేమ బలమైనది / నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| / లోకములో నేనుండగా / నీ కరములు చాపి పిలిచావయ్యా / దుఃఖములో నేనుండగా / నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) / నా ఆధారము నీవే / నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| / నా వారలే నన్ను నిందించినా / నా బంధువులే నన్ను వెలివేసినా (4) / ఎవరున్నా లేకున్ననూ / నీ తోడు చాలునయ్యా / ఏమున్నా లేకున్ననూ / నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| / నా స్థితి నీవు చూసావయ్యా / నా గతినే నీవు మార్చావయ్యా (2) / నా ఆధారము నీవే / నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ / సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2) / ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్ / మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ / నింగి నేల పొంగిపోయే… / ఆ తార వెలసి మురిసిపోయే / సంబరమాయెనే, హోయ్… ||రారాజు|| / వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట / ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు / కన్నుల విందుగా దూతలు పాడగా / సందడే సిందేయంగ మిన్నుల పండగ / సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట / పశువుల పాకలోన ఆ పసి బాలుడంట / చెరగని స్నేహమై….. ||రారాజు|| / మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు / మనసులో దీపమై దారి సూపు దేవుడు / ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా / అందరి తోడునీడై మాయని మమతలా / సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట / వరముగ చేర యేసు పరమును వీడెనంట / మరువని బంధమై….. ||రారాజు||
నిరతము స్తుతియించుము ఓ మనసా / క్రీస్తేసుని స్తుతించు (2) / బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని / కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) / మరువక స్తుతియించుము ఓ మనసా / జయగీతముతో స్తుతించు ||నిరతము|| / వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము / ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) / నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) / ఆ నిజ స్నేహితుని / కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| / అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము / పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) / నీ భారం తొలగించి / తన కృపలో ఆదరించే (2) / నీ ఆత్మ కాపరియైన / పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి / తిరిగి జన్మిస్తే / ఆయన కొరకు జీవించగలం / ఆయనను మనలో చూపించగలం / పరమ దైవమే మనుష్య రూపమై / ఉదయించెను నా కోసమే / అమర జీవమే నరుల కోసమై / దిగి వచ్చెను ఈ లోకమే / క్రీస్తు పుట్టెను – హల్లెలూయ / క్రీస్తు పుట్టెను – హల్లెలూయ / క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| / ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు / శరీరమును ధరించెను / సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు / దీనత్వమును వరించెను / వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2) / దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| / అనాది వాక్యమే కృపా సమేతమై / ధరపై కాలు మోపెను / ఆ నీతి తేజమే నరావతారమై / శిశువై జననమాయెను / పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2) / భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే|| / నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై / కుమారుడై జనించెను / సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై / రాజ్యమునే భరించెను / మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2) / సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే||
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. / పశులపాక పావనమై.. పరవశించెనుగా… / పరవశించెనుగా… / క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా / పశులపాక పావనమై పరవశించెనుగా / గొర్రెల కాపరులు సంతోషముతో / గంతులు వేసెను ఆనందముతో (2) / తూర్పు దిక్కున చుక్క వెలిసెను / లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ / ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను / చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2) / పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే / ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| / సంతోషము సమాధానము కృపా కనికరము / మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2) / సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి / బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున||
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి / దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) / ఆనందము మహదానందము / సంతోషము బహు సంతోషము (2) / మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ / హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| / శోధనలేమైనా – బాధలు ఎన్నైనా / రండి క్రీస్తు నొద్దకు… / రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| / చింతయే నీకున్నా – శాంతియే కరువైనా / రండి క్రీస్తు నొద్దకు… / నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||
తరములు మారుచున్నవి.. దినములు మారుచున్నవి.. / క్షణములు మారుచున్నాను.. గుణములు మారవెందుకు? / వస్త్రములు మారుచున్నవి.. వృత్తులు మారుచున్నవి.. / భాషలు మారుచున్ననూ.. బ్రతుకులు మారవెందుకు? / దేహములు మారుచున్నవి.. ఆహారం మారుతున్నది.. / అంతా మారినా గాని.. ఆలోచన మారదెందుకు? / మార్పు చెందరెందుకు? ||తరములు|| / సంద్రంలో ఉన్న రాళ్లను చూడు / అలల తాకిడికి కరిగిపోవును / శిఖరముపై ఉన్న మంచును చూడు / సూర్యుని వేడిమికి కరిగిపోవును (2) / ప్రభువును నమ్మిన ప్రజలను చూడు (2) / దేవుని మాటలకు కరగరెందుకు? / బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు? / సంఘముకు వెళ్తూ ఉన్నా.. సత్యము వినుచూ ఉన్నా.. / నిత్యము తెలుసుకున్ననూ.. నీతిగా ఉండరెందుకు? / పాపము చేయుటెందుకు? ||తరములు|| / క్రీస్తుతో ఉన్న శిష్యుల చూడు / ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి / పాపములో ఉన్న స్త్రీలను చూడు / వాక్యం విని పాపం మానివేసిరి (2) / దేవుని ఎరిగిన పిల్లల చూడు (2) / భయభక్తులు కలిగి బ్రతకరెందుకు? / దైవ వాక్యమును ఆచరించరెందుకు ? / దేవుని ఎరిగి ఉండిన.. దైవముగ మహిమపరచిన.. / కన్న తండ్రి మనస్సు తెలిసిన.. ప్రియమైన పిల్లలు కావాలి / మనసులు మార్చుకోవాలి ||తరములు||