ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
ఆధారం నీవేనయ్యా / నాకు ఆధారం నీవేనయ్యా (2) / కాలము మారినా కష్టాలు తీరినా / కారణం నీవేనయ్యా (2) నా దేవా ||ఆధారం|| / నీ దీప స్థంభమై నేను / జీవించ చిరకాల ఆశ (2) / నీ దరికి చేరి నను నీకర్పించి / సాక్షిగ జీవింతును (2) ||ఆధారం|| / నీ రాయబారినై నేను / ధైర్యంగా జీవించ ఆశ (2) / నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ / నిను నేను ప్రకటింతును (2) ||ఆధారం||
ఈ మరణము కాదు శాశ్వతము / పరలోకమే మనకు నివాసము (2) / యేసు తెచ్చెను మనకు రక్షణ / ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥ / జగతు పునాది వేయక ముందే / మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) / మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥ / యేసు నామమును ఎరిగిన వారు / పాప శ్రమలకు అర్హులు కారు (2) / తిరిగి లేచెదరు యేసు నామములో / కొలువు తీరెదరు పరలోకంలో (2) / కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥ / కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును / మరణము మబ్బులను కరిగించును (2) / వేదనలు రోదనలు రద్దు చేయును / గతకాల సంగతులు గతించి పోవును (2) / గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని / నీ కృపావరమునే దానముగా దయచేసి (2) / నీ ప్రేమలో పరవశించి / నీ సన్నిధిలో నే చేరి / నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను / దేవా… నా దేవా… / నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| / హృదయము బద్దలై ఏడ్చిన వేళ / కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2) / నీ చిత్తముకై నే ఎదురు చూసి / నీ బలము పొంద సహియింప చేసి / నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| / నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా / భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2) / నా శత్రువుపైనే జయమునిచ్చి / నా ఆశ్రయమై ధైర్యమును నింపి / నా కోట నీవైతివే ||దేవా||
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చించునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2) / నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా / ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య ||పదే పాడనా|| / ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం / మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం / నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము / నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం / నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం ||పదే పాడనా|| / మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము / ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం / నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం / నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం / ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం ||పదే పాడనా||
ఆధారం నీవేనయ్యా / నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా / మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం|| / మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ (2) / పరులకు లెక్కెంతయ్యా / అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా / అల్పునకు ||ఆధారం|| / నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు (2) / నడి యేట వీడిరయ్యా / ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా / ఏకాంతునకు ||ఆధారం|| / శోధనలెగసి – వేదన వెన్నంటి (2) / దుఃఖం పొంగే వేళలో / నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో / నీ దాసునకు ||ఆధారం|| / విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం (2) / నిండు కృపానిధియే / నా విభుడా.. నిండు కృపానిధియే / నా విభుడా ||ఆధారం||
యేసు రక్తము రక్తము రక్తము (2) / అమూల్యమైన రక్తము / నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| / ప్రతి ఘోర పాపమును కడుగును / మన యేసయ్య రక్తము (2) / బహు దు:ఖములో మునిగెనే / చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| / మనస్సాక్షిని శుద్ధి చేయును / మన యేసయ్య రక్తము (2) / మన శిక్షను తొలగించెను / సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| / మహా పరిశుద్ద స్థలములో చేర్చును / మన యేసయ్య రక్తము (2) / మన ప్రధాన యాజకుడు / మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
ఓ దేవా దయ చూపుమయ్యా / దేశాన్ని బాగుచేయుమయ్యా / నీ ప్రజల మొరను అలకించుమా / నీ కృపలో మమ్మును నడిపించుమా / మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| / సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా / నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా / అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా / పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా / ఒకసారి చూడు – ఈ పాప లోకం / నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు / దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||
యెహోవా నను కరుణించుమా / నా దేవా నను దర్శించుమా (2) / ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను / వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను / దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను ||యెహోవా|| / విచారము చేత నా కన్నులు గుంటలై / వేదన చేత నా మనస్సు మూగదై (2) / నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది / నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు|| / అవమానము చేత నా గుండెలో గాయమై / (నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2) / నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది / నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2) ||దినమంతయు||
కలలాంటి బ్రతుకు నాది / కన్నీటి ఊట నాది (2) / కలలోనైనా ఊహించలేదే / కమనీయమైన ఈ బంధం / కల్వరిలో సిలువ త్యాగ బంధం (2) ||కలలాంటి|| / నేనేమిటో నా గతమేమిటో / తెలిసిన వారే క్షమియించలేరే / నా నడకేమిటో పడకేమిటో / ఎరిగిన వారే మన్నించలేరే / హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా / ధన్యునిగా నను మార్చినావే (2) ||కలలాంటి|| / నేనేమిటో నా విలువేమిటో / తెలియకనే తిరుగాడినానే / నీవేమిటో నీ ప్రేమేమిటో / ఎరుగక నిను నే ఎదిరించినానే / హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా / దీవెనగా నను మార్చినావే (2) ||కలలాంటి||
నన్ను కాదనవని – నను కాదనలేవని / నీ చెంతకు నే చేరినా (2) / నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని / నీ మనసే నే కోరినా (2) ||నన్ను|| / లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే / అలసి నీ చెంత చేరినా (2) / సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన / నీవే నా దిక్కని ఎంచినా – (2) ||నన్ను|| / లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే / సొలసి నీ శరణు కోరినా (2) / శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన / నీవే ఆధారమని యెంచినా – (2) ||నన్ను||
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా / నను గన్న తండ్రి నా యేసయ్యా / పూజింతును ఓ పూజార్హుడా / భజియింతును ఓ భవదీయుడా / నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) / నీవే నీవే నా ప్రాణము / నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| / ఒంటరినై తోడులేక దూరమైతిని / ఓదార్చే వారు లేక భారమైతిని (2) / తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2) / నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక|| / శత్రువుల చేతులలో చిక్కుకొంటిని / సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2) / తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే / కష్టమంతయు తీరిపోయెను / బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| / క్షణమైన నీ నామం మరువకుంటిని / మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2) / తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2) / నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక||