తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

నా ప్రాణమా నాలో నీవు|Naa Praanamaa Naalo Neevu

నా ప్రాణమా నాలో నీవు / ఎందుకు కృంగియున్నావు / యెహోవాయందే ఇంకను / నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| / ఈతి బాధల్ కఠిన శ్రమలు / అవమానములే కలిగిన వేళ (2) / నీ కొరకే బలియైన యేసు / సిలువను గూర్చి తలపోయుమా (2) / అల్పకాల శ్రమల పిదప / మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఆప్తులంతా నిను వీడిననూ / శత్రువులే నీపై లేచిననూ (2) / తల్లి అయినా మరచినా మరచున్ / నేను నిన్ను మరువాననినా (2) / యేసుని ప్రేమన్ తలపోయుమా / ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఐశ్వర్యమే లేకున్ననూ / సౌఖ్య జీవితమే కరువైననూ (2) / ప్రభు సేవలో ప్రాణములనే / అర్పించవలసి వచ్చిననూ (2) / క్రీస్తునికే అంకితమై ఆనందించు / ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

రెండే రెండే దారులు|Rende Rende Daarulu

రెండే రెండే దారులు / ఏ దారి కావాలో మానవా / ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) / పరలోకం కావాలో పాతాళం కావాలో / తెలుసుకో మానవా (2) / పరలోకం గొప్ప వెలుగుతో / ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) / సూర్యుడుండడు చంద్రుడుండడు / చీకటుండదు రాత్రియుండదు / నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) / యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) / యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| / పాతాళం అగ్ని గుండము / ఉన్నాది ఘోరపాపుల కోసం (2) / అగ్ని ఆరదు పురుగు చావదు / గప్పగప్పున రగులుచుండును / ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) / అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) / ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే|| / పుడతావు నీవు దిగంబరిగా / వెళతావు నీవు దిగంబరిగా (2) / గాలి మేడలు ఎన్నో కడతావు / నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు / లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) / ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) / అగ్ని లో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||

నా ప్రాణమా నీకే వందనం|Naa Praanamaa Neeke Vandanam

నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా / నా ప్రాణమా నీకే వందనం / నా స్నేహమా నీకే స్తోత్రము (2) / నిను నే కీర్తింతును / మనసారా ధ్యానింతును (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా|| / నిను విడచి ఉండలేనయ్యా / నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) / సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు / నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) / సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ|| / మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ / నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) / వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||

గమ్యం చేరాలని|Gamyam Cheraalani

గమ్యం చేరాలని నీతో ఉండాలని / పగలూ రేయి పరవశించాలని / ఈ నింగి నేలా కనుమరుగైనా / శాశ్వత జీవం పొందాలని / సాగిపోతున్నాను నిన్ను చూడాలని / నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| / భువి అంతా తిరిగి జగమంతా నడచి / నీ జ్ఞానముకు స్పందించాలని / నాకున్నవన్ని సమస్తం వెచ్చించి / నీ ప్రేమ ఎంతో కొలవాలని / అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో / అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| / అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా / శిరమును వంచి సహించాలని / వేదన బాధలు గుండెను పిండినా / నీదు సిలువనే మోయాలని / నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి / నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||

ప్రభు యేసు నా రక్షకా|Prabhu Yesu Naa Rakshakaa

ప్రభు యేసు నా రక్షకా / నొసగు కన్నులు నాకు / నిరతము నే నిన్ను జూడ (2) / అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| / ప్రియుడైన యోహాను పత్మాసులో / ప్రియమైన యేసు నీ స్వరూపము (2) / ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె / ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / లెక్కలేని మార్లు పడిపోతిని / దిక్కులేనివాడ నేనైతిని (2) / చక్కజేసి నా నేత్రాలు దెరచి / గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎరిగి యెరిగి నే చెడిపోతిని / యేసు నీ గాయము రేపితిని (2) / మోసపోతి నేను దృష్టి దొలగితి / దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎందరేసుని వైపు చూచెదరో / పొందెదరు వెల్గు ముఖమున (2) / సందియంబు లేక సంతోషించుచు / ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| / విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ / కొనసాగించువాడా యేసు ప్రభూ (2) / వినయముతో నేను నీ వైపు జూచుచు / విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| / కంటికి కనబడని వెన్నియో / చెవికి వినబడని వెన్నియో (2) / హృదయ గోచరము కాని వెన్నియో / సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| / లోక భోగాలపై నా నేత్రాలు / సోకకుండునట్లు కృప జూపుము (2) / నీ మహిమ దివ్య స్వరూపమును / నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

ప్రభు యేసుని వదనములో|Prabhu Yesuni Vadanamulo

ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) / పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) / పరలోకముకై – చిర జీవముకై (2) / ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| / దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) / దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) / ధన పీడనతో – మృగ వాంఛలతో (2) / దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| / యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) / ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) / ఇల వేడితిని – విలపించుచును (2) / ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని|| / పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) / పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) / పరలోకమే నా – తుది ఊపిరిగా (2) / పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||

Telugu Songs — Page 122 | UEC Telugu Church