ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1604 songs total|By Alphabet|By Popularity
చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా / చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2) / పాపమంటే తెలియదు కాని యేసయ్యా / పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి|| / జీవమంటే తెలియదు కాని యేసయ్యా / నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును / వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును / వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము / చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా / విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| / గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము / లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| / మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి / ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| / దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు / మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త|| / క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు / ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని / చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| / ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) / ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| / కానానులో పెళ్లి విందులో (2) / వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| / సమాధిలో శవాన్ని చూచి (2) / కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు / నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) / పాపము చేయను మోసము చేయను / ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| / బడికి వెళ్లెద గుడికి వెళ్లెద / మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||
యేసు గొరియ పిల్లను నేను / వధకు తేబడిన గొరియ పిల్లను (2) / దినదినము చనిపోవుచున్నాను / యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| / నా తలపై ముళ్ళు గుచ్చబడినవి / నా తలంపులు ఏడుస్తున్నవి (2) / నా మోమున ఉమ్మి వేయబడినది / నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| / నా చేతుల సంకెళ్ళు పడినవి / నా రాతలు చెరిగిపోతున్నవి (2) / నా కాళ్ళకు మేకులు దిగబడినవి / నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
మార్పుచెందవా నీవు మర్పుచెందవా / నీ బ్రతుకు మార్చుకోవా (2) / అనుకూల సమయం ఇదియేనని ఎరిగి / మారు మనసునూ పొందవా (2) / ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని / ఏమున్నది ఈ లోకంలో / ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి / తీర్పున్నది పై లోకంలో (2) / తీర్పు దినమునందున ఆయన ముందు నీవు / నిలిచే ధైర్యం నీకుందా (2) / నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| / దిగంబరిగానే వచ్చావు నీవు / దిగంబరిగా పోతావు / మన్నైన నీవు మన్నై పోతావు / ఏదో ఒక దినమందున (2) / నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు / నీవెంట రావెన్నడు (2) / నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| / ఆత్మని కాక దేహాన్ని చంపే / మనుషులకే భయపడకయ్యా / ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే / దేవునికే భయపడవయ్యా (2) / దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు / నీకంటూ ఏముందిలే (2) / నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా / మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / శాంతి జలములందు పచ్చ గడ్డిలో / కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| / ఒక్కటే ఆశ కలదు యేసయ్యా / చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా|| / శత్రువైన సాతాను ఎదుటను / విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా|| / అంధకార లోయలో అండగా / ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||
నీ చేతి కార్యములు సత్యమైనవి / నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2) / నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి / నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2) / బల సౌందర్యములు / పరిశుద్ధ స్థలములో ఉన్నవి / ఘనతా ప్రభావములు / ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2) / మాపై నీ ముఖ కాంతిని / ప్రకాశింపజేయుము యేసయ్యా / నీ ఆలోచనలు గంభీరములు / నీ శాసనములు హృదయానందకరములు (2) / నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి / నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు|| / ఎవర్లాస్టింగ్ ఫాదర్ / యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ / ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ / నిత్యుడైన తండ్రి / నీ కృప నిరతము నిలచును / నిత్యుడైన తండ్రి – నా యేసయ్య / నీ రూపము ఎంతో మనోహరము / నీ అనురాగము మధురాతి మధురము (2) / నీ నామము నిత్యము పూజింపతగినది / నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||
సుధా మధుర కిరణాల అరుణోదయం / కరుణామయుని శరణం అరుణోదయం (2) / తెర మరుగు హృదయాలు వెలుగైనవి / మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా|| / దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) / నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) / ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది / పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) / నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా|| / లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) / క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) / నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే / నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) / ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా||
క్రీస్తు పుట్టెను పశుల పాకలో / పాపమంతయు రూపు మాపను / సర్వలోకమున్ విమోచింపను / రారాజు పుడమిపై జన్మించెను / సంతోషమే సమాధానమే / ఆనందమే పరమానందమే (2) / అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి / యేసుని చూచి కానుకలిచ్చి / పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే / పరలోక దూతాలి పాట పాడగా / పామరుల హృదయాలు పరవశించగా (2) / అజ్ఞానము అదృష్యమాయెను / అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి || / కరుణగల రక్షకుడు ధర కేగెను / పరమును వీడి కడు దీనుడాయెను (2) / వరముల నొసగ పరమ తండ్రి తనయుని / మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి ||
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4) / నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి / నా హృదయపు ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / కన్నీరు తుడిచే నా యేసయ్యా / ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| / నీతియు న్యాయము నీవే కదా / నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||
నిబ్బరం కలిగి ధైర్యముగుండు / దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) / నిన్ను విడువడు నిన్ను మరువడు / ప్రభువే నీ తోడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా / ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము / నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| / పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2) / ప్రభు కృప మమ్మును విడువడుగా (2) / ఎక్కలేని ఎత్తైన కొండను / ఎక్కించును మా ప్రభు కృప మమ్మును / ప్రభువే మా బలము ||హల్లెలూయా|| / మునుపటి కంటెను – అధికపు మేలును (2) / మా ప్రభు మాకు కలిగించును (2) / రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును / శత్రువు ఎదుటనే భోజనమిచ్చును / ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| / మా అంగలార్పును – నాట్యముగా మార్చెను / బూడిద బదులు సంతోషమిచ్చెను (2) / దుఃఖ దినములు సమాప్తమాయెను / ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను / ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| / స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2) / మా ప్రభు మమ్మును మరువడుగా (2) / చూడుము నా అరచేతిలనే / చెక్కితి నిను అన్నాడు ప్రభువు / ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| / రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2) / మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) / ఇదిగో నేనొక నూతన క్రియను / చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను / ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| / మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2) / మా ప్రభు మాకు అందించును (2) / ప్రాకారముగల పట్టణములోనికి / ప్రభువే మమ్మును నడిపింపచేయును / ప్రభువే మా పురము ||హల్లెలూయా||