తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

1604 songs total|By Alphabet|By Popularity

వీచే గాలుల్లో|Veeche Gaalullo

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే / నీవే నా మంచి యేసయ్యా / ప్రవహించే సెలయేరై రావా నీవు / జీవ నదిలా మము తాకు యేసయ్యా / నీవే నా ప్రాణము – నీవే నా సర్వము / నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి / నీలోనే తరియించాలి ప్రభు (2) / నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం / నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| / ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం / కడవరకు కాపాడే నీవే నా దైవం / పోషించే నా తండ్రి నీవే ఆధారం / కరుణగల నీ మనసే నాకు చాలును / నీ మాటలే మాకు ఉజ్జీవం / నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| / ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం / ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై / నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే / నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి / మా కోసమే నీవు మరణించి / పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

సమర్ధవంతుడవైన|Samardhavanthudavaina

సమర్ధవంతుడవైన నా యేసయ్యా / సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2) / నా స్తుతి యాగము నీకే / నా ప్రాణార్పణ నీకే / నా సర్వస్వము నీకే / నా జీవన గానము నీకే ||సమర్ధ|| / పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా / ఉంచువాడవు నీవే యేసయ్యా / ఆత్మ జలములను నవ్యముగా / ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2) / నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) / దూతల చేతులలో / నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| / శత్రువు చరలోనుండి నను భద్రముగా / నిల్పువాడవు నీవే యేసయ్యా / రక్షణ వస్త్రమును నిత్యము నాపై / కప్పువాడవు నీవే యేసయ్యా (2) / జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2) / రక్తపు బిందువుతో / నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ||

కన్నులనెత్తి పైరుల చూడు|Kannulaneththi Pairula Choodu

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) / ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) / కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) / ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| / మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) / వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| / విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) / జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| / మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) / సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా|| / మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) / నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

నీ ప్రేమ ఎంతో|Nee Prema Entho

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు / యేసయ్యా నీ ప్రేమ మధురం / యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ|| / మరచిపోనిది నీ ప్రేమా / నన్ను మార్చుకున్నది నీ ప్రేమా / కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా / జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / సిలువకెక్కెను నీ ప్రేమా / నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా / నాకై మరణించెను నీ ప్రేమా / నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / తల్లికుండునా నీ ప్రేమా / సొంత చెల్లికుండునా నీ ప్రేమా / అన్నకుండునా నీ ప్రేమా / కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / త్యాగమున్నది నీ ప్రేమలో / దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో / బలమున్నది నీ ప్రేమలో / గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ||

నే యేసుని వెలుగులో|Ne Yesuni Velugulo

నే యేసుని వెలుగులో నడిచెదను / రాత్రింబగలాయనతో నడిచెదను / వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను / యేసుడే నా రక్షకుడు / నడిచెద నే ప్రభు యేసునితో / నడిచెద నే ప్రభు హస్తముతో / కాంతిలో నుండగ జయగాంతును / యేసునే నే వెంబడింతును / నే యేసుని వెలుగులో నడిచెదను / గాడంబగు చీకటిలో భయపడను / ఆత్మతో పాడుచు సాగిపోవుదును / యేసుడే నా ప్రియుండు ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును / సర్వమిచ్చెదను చెంతనుండెదను / యేసుడే ప్రేమామయుడు ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / దిన సహాయము నే పొందెదను / సుఖ దుఃఖమైన మరణంబైన / యేసుడే నా యండనుండును ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / నా దృష్టిని ప్రభుపై నుంచెదను / సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను / యేసుడే నా చెంత నుండును ||నడిచెద||

ఈ తరం యువతరం|Ee tharam yuvatharam

ఈ తరం యువతరం / ప్రభు యేసుకే అంకితం / నా బలం యవ్వనం / ప్రభు యేసుకే సొంతము / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు వార్త చాటుదాం / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| / సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా / ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా / దేవుని సేవ వ్యాపారమాయే / ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| / నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా / యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా / యేసయ్య రాకడ సామీపమాయే / ఆ వార్త చాటను వేగిర రావే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

ఇబాదత్ కరో|Ibaadath karo

హే దునియా కే లోగో ఉంఛీ ఆవాజ్ కరో / గావో ఖుషీ కే గీత్ / ఉస్-కా గున్-గాన్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో (2) / యాద్ రకో కీ వహీ ఇక్ ఖుదా హై / హమ్ కో యే జీవన్ ఉసీనే దియా హై / ఉస్ ఛారగాహ్ సే హమ్ సబ్ హై ఆయే / హమ్-దో సనా కే హమ్ గీత్ గాయే / రబ్ క తుమ్ శుక్ర్ కరో / ఉంఛీ ఆవాజ్ కరో / గావో ఖుషీ కే గీత్ / ఉస్-కా గున్-గాన్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో / నామే ఖుదావన్ కిత్-నా ముబారక్ / మేరా ఖుదావన్ కిత్-నా భళా హై / రెహ్-మత్ హై ఉస్-కీ సది-యో పురానీ / వఫా కా అజర్ సే యహీ సిల్-సిలా హై / ఉస్-పర్ ఈమాన్ ధరో, ఉస్-కే ఘర్ ఆవ్ ఛలో / గావో ఖుషీ కే గీత్ / ఉస్-కా గున్-గాన్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో / ఇబాదత్ కరో ఉస్-కీ ఇబాదత్ కరో ||హే దునియా||

Telugu Songs — Page 114 | UEC Telugu Church