ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
4 songs found|By Alphabet|By Popularity
పోదాము పోదాము పయనమోదాము / సువార్త చెప్ప పోదాము (2) / అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము / సువార్త చాటింప సాగిపోదాము (2) / ఆ జాతి ఈ జాతి ఏ జాతండి / పరిశుద్దతే మన సొంత జాతండి (2) / ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి / కానాను దేశమే మన ఊరండి (2) / ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి / క్రీస్తు రక్తమే పాపం బాపునండి (2)
నిన్ను విడచి తిరిగితిని / నివాసముకై వేతికేతిని / నన్ను నేను కోల్పోతిని / పోల్చలేని స్థితికి మారితి / నీ కృపలోనే నన్ను దాచావయ్యా / మార్గమును ఏర్పరచి నన్ను నడిపించావు / తండ్రి తండ్రి / నేనూ నీ కుమారుని / నిన్ను విడచి ఏటువేల్లేదా / నీవేగా నా ఆశ్రయం / గ్రహించలేకపోతిని / నీ సొత్తై నే ఉన్నానని / నీ దృష్టిని నాపై నిలిపితివి / నీ నీడలో నన్ను దాచితివి / నీ కను పాపనై ఉన్నా తండ్రి / నీ కను పాపనై ఉన్నా తండ్రి / పరాయుడను కాను / నీవు వెలివేయలేదు / అవమానము నుండి కాపాడినావు / నీ కౌగిటితో నన్ను ముద్దాడినావు / ప్రశస్త వస్త్రములు నా కిచ్చినావు
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ / ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడీ…హల్లేలూయ ||ఆకాశ|| / ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా / సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ ||ఆకాశ|| / సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా / వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ ||ఆకాశ||
యేసు చాలును యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ / నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు|| / సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను / లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| / పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును / అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| / నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను / హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||