తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Songs of Zion

116 songs found|By Alphabet|By Popularity

నే స్తుతించెదను|Ne Sthuthinchedanu

నే స్తుతించెదను యేసు నామమును / భజించెదను క్రీస్తు నామమును / స్తుతికి యేసే యోగ్యుడని / నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| / ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ / వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) / పాపిని నన్ను రక్షించుటకై / చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| / పాపములన్నియు బాపుటకై / శాపములన్నియు మాపుటకై (2) / ఏ పాపమెరుగని ఆ పావనుడు / శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| / శోధన కాలముల యందున / వేదన కాలముల యందున (2) / నాధుడు యేసు మనతోడనుండ / అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| / ఎనలేని ప్రేమతో కౌగిలించెను / ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) / మహామహుండు మహిమ ప్రధానుడు / మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| / రాజాధిరాజు ప్రభు యేసే / దేవాదిదేవుడు మన యేసే (2) / పరమందు దూతలు యిహమందు నరులు / పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||

దేవుడొక నగరము|Devudoka Nagaramu

దేవుడొక నగరము మన కొరకై / సిద్ధపరచుచుండె నుండుటకై (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక|| / మేలిమి బంగారము అద్భుత నగరం / విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) / రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / నగర ప్రాకారములు ఎత్తైనవి / సూర్య కాంతములచే కట్టబడెను (2) / ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు / పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) / పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ఆ నగర వీధులు మేలిమి బంగారం / ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) / ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును / ఆయనే దీపము నాలయమై యుండును (2) / జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / జయవంతుల కొరకే ఆ నగరం / పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) / విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||

ఆదియంతము లేనివాడా|Aadiyanthamu Lenivaadaa

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా / నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే / అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి / అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| / ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా / యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము|| / యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి / మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము|| / పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా / కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము|| / దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు / కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము||

భూమియు దాని సంపూర్ణత|Bhoomiyu Daani Sampoornatha

భూమియు దాని సంపూర్ణత లోకము / దాని నివాసు లెహోవావే (2) / ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2) / ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు|| / యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2) / యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు|| / వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2) / నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు|| / నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2) / వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు|| / గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2) / మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు|| / మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2) / యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు|| / మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2) / ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||

దుష్టుల ఆలోచన చొప్పున|Dushtula Aalochana

దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2) / పాపుల మార్గములయందు నిలిచి యుండక (2) / అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2) / ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2) / యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2) / ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2) / కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2) / కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2) / ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2) / ఆయన చేయునదియెల్ల సఫలమగును (2) / దుష్ట జనులు ఆ విధముగా నుండక (2) / పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు (2) / న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు (2) / నీతిమంతుల సభలో పాపులును నిలువరు (2) / నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును (2) / నడుపును దుష్టుల దారి నాశనమునకు (2) ||దుష్టుల||

అన్యజనులేల|Anya Janulela

అన్యజనులేల లేచి / గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల / జనములేల వ్యర్థమైన / దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల|| / భూలోక రాజులు లేచి / వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు / వారి పాశములను తెంపి / పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల|| / ఆకాశ వాసుండు వారిని / అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు / వారలతో పల్కి కోపముతో / వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల|| / పరిశుద్ధమైన నాదు / పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన / నారాజు నాసీనునిగా జేసి / యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల|| / కట్టడ వివరింతు నాకు / యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు / నీవు నా కుమారుడవు / నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల|| / నన్ను అడుగుము నీకు / జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము / దిగంతముల వరకు / స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల|| / ఇనుప దండముతో నీవు / వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో / కుండను పగులగొట్టునట్లు / వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల|| / ఓ రాజులారా మీరు / జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా / ఓ భూపతులారా మీరు / నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||

ప్రభుని రాకడ|Prabhuni Raakada

ప్రభుని రాకడ – ఈ దినమే / పరుగులిడి రండి – సుదినమే (2) / పరమునందుండి – మన ప్రభువు / ధరకు నరుగును – పాలనకై (2) / బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని|| / సిద్ధులగు వారిన్ – మన యేసు / శుద్ధి జేయునిలన్ – పరమునకై (2) / బుద్ధిహీనులను – శ్రమలచేత / బద్ధులుగ జేయున్ – వేదనతో (2) / బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని|| / స్వరముతో వచ్చున్ – అధికారి / మహిమతో మరలున్ – తన దూత (2) / సూర్యచంద్రునిలన్ – తారలతో / జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2) / పగలు రాత్రియగున్ – త్వరపడుము ||ప్రభుని|| / మొదట లేతురు – సజీవులై / ప్రభునియందుండు – ఆ మృతులు (2) / మరల అందరము – ఆ ధ్వనితో / పరము జేరుదుము – ధరనుండి (2) / ధన్యులగుదుము – పరికించు ||ప్రభుని|| / వెయ్యియేండ్లు – పాలించెదరు / ప్రియుని రాజ్యమున – ప్రియులు (2) / సాయం సమయమున – చేరి / నెమలి కోకిలలు – రాజున్ (2) / పాడి స్తుతించును – ఆ దినము ||ప్రభుని|| / గొర్రె మేకలును – ఆ చిరుత / సింహజాతులును – ఒక చోట (2) / భేధము లేక – బరుండి / గరిక మేయును – ఆ వేళ (2) / కలసి మెలగును – భయపడక ||ప్రభుని|| / న్యాయ నీతులన్ – మన ప్రభువు / ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2) / సాక్షులుగ నిలుతుం – అందరము / స్వామియేసునకు – ధ్వజమెత్తి (2) / చాటి యేసునకు – ఓ ప్రియుడా ||ప్రభుని||

క్రీస్తేసు ప్రభువు|Kreesthesu Prabhuvu

క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి / కొన్నట్టి సంఘమున / ఎవరు చేరెదరో వారే ధన్యులు / పరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| / అపొస్తలుల బోధను నమ్మి / స్థిరపరచబడిన వారే (2) / ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు / సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| / పరిశుద్ధులతో సహవాసమును / ఎవరు కలిగియుందురో (2) / వారే పొందెదరు క్షేమాభివృద్ధి / క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| / ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే / తన యందు నిలిచెదరు (2) / ప్రకటించెదరు ఆయన మరణ / పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| / పట్టు వదలక సంఘముతో కూడి / ఎవరు ప్రార్ధించెదరో (2) / ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు / బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| / క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు / ఎవరెదురు చూచెదరో (2) / నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు / సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు||

Telugu Songs by Songs of Zion — Page 3 | UEC Telugu Church