ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
21 songs found|By Alphabet|By Popularity
యెహోవాను సన్నుతించెదన్ / ఆయనను కీర్తించెదను / ప్రభువును ఘనపరచెదన్ / ఆ నామమునే గొప్ప చేసెదన్ (2) / హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను|| / నాకున్న సర్వము నన్ను విడచినను / నావారే నన్ను విడచి నిందలేసినను (2) / నా యేసయ్యను చేరగా / నేనున్నానన్నాడుగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| / నాకున్న భయములే నన్ను కృంగదీయాగా / నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2) / నా యేసయ్యను చేరగా / నన్నాదరించెనుగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| / నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా / నాపైన చీకటియే నాన్నవరించెగా (2) / నా దీపము ఆరుచుండగా / నా యేసయ్య వెలిగించెగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది / దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) / రాజులకు రాజు పుట్టాడని / యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| / మందను విడచి మమ్మును మరచి / మేమంతా కలిసి వెళ్ళాములే / ఆ ఊరిలో ఆ పాకలో / స్తుతి గానాలు పాడాములే (2) / సంతోషమే ఇక సంబరమే / లోక రక్షణ ఆనందమే / స్తోత్రార్పణే మా రారాజుకే / ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| / బంగారమును సాంబ్రాణియు / బోళంబును తెచ్చాములే / ఆ యింటిలో మా కంటితో / నిను కనులారా గాంచాములే (2) / మా ఇమ్మానుయేలువు నీవేనని / నిను మనసారా కొలిచాములే / మా యూదుల రాజువు నీవేనని / నిను ఘనపరచి పొగిడాములే ||తార||
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ / నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2) / యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా / యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా|| / గతమును మన్నించి గుణవంతునిగా చేసి / నన్ను మలచి నన్నే మరిపించి (2) / మనిషిగా మార్చినావు / నీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా|| / కన్నీరు తుడచి కష్టాలు తీర్చి / అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2) / మనిషిగా మార్చినావు / మాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా||
ఈ తరం యువతరం / ప్రభు యేసుకే అంకితం / నా బలం యవ్వనం / ప్రభు యేసుకే సొంతము / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు వార్త చాటుదాం / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| / సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా / ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా / దేవుని సేవ వ్యాపారమాయే / ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| / నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా / యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా / యేసయ్య రాకడ సామీపమాయే / ఆ వార్త చాటను వేగిర రావే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||
కన్నీరే మనిషిని బాధిస్తుంది / ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) / కన్నీరే కాదనుకుంటే / ఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే|| / కన్నీరే మరియను బాధించింది / ఆ కన్నీరే మరణము గెలిపించింది (2) / కన్నీరే కాదనుకుంటే / లాజరు తిరిగి బ్రతికేనా (2) / కన్నీరే వలదనుకుంటే / దేవుని మహిమ కనిపించేనా (2) ||కన్నీరే|| / కన్నీరే హన్నాను బాధించింది / ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2) / కన్నీరే కాదనుకుంటే / సమూయేలు జన్మించేనా (2) / కన్నీరే వలదనుకుంటే / దేవుని కృపను గాంచేనా (2) ||కన్నీరే||
నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన / మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన / చాలయ్య చాలీ దీవెనలు చాలు / మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) / గురిలేని నన్ను గుర్తించినావే / ఎనలేని ప్రేమను చూపించినావే / వెలలేని నాకు విలువిచ్చినావే / విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా|| / చేజారిన నాకై చేచాచినావే / చెదరిన నా బ్రతుకును చేరదీసినావే / చెరనుండి నన్ను విడిపించినావే / చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా|| / నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే / కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే / నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే / నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య / నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2) / నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య / నీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే|| / కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా / కన్నవారే కాదని నన్ను నెట్టినా (2) / కారు చీకటులే నన్ను కమ్మినా / కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2) / కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| / చేయని నేరములంటకట్టినా / చేతకాని వాడనని చీదరించినా (2) / చీకు చింతలు నన్ను చుట్టినా / చెలిమే చితికి నన్ను చేర్చినా (2) / చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే||
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా / నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) / నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) / నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| / కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా / ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) / నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా / నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| / అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా / మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) / కోపతాపములు దూరపరచయ్యా / అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2) / మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2) / వాడను యేసయ్యా / ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా|| / అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని / దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని / యేసయ్యా నన్ను విడువకయ్యా (2) / దిక్కులేని వాడను / వాడను యేసయ్యా / చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా|| / భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని / భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని / యేసయ్యా నన్ను కరుణించుమా (2) / ఫలములేని వాడను / వాసిని యేసయ్యా / పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా|| / బోధ ఉన్నా బ్రతుకులేని / పిలుపు ఉన్నా ప్రయాసపడని / సేవ ఉన్నా సాక్ష్యములేని / సంఘము ఉన్నా ఆత్మలులేని / యేసయ్యా నన్ను నింపుమయ్యా (2) / ఆత్మలేని వాడను / పాదిరిని యేసయ్యా / మాదిరి లేని కాపరిని (2) ||కనులున్నా||