ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
63 songs found|By Alphabet|By Popularity
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా / నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) / నీ వాక్యమే నా పరవశము / నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) / నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ కృపయే నా ఆశ్రయము / నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) / నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ సౌందర్యము యెరూషలేము / నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) / నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా / చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన / నీ నేత్రాలంకృతము (2) / పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో / క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2) / ఆప్యాయతకు నోచుకొనని / నను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న|| / అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు / తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2) / అగ్ని వంటి శోధనలను / తప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||
ఉత్సాహ గానము చేసెదము / ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) / హల్లెలూయ యెహోవ రాఫా / హల్లెలూయ యెహోవ షమ్మా / హల్లెలూయ యెహోవ ఈరే / హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) / అమూల్యములైన వాగ్ధానములు / అత్యధికముగా ఉన్నవి (2) / వాటిని మనము నమ్మినయెడల / దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| / వాగ్ధాన దేశము పితరులకిచ్చిన / నమ్మదగిన దేవుడాయన (2) / జయించిన వారమై అర్హత పొంది / నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ||
కృపా క్షేమము నీ శాశ్వత జీవము / నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2) / మహోన్నతమైన నీ ఉపకారములు / తలంచుచు అనుక్షణము పరవశించనా / నీ కృపలోనే పరవశించనా / నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే / లెక్కకు మించిన దీవెనలైనాయి (2) / అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే / కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2) / నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే / పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2) / కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే / గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా / నా హృది నీ కొరకు పదిలపరచితిని (2) / బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా / అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము||
కృపామయుడా – నీలోనా (2) / నివసింప జేసినందున / ఇదిగో నా స్తుతుల సింహాసనం / నీలో నివసింప జేసినందునా / ఇదిగో నా స్తుతుల సింహాసనం / కృపామయుడా… / ఏ అపాయము నా గుడారము / సమీపించనీయక (2) / నా మార్గములన్నిటిలో / నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| / చీకటి నుండి వెలుగులోనికి / నన్ను పిలచిన తేజోమయా (2) / రాజవంశములో / యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| / నీలో నిలిచి ఆత్మ ఫలము / ఫలియించుట కొరకు (2) / నా పైన నిండుగా / ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| / ఏ యోగ్యత లేని నాకు / జీవ కిరీటమిచ్చుటకు (2) / నీ కృప నను వీడక / శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||
యేసు రాజు రాజుల రాజై / త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె / హోసన్నా జయమే – హోసన్నా జయమే / హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| / యోర్దాను ఎదురైనా / ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) / భయము లేదు జయము మనదే (2) / విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| / శరీర రోగమైనా / అది ఆత్మీయ వ్యాధియైనా (2) / యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) / రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| / హల్లెలూయ స్తుతి మహిమ / ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) / యేసు రాజు మనకు ప్రభువై (2) / త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా||
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా / స్తుతి మహిమలు నీకే / నా ఆత్మలో అనుక్షణం / నా అతిశయము నీవే – నా ఆనందము నీవే / నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| / నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) / నీ తోటలోని ద్రాక్షావల్లితో / నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి|| / నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2) / నీకిష్టమైన పాత్రను చేయ / నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి|| / నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2) / త్రియేక దేవా ఆదిసంభూతుడా / నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి||
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా / దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా / యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు / నా మనసార నీ సన్నిధిలో / సాగిలపడి నమస్కారము చేసేదా / సాగిలపడి నమస్కారము చేసేదా (2) / ప్రతి వసంతము నీ దయా కిరీటమే / ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) / ప్రభువా నిన్నే ఆరాధించెద / కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| / పరిమలించునే నా సాక్ష్య జీవితమే / పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) / పరిశుద్ధాత్మలో ఆనందించెద / హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| / పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే / నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) / యెహోవ నిన్నే మహిమ పరచెద / స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
నీ కృప నాకు చాలును / నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) / నీ కృప లేనిదే నే బ్రతుకలేను / జల రాసులన్ని ఏక రాసిగా / నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) / అవి భూకంపాలే అయినా / పెను తుఫానులే అయినా (2) / నీ కృపయే శాశించునా / అవి అణగిపోవునా (2) ||నీ కృప|| / జగదుద్పత్తికి ముందుగానే / ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) / నీ పిలుపే స్థిరపరచెనే / నీ కృపయే బలపరచెనే (2) / నీ కృపయే ఈ పరిచర్యను / నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా / జీవింతును నిత్యము నీ నీడలో / ఆస్వాదింతును నీ మాటల మకరందము / యేసయ్య నీతో జీవించగానే / నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే / నాట్యమాడేను నా అంతరంగము / ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల|| / యేసయ్య నిన్ను వెన్నంటగానే / ఆజ్ఞల మార్గము కనిపించెనే / నీవు నన్ను నడిపించాగలవు / నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల|| / యేసయ్య నీ కృప తలంచగానే / నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే / నీవు నాకిచ్చే మహిమ ఎదుట / ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||
నజరేయుడా నా యేసయ్య / ఎన్ని యుగాలకైనా / ఆరాధ్య దైవము నీవేనని / గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| / ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) / శూన్యములో ఈ భూమిని / వ్రేలాడదీసిన నా యేసయ్య (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| / అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) / జలములలోబడి నే వెళ్ళినా / నన్నేమి చేయవు నా యేసయ్యా (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| / సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) / సీయోనులో నిను చూడాలని / ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) / నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
నేడో రేపో నా ప్రియుడేసు / మేఘాలమీద ఏతెంచును / మహిమాన్వితుడై ప్రభు యేసు / మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| / చీకటి కమ్మును సూర్యుని / చంద్రుడు తన కాంతినీయడు (2) / నక్షత్రములు రాలిపోవును / ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| / కడబూర స్వరము ధ్వనియించగా / ప్రియుని స్వరము వినిపించగా (2) / వడివడిగ ప్రభు చెంతకు చేరెద / ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో|| / నా ప్రియుడేసుని సన్నిధిలో / వేదన రోదనలుండవు (2) / హల్లెలూయా స్తుతిగానాలతో / నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||