తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Diyya Prasada Rao

20 songs found|By Alphabet|By Popularity

నన్నెంతగానో ప్రేమించెను|Nannenthagaano Preminchenu

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను / నా యేసుడు నా పాపము – నా శాపము / తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| / సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) / పడనీయక దరి చేరనీయక (2) / తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| / సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) / నేర్పించెను నాకు చూపించెను (2) / వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| / కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) / నా కోసమే యేసు శ్రమ పొందెను (2) / నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత|| / ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) / ఏమిత్తును నేనేమిత్తును (2) / నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||

యేసు సర్వోన్నతుడా|Yesu Sarvonnathudaa

యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా…. / యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా / మానవుల రక్షించే మహా దేవుడా (2) / నశియించినదానిని వెదకి రక్షించినావా (2) / చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2) / వందనమయ్యా నీకు వందనమయ్యా / యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2) / కానాను పురమున కళ్యాణ సమయాన (2) / నీటిని ద్రాక్షా రసముగ మార్చి / విందును పసందుగా మార్చినావు (2) ||వందనమయ్యా|| / నాయీను గ్రామాన విధవరాలి కుమారుని (2) / పాడెను ప్రేమతో ముట్టి / కన్నతల్లి కన్నీరు తుడిచినావు (2) ||వందనమయ్యా|| / గెరాసేను దేశాన సమాధుల స్థలములోన (2) / సేన దయ్యమును వదిలించి / నశియించే ఆత్మను రక్షించినావు (2) ||వందనమయ్యా||