ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
20 songs found|By Alphabet|By Popularity
గాయపడిన నీ చేయి చాపుము దేవా / నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) / సిలువే నాకు విలువైనది (2) / అదియే నా బ్రతుకున గమ్యమైనది / ఎంతో రమ్యమైనది ||గాయపడిన|| / ఎండిన భూమిలో మొలచిన లేత / మొక్క వలె నీవు ఎదిగితివి (2) / సురూపమైనా ఏ సొగసైనా (2) / లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన|| / మనుషులందరు చూడనొల్లని / రూపముగా నాకై మారితివి (2) / మా రోగములు మా వ్యసనములు (2) / నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన|| / నీవు పొందిన దెబ్బల వలన / స్వస్థత నాకు కలిగినది (2) / నీవు కార్చిన రక్తమే (2) / మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||
న్యాయాధిపతి అయిన దేవుడు / నిను తీర్పు తీర్చేటి వేళలో / ఏ గుంపులో నీవుందువో / యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి|| / ఆకలితో అలమటించగా / దాహముతో తపియించగా (2) / రోగముతో కృశియించగా (2) / నను చేర్చుకొనలేదు నీవెందుకు / అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి|| / గ్రహియించుకో నీదు గమ్యము / విడనాడు పాప గతమును (2) / లేదింక నీకు తరుణము (2) / ప్రభునాశ్రయించుటే బహు క్షేమము / ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి||
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం / విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) / యేసు రక్తమే జయము / క్రీస్తు రక్తమే విజయము (2) / పాప క్షమాపణ యేసు రక్తములోనే / శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| / తండ్రి చిత్తము నెరవేర్చ / గెత్సేమనేలో ప్రార్ధింప (2) / చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే / ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / శాపానికి ప్రతిఫలము ముళ్ళు / ముండ్ల కిరీటముతో చెల్లు (2) / ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు / ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / నీ చేతుల పనిని ఆశీర్వదింప / ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) / కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే / బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||
కొడవలిని చేత పట్టి కోత కోయుము / తెల్లబారిన పొలములన్నియు (2) / నశియించు ఆత్మల భారము కలిగి / ఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని|| / సర్వ సృష్టికి సువార్త ప్రకటన / ప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2) / ఎన్నడూ దున్నని భూములను చూడు (2) / కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని|| / పిలిచిన వాడు నమ్మదగినవాడు / విడువడు నిన్ను ఎడబాయడు (2) / అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2) / అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే నాకు లాభము / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీ కృప నాకు చాలును ఇలలో / నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీవే నా గొప్ప కాపరివి / విడువను నను ఎడబాయనంటివి (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
అంజలి ఘటియింతు దేవా (2) / నీ మంజుల పాదాంబుజముల కడ / నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| / పరమాత్మ నీ పాద సేవ / చిరజీవ సంద్రాన నావ (2) / సిలువ మహా యజ్ఞ సింధూర / రక్తా రుణమేయ సంభావనా (2) / దేవా దేవా యేసు దేవా (2) / అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| / అవతార మహిమా ప్రభావ / సువిశాల కరుణా స్వభావ (2) / పరలోక సింహాసనాసీన / తేజో విరాజమాన జగదావనా (2) / దేవా దేవా యేసు దేవా (2) / అంజలి ఘటియింతు దేవా ||అంజలి||
రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని… / రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని (2) / కన్నులార నిన్ను చూడాలని (2) / కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| / యదార్థ హృదయముతో నడచుకొందును / ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) / భక్తిహీనుల క్రియలు నాకంటనీయను / మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| / దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను / నా పొరుగు వారిని దూషింపను (2) / అహంకారము గర్వము నంటనీయను / నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| / నిర్దోష మార్గముల నడచుకొందును / మోసము నా ఇంట నిలువనీయను (2) / అబద్ధికులెవ్వరిని ఆదరింపను / భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||
నిత్య జీవపు రాజ్యములో / సత్య దేవుని సన్నిధిలో (2) / నిత్యం యేసుని స్నేహముతో / నిత్యమానందమానందమే (2) / వ్యాధి భాధలు లేవచ్చట / ఆకల్దప్పులు లేవచ్చట (2) / మన దీపము క్రీస్తేలే / ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| / కడు తెల్లని వస్త్రముతో / పరి తేజో వాసులతో (2) / రాజ్యమునేలుదుములే / యాజకులము మనమేలే (2) ||నిత్య|| / ప్రతి భాష్పబిందువును / ప్రభు యేసే తుడుచునులే (2) / ఇక దుఖము లేదులే / మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| / పరిశుద్ధ జనములతో / పరిశుద్ధ దూతలతో (2) / హల్లెలూయా గానాలతో / వెంబడింతుము యేసునితో (2) ||నిత్య||
హోసన్నా హల్లెలూయా / హోసన్నా హల్లెలూయా / హోసన్నా హల్లెలూయా (2) / స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ / నోరారా పాడెదము (2) / రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు / స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| / కెరూబులు సెరూపులు / ఇరువది నలుగురు పెద్దలతో (2) / నాలుగు జీవుల గానాలతో (2) / స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా|| / పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు / సర్వ సృష్టికి మూలకారకుడు (2) / మృతుడై మరలా బ్రతికినవాడు (2) / మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా||
ఆగక సాగుమా / సేవలో ఓ.. సేవకా / ఆగక సాగుమా / సేవలో సేవకా (2) / ప్రభువిచ్చిన పిలుపును / మరువక మానక (2) ||ఆగక|| / పిలిచినవాడు ప్రభు యేసుడు / ఎంతైనా నమ్మదగినవాడు (2) / విడువడు నిన్ను ఎడబాయడు / నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| / తెల్లబారిన పొలములు చూడు / కోత కోయను సిద్ధపడుము (2) / ఆత్మల రక్షణ భారముతో / సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||
నీ రక్త ధారలే – మా జీవనాధారాము / నీ సిల్వ మార్గమే – మా మోక్ష భాగ్యము / ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ / నీతి రాజ – యేసు రాజ (2) / మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే / మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ|| / మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే / పాププు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ|| / నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ / నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||
నీ పద సేవయే చాలు / యేసు నాకదియే పది వేలు / నీ పద సేవయే చాలు / నీ పద జ్ఞానము నాకిలా క్షేమము / నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద|| / నీ నామమునే స్తుతియింపగను / నీ వాక్యమునే ధ్యానింపగను (2) / నీ రాజ్యమునే ప్రకటింపగను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| / నీ దరినే నివసింపగను / జీవమునే సాధింపగను (2) / సాతానును నే నెదిరింపగాను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద|| / నీ ప్రేమను నే చూపింపగను / నీ త్యాగమునే నొనరింపగను (2) / నీ సహనమునే ధరియింపగను (2) / దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||