యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||
సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||