Songs sorted by number of likes. 1604 songs total.
ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2) / తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2) / పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె / పరవశించి పాడెదా (2) / తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2) / నిరంతరం గొప్పవాడా (2) / కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2) / విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద|| / ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2) / ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద|| / నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2) / శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
ప్రార్ధన యేసుని సందర్శన / పరమ తండ్రితో సంభాషణ / కరములెత్తి ప్రార్ధించగా / పరమ తండ్రి కౌగిలించును / స్వరమునెత్తి ప్రార్ధించగా / మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన|| / తండ్రి అని నే పిలువగా / తనయుడా అని తా బల్కును / ఆదుకొనును అన్ని వేళలా / కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన|| / మోకరించి ప్రార్ధించగా / సమీపముగా వేంచేయును / మనవులెల్ల మన్నించును / మహిమతో నలంకారించును ||ప్రార్ధన|| / కుటుంబముతో ప్రార్ధించగా / కొదువ ఏమియు లేకుండును / ఐక్యతలో నివసించును / శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన|| / సంఘముగను ప్రార్ధించగా / కూడిన చోటు కంపించును / పరిశుద్ధాత్ముడు దిగివచ్చును / ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన|| / ఉపవాసముతో ప్రార్ధించగా / కీడులన్నియు తొలగిపోవును / కొట్లు ధాన్యముతో నింపును / క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన|| / ఏకాంతముగా ప్రార్ధించగా / నీతిని నాకు నేర్పించును / యేసు రూపము నాకిచ్చును / యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||
ప్రార్ధన ప్రార్ధన / ప్రభునితో సంభాషణ / ప్రార్ధనే ఊపిరి / ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన|| / కన్నీటి ఉపవాస ప్రార్ధన / సాతాను శక్తులపై విజయము (2) / విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన / జయము నొసగును జీవితములు ||ప్రార్ధన|| / ఒలీవ కొండల ప్రార్ధన / స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2) / ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన / ఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన|| / సిలువలో నేర్పిన ప్రార్ధన / ప్రేమను నేర్పును బ్రతుకున (2) / సాతాను చొరను చోటు లేనిది / పాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||
ప్రార్థించుము నీ జీవితములో / నెమ్మది సుఖము లొందెదవు (2) / సంపూర్ణ భక్తిని కలిగించును / క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము|| / యెడతెగక నీవు ప్రార్థించినా / విసుగక నీవు ప్రార్థించినా (2) / సమస్తమును నీవు పొందెదవు / తప్పక న్యాయము పొందెదవు (2) / నీ కొరకై ప్రభు వేచియున్నాడు / ప్రార్థనలో కనిపెట్టుము (2) ||ప్రార్థించుము|| / కష్టము నష్టము కలిగినను / శోధన బాధలు వచ్చినను (2) / సాతాను నీపై విజృంభించి / నిన్ను గాయపరచినను (2) / భయపడకుము ప్రభువే నీకు / జయము నిచ్చును (2) ||ప్రార్థించుము|| / ప్రభువే మనతో సెలవిచ్చెను / మెళకువగా నుండి ప్రార్థించుమని (2) / విశ్వాసము కోల్పోయే దినములలో / విశ్వాసముతో ప్రార్థించినా (2) / సాతాను దుర్గములను పడగొట్టి / బలము పొందెదవు (2) ||ప్రార్థించుము|| / ప్రభువచ్చు వేళాయే గమనించుము / ఆత్మ వలన ప్రతి విషయములో (2) / ప్రార్థన విజ్ఞాపన చేయుచు / పూర్ణమైన పట్టుదలతో (2) / పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు / మెళకువగా నుండుడి (2) ||ప్రార్థించుము|| / యెరూషలేము క్షేమముకై / అన్యజనుల రక్షణకై (2) / భారముతో నీవు ప్రార్థించిన / ప్రభువే నీకు ఫలమిచ్చును (2) / వారి క్షేమమే నీ క్షేమముకు / ఆధారమగును (2) ||ప్రార్థించుము||
ప్రార్థన వినెడి పావనుడా / ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| / శ్రేష్టమైన భావము గూర్చి / శిష్య బృందముకు నేర్పితివి / పరముడ నిన్ను ప్రనుతించెదము / పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| / పరమ దేవుడవని తెలిసి / కరము లెత్తి జంటగా మోడ్చి / శిరమునువంచి సరిగను వేడిన / సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| / దినదినంబు చేసిన సేవ / దైవ చిత్తముకు సరిపోవ / దీనుడవయ్యి దిటముగా కొండను / చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| / శత్రుమూక నిను చుట్టుకొని / సిలువపైన నిను జంపగను / శాంతముతో నీ శత్రుల బ్రోవగ / సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా / నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) / యేసయ్యా కావాలయ్యా / నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన || / ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి / నేను ప్రార్థింపగ దయచేయుమా (2) / ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2) / నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన || / సింహాల గుహలోని దానియేలు శక్తి / ఈ లోకంలో నాకు కావలయ్యా (2) / నీతో నడిచే వరమీయుమా (2) / నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన || / పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి / నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2) / చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2) / ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||
ప్రభు హస్తం నాపై నుంది / రవ్వంతయూ భయమే లేదు (2) / ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ / అంతము వరకు నడిపించును (2) ||ప్రభు|| / తినిపించును నన్ను లాలించున్ / విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు|| / రక్తముతో శుద్ధి చేయును / రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు|| / అపహరింపలేరండి / ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు|| / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2)
ప్రభు మొర వినవా / ప్రభు మొర వినవా / నీ కొరకే నేను వెదకేను దేవా / నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు|| / నాదు ప్రాణము తల్లడిల్లాగా / భూదిగంతముల నుండియేగా (2) / మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే|| / ఎక్కలేని ఎత్తైన కొండ / ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) / చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే|| / మిత్రుడా నా ఆశ్రయ నీవే / శత్రువుల యెడ నా కోట నీవే (2) / స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం / ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) / హాల్లెలూయా హాల్లెలూయా / హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| / ఆకాశము కంటె ఎత్తైనది / మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) / ఆ సన్నిధే మనకు జీవమిచ్చును / గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| / దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు / ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) / నూతనమైన ఆశీర్వాదముతో / అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు||
ప్రభు యేసు నా రక్షకా / నొసగు కన్నులు నాకు / నిరతము నే నిన్ను జూడ (2) / అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| / ప్రియుడైన యోహాను పత్మాసులో / ప్రియమైన యేసు నీ స్వరూపము (2) / ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె / ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / లెక్కలేని మార్లు పడిపోతిని / దిక్కులేనివాడ నేనైతిని (2) / చక్కజేసి నా నేత్రాలు దెరచి / గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎరిగి యెరిగి నే చెడిపోతిని / యేసు నీ గాయము రేపితిని (2) / మోసపోతి నేను దృష్టి దొలగితి / దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| / ఎందరేసుని వైపు చూచెదరో / పొందెదరు వెల్గు ముఖమున (2) / సందియంబు లేక సంతోషించుచు / ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| / విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ / కొనసాగించువాడా యేసు ప్రభూ (2) / వినయముతో నేను నీ వైపు జూచుచు / విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| / కంటికి కనబడని వెన్నియో / చెవికి వినబడని వెన్నియో (2) / హృదయ గోచరము కాని వెన్నియో / సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| / లోక భోగాలపై నా నేత్రాలు / సోకకుండునట్లు కృప జూపుము (2) / నీ మహిమ దివ్య స్వరూపమును / నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను / ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు || / ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా / అంతగా బాధించి సిలువమీది కెత్తిరి / బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి / మూర్ఖుల దెబ్బల బాధను సహించెను / మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో / సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి / సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను / మూడవనాడు సమాధినుండి లేచెను / విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || / తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు / దేవయని ప్రభు అరచిన యపుడు / దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభుయేసు || / కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని / నీకువేరుగా నారక్షణిల లేదుగా / నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు / ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు ||
ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) / పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) / పరలోకముకై – చిర జీవముకై (2) / ప్రార్ధించెను నా హృదయం ||ప్రభు యేసుని|| / దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) / దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) / ధన పీడనతో – మృగ వాంఛలతో (2) / దిగాజారితి చావునకు ||ప్రభు యేసుని|| / యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) / ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) / ఇల వేడితిని – విలపించుచును (2) / ఈడేరెను నా వినతి ||ప్రభు యేసుని|| / పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) / పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) / పరలోకమే నా – తుది ఊపిరిగా (2) / పయనించితి ప్రభు కడకు ||ప్రభు యేసుని||