Songs sorted by number of likes. 1604 songs total.
ఆరాధ్యుడవు నీవే ప్రభు / ఆనందముతో ఆరాధింతును (2) / అత్యున్నత ప్రేమను కనుపరచినావు / నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) ||ఆరాధ్యుడవు|| / పేతురు వలె నేను ప్రభునకు దూరముగా / పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2) / ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం / గలిలయ తీరమున నన్ను గమనించితివా (2) ||ఆరాధ్యుడవు|| / ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు / తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2) / పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి / సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2) ||ఆరాధ్యుడవు|| / నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి / మీనముతో భోజనము సమకూర్చితివా (2) / ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు / అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2) ||ఆరాధ్యుడవు||
ఫలములనాశించిన పరలోక తండ్రి / తేరి చూచుచున్నాడు నీ వైపు (2) / ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి / పరీక్షించుచున్నాడు నీ కాపు (2) / ఫలియించకుండుట నీకు న్యాయమా / యజమాని సహనముతో చెలగాటమా (2) / ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు / సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2) / చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2) / తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2) ||ఫలియించకుండుట|| / వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే / ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2) / ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2) / మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2) ||ఫలియించకుండుట||
పిల్లలారా నా మాట వినుడి / యెహోవా యందు భక్తి నేర్పెదను – (2) ||పిల్లలారా|| / బ్రతుక గోరువాడెవడైన కలడా? (2) / మేలునొందుచు చాలా దినములు (2) ||పిల్లలారా|| / కపటమైన చెడు మాటలాడక (2) / కాచుకొనుము నీదు పెదవులను (2) ||పిల్లలారా|| / కీడు మాని మేలునే చేయుము (2) / సమాధానము వెదకి వెంటాడు (2) ||పిల్లలారా|| / యెహోవా దృష్టి నీతిమంతులపై (2) / కలదు వారి మొఱల వినును (2) ||పిల్లలారా|| / దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2) / కొట్టివేయు తన సన్నిధి నుండి (2) ||పిల్లలారా|| / నీతిమంతులు మొఱ పెట్టగా (2) / విని శ్రమల నుండి తప్పించును (2) ||పిల్లలారా|| / విరిగినట్టి హృదయములకు (2) / యెహోవా ఆసన్నుడై యున్నాడు (2) ||పిల్లలారా|| / నలిగియున్న వారల నెల్ల (2) / ఆయనే రక్షించు ప్రేమగల్గి (2) ||పిల్లలారా||
పిరందారే పిరందారే / యేసు రాజన్ పిరందారే (2) / విన్ని వెంథనాయి పరలోగ రాజనాయి / యేసు రాజన్ పిరందారే (2) / నం పావం పోక్క వందారే / నమ్మయె మీట్టెడుత్తారె (2) / కొండాడువొం పాట్టుపడువొం / ఇమ్మనువేలర్ పిరందారే (2) / కొండాడువొం పాట్టుపడువొం – నమక్కు / ఇమ్మనువేలర్ పిరందారే (2) / మాట్టు తొలువినిలే పిరందారే / మాందర్ పావం పొక్క వందరే (2) / ఏలై రూబం తరిత్తారే / ఏలై యమ్మై మీట్టారే (2) / కొండాడువొం పాట్టుపడువొం / ఇమ్మనువేలర్ పిరందారే (2) / కొండాడువొం పాట్టుపడువొం – నమక్కు / ఇమ్మనువేలర్ పిరందారే (2) / ఇరుళిల్ ఒలియాగ వందరే / ఇరుండ ఉలగై మీట్టారే (2) / నర్ చేదియాహై పిరందారే / నర్ కారియంగల్ సైదారే (2) / కొండాడువొం పాట్టుపడువొం / ఇమ్మనువేలర్ పిరందారే (2) / కొండాడువొం పాట్టుపడువొం – నమక్కు / ఇమ్మనువేలర్ పిరందారే (2)
పోదాము పోదాము పయనమోదాము / సువార్త చెప్ప పోదాము (2) / అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము / సువార్త చాటింప సాగిపోదాము (2) / ఆ జాతి ఈ జాతి ఏ జాతండి / పరిశుద్దతే మన సొంత జాతండి (2) / ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి / కానాను దేశమే మన ఊరండి (2) / ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి / క్రీస్తు రక్తమే పాపం బాపునండి (2)
పొందితిని నేను ప్రభువా నీ నుండి / ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) / జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2) / ఇంత వరకు నాకు తోడై యుండి (2) / ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2) / నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని|| / గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2) / అంధకార శక్తుల ప్రభావమునుండి (2) / నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2) / నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని|| / కష్ట దుఖంబులు నాకు కలుగగా (2) / నను చేరదీసి ఓదార్చితివే (2) / భయ భీతి నిరాశల యందున ప్రభువా (2) / బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని|| / నా దేహమందున ముళ్ళు నుంచితివి (2) / సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2) / వ్యాధి బాధలు బలహీనతలందు (2) / నీ కృపను నాకు దయచేసితివి (2) ||పొందితిని|| / నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2) / కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2) / కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2) / జయజీవితము నాకు నేర్పించితివి (2) ||పొందితిని||
పూజనీయుడేసు ప్రభు / పలునిందల నొందితివా నాకై (2) ||పూజనీయుడేసు|| / నీ స్వకీయులే నిందించినా / నిన్నంగీకరించక పోయినా (2) / ఎన్నో బాధ లొందితివా నాకై (2) / సన్నుతింతును నీ ప్రేమకై ||పూజనీయుడేసు|| / సత్యము మార్గము మరి జీవమై / నిత్యజీవమియ్యను వచ్చితివి (2) / వంచకుడవని నిన్ను నిందించిరా (2) / ఓ దయామయా నజరేయుడా ||పూజనీయుడేసు|| / యూదా గోత్రపు ఓ సింహమా / ఆద్యంతరహిత దైవమా (2) / అధములు నిను సమరయుడనిరా (2) / నాథుడా నిను బహు దూషించిరా ||పూజనీయుడేసు|| / మధురం నీ నామం అతి మధురం / మధుర గీతముతో నిన్నారాధింతును (2) / వధియించబడితివా యీ పాపికై (2) / వందితా ప్రభు నిన్ను పూజింతును ||పూజనీయుడేసు||
పోరాటం ఆత్మీయ పోరాటం (2) / చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు / సాగిపోవుచున్నాను / సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) / నా యేసుతో కలిసి పోరాడుచున్నాను / అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) / నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / నా యేసు వెళ్ళిన మార్గము లేనని / అవమానములైనా ఆవేదనలైనా (2) / నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / ఆదియు అంతము లేనివాడు నా యేసు / ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) / ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
పొర్లి పొర్లి పారుతుంది కరుణానది / కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4) / నిండియున్న పాపమంత కడిగివేయును / కడిగివేయును.. కడిగివేయును (2) / రండి మునుగుడిందు / పాపశుద్ధి చేయును (2) / చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి|| / రక్తము చిందించకుండా పాపము పోదు / పాపము పోదు.. పాపము పోదు (2) / ఆ ముక్తిదాత రక్తమందే / జీవము గలదు (2) / గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి|| / విశ్వ పాపములను మోసే యాగ పశువదే / యాగ పశువదే.. యాగ పశువదే (2) / కోసి చీల్చి నదియై పారే / యేసు రక్తము (2) / రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి|| / చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము / పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2) / రమ్ము రమ్ము ఉచితము / ఈ ముక్తి మోక్షము (2) / మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి||
ప్రాణమా నా ప్రాణమా / ప్రియ యెహోవాను సన్నుతించుమా / ప్రియ యెహోవా చేసిన మేలులను / నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా|| / గత కాలములన్నిటిలో / కృపతోనే నడిపించెను (2) / కరుణ కటాక్షమనే (2) / కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా|| / నిను విడువక ఎడబాయక / నిత్యం నీకు తోడైయుండెను (2) / నీవు నడిచిన మార్గములో (2) / నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా|| / పాప శాపము వ్యాధులను / పారద్రోలియే దీవించెను (2) / పరిశుద్ధుడు పరమ తండ్రి (2) / బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా|| / మహా ఆనంద మానందమే / మహారాజా నీ సన్నిధిలో (2) / మహిమగల మహారాజా (2) / మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా||
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార / ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర|| / నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2) / నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర|| / మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2) / నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) ||ప్రాణేశ్వర|| / పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2) / నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర|| / నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2) / జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర|| / కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2) / కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||
ప్రార్ధన కలిగిన జీవితం / పరిమళించును ప్రకాశించును / పై నుండి శక్తిని పొందుకొనును (2) / విడువక ప్రార్ధించిన శోధన జయింతుము / విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన|| / విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము / విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన|| / విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము / విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2) / ప్రార్ధనే మన ఆయుధం / ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||