Songs sorted by number of likes. 1604 songs total.
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా / నీవు లేనిదే నేను లేనయ్యా (2) / నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప / హెచ్చించునది నీ కృప మాత్రమే (2) / నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును / నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … / ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు / తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) / బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే|| / నేనని చెప్పుటకు నాకేమి లేదు / సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) / అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) / నీ కృప లేకుంటేనే నేను లేను / నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||
నను చేరిన నీ ప్రేమ / తొలగించని నీ ప్రేమ / జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ / నిను నేను విసిగించినా / నిను విడచి పారిపోయినా / నిను నేను హింసించినా – వీడని ప్రేమ / నన్ను ఓర్చి దరికి చేర్చి / స్నేహించి నను ప్రేమించి / జీవమునిచ్చి నను దీవించి / నీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన|| / నీ ప్రేమ నన్ను మార్చింది / నీ రక్తం నన్ను కడిగింది / నీ వాక్యం నన్ను నిలిపింది / నీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి|| / నీ మాట నాకు ధైర్యంగా / నీ స్పర్శ నాకు నెమ్మదిగా / నీ ప్రేమ నాకు ఊపిరిగా / నీ స్వరము నాకు శాంతిగా (2) ||నన్ను ఓర్చి||
నను విడువక ఎడబాయక / దాచితివా.. నీ చేతి నీడలో / (యేసయ్యా) నీ చేతి నీడలో (2) / సిలువలో చాపిన రెక్కల నీడలో (2) / సురక్షితముగా నన్ను దాచితివా (2) / కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి / ఆదరించిన యేసయ్యా (2) ||నను|| / ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2) / నీవున్న చోటున నేనుండుటకై (2) / పిలుపుకు తగిన మార్గము చూపి / నను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను||
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం / మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2) / అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ / పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి|| / కాలంతో పాటుగా కృశియించును శరీరం / మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2) / క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2) / వసియించు కలకాలం – సత్యమైన లోకంలో ||నశియించెడి|| / నిలచిపోవును మహిలోన బంధాలన్ని / మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2) / ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2) / యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా / పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ / పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. / నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా / నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా / అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) / లోకాన చాటగా (4) ||నశియించు|| / ఈ లోక భోగము – నీకేల సోదరా / నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా / ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2) / ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప / ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) / నీ ప్రేమ బలమైనది / నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| / లోకములో నేనుండగా / నీ కరములు చాపి పిలిచావయ్యా / దుఃఖములో నేనుండగా / నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) / నా ఆధారము నీవే / నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| / నా వారలే నన్ను నిందించినా / నా బంధువులే నన్ను వెలివేసినా (4) / ఎవరున్నా లేకున్ననూ / నీ తోడు చాలునయ్యా / ఏమున్నా లేకున్ననూ / నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| / నా స్థితి నీవు చూసావయ్యా / నా గతినే నీవు మార్చావయ్యా (2) / నా ఆధారము నీవే / నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
నే నీవాడనై యుండఁ గోరెదన్ / యేసు ప్రియ రక్షకా / నీవు చూపు ప్రేమను గాంచితిన్ / నన్నుఁ జేర్చు నీ దరిన్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / నీవు పడ్డ సిల్వకున్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / గాయపడ్డ ప్రక్కకున్ / నన్నుఁ బ్రతిష్ఠ పర్చుమీ నాధా / నీదు కృపవల్లనే / నాదు నాత్మ నిన్ను నిరీక్షించు / నీ చిత్తంబు నాదగున్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / నీవు పడ్డ సిల్వకున్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / గాయపడ్డ ప్రక్కకున్ / నీదు సన్నిధిలో నిఁక నుండ / నెంత తుష్టి నాకగున్ / స్నేహితుని మాటలాడెదన్ / సర్వశక్త ప్రభుతో / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / నీవు పడ్డ సిల్వకున్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / గాయపడ్డ ప్రక్కకున్ / నీదు దివ్య ప్రేమాతిశయము / ఇహ బుద్ధి కందదు / పరమందున దాని శ్రేష్ఠత / నే ననుభవించెదన్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / నీవు పడ్డ సిల్వకున్ / నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా / గాయపడ్డ ప్రక్కకున్
నే స్తుతించెదను యేసు నామమును / భజించెదను క్రీస్తు నామమును / స్తుతికి యేసే యోగ్యుడని / నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| / ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ / వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) / పాపిని నన్ను రక్షించుటకై / చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| / పాపములన్నియు బాపుటకై / శాపములన్నియు మాపుటకై (2) / ఏ పాపమెరుగని ఆ పావనుడు / శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| / శోధన కాలముల యందున / వేదన కాలముల యందున (2) / నాధుడు యేసు మనతోడనుండ / అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| / ఎనలేని ప్రేమతో కౌగిలించెను / ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) / మహామహుండు మహిమ ప్రధానుడు / మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| / రాజాధిరాజు ప్రభు యేసే / దేవాదిదేవుడు మన యేసే (2) / పరమందు దూతలు యిహమందు నరులు / పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను||
నే యేసుని వెంబడింతునని / నేడేగా నిశ్చయించితిని / నే వెనుదిరుగన్ వెనుకాడన్ / నేడేసుడు పిల్చిన సుదినం ||నే యేసుని|| / నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ / నాదే దారి నా మనస్సులో / ప్రభు నా చుట్టు విరోధుల్ / నావారెవరు నా యేసుని మించిన మిత్రుల్ / నాకిలలో గానిపించరని ||నే యేసుని|| / కరువులైనను కలతలైనను / కలసిరాని కలిమి లేములు / కలవరంబులు కలిగిననూ / కదలనింకా కష్టములైనా / వదలను నాదు నిశ్చయము ||నే యేసుని|| / శ్రమయైననూ బాధలైననూ / హింసయైన వస్త్రహీనత / ఉపద్రవములు ఖడ్గములైన / నా యేసుని ప్రేమనుండి / నను యెడబాపెటి వారెవరు ||నే యేసుని||
నేడే ప్రియరాగం పలికే నవ గీతం / ప్రేమే మన కోసం వెలసే / లోకాన శాంతి మురిసింది / మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| / దివినేలు దేవుడు ఉదయించగానే / ఇలలోన ప్రకృతి పులకించెగా / పరలోక దూతలు స్తుతియించగానే / జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| / మనిషైన సుతుడు జనియించగానే / విశ్వాన గోళాలు విభవించెగా / చిన్నారి యేసుని చిరునవ్వుతోనే / నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| / హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / హ్యాప్పీ క్రిస్మస్ టు యు… / లోకాన శాంతి మురిసింది / మన మనస్సులో రాగాల కాంతి విరిసింది
నేడో రేపో నా ప్రియుడేసు / మేఘాలమీద ఏతెంచును / మహిమాన్వితుడై ప్రభు యేసు / మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| / చీకటి కమ్మును సూర్యుని / చంద్రుడు తన కాంతినీయడు (2) / నక్షత్రములు రాలిపోవును / ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| / కడబూర స్వరము ధ్వనియించగా / ప్రియుని స్వరము వినిపించగా (2) / వడివడిగ ప్రభు చెంతకు చేరెద / ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో|| / నా ప్రియుడేసుని సన్నిధిలో / వేదన రోదనలుండవు (2) / హల్లెలూయా స్తుతిగానాలతో / నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||
నేడు ఇక్కడ రేపు ఎక్కడో / తెలియని పయనం ఓ మానవా (2) / ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు / ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు|| / నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే / నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) / నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) / నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| / అది నాది ఇది నాదని అదిరి పడతావు / చివరికి ఏది రాదు నీ వెంట (2) / దిగంబరిగానే నీవు పుడతావు / దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||