తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

ఎల్లవేళలందు|Ella Velalandu

ఎల్లవేళలందు – కష్టకాలమందు / వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌ / ఎల్లను నీవే నా కెల్లెడల / వల్లపడదే వివరింపన్‌ (2) / విమోచకుడా – విమోచన నీవే / రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు|| / సృష్టికర్తవు – సహాయము నీవే / ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్ఞానము నీవే – నా పానము నీవే / దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జ్యోతివి నీవే – నా నీతివి నీవే / ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు|| / నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే / స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు|| / జీవము నీవే – నా దేవుడవు నీవే / పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు|| / కాంతియు నీవే – నా శాంతియు నీవే / సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||

ఎల్లప్పుడును ప్రభువునందు|Ellappudunu Prabhuvunandu

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి / ప్రతి సమయములోను… / ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) / యెహోవా చేసిన మేలుల కొరకై / ఎల్లప్పుడును ఆనందించండి (2) / ఆరాధించండి ||ఎల్లప్పుడును|| / పాపంబు తోడ చింతించుచుండ / నరునిగా ఈ భువిలో ఉదయించెగా / మన పాప భారం తన భుజమున మోసి / మనకై తన ప్రాణం అర్పించెగా (2) / ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి / ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును|| / విశ్వాసమునకు కలిగే పరీక్ష / ఓర్పును కలిగించే ఒక సాధనమై / శోధనకు నిలిచి సహించిన వేళ / జీవ కిరీటమును పొందెదము (2) / నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి / సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును|| / ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి / మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి / మనతో నివాసమును కలిగి యుండుటకు / త్వరలోనే రారాజుగా రానైయుండె (2) / శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి / సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||

ఎలోహిం ఎలోహిం|Elohim Elohim

హోలీ హోలీ హోలీ / హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ / హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) / ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం / బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) / శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము / సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం / అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) / నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు / నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ / పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) / రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా / నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / అడోనై అడోనై అడోనై అడోనై / ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) / సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు / నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) / యావే యావే యావే యావే / యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) / పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు / ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) / హల్లెలూయా హల్లెలూయా – (2) / హల్లెలూయా హల్లెలూయా / హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)

ఏం చేసానయ్యా నీకోసం|Em Chesaanayyaa Neekosam

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) / ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) / ఒక్కరినైనా ఒక ఆత్మనైనా / రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| / ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా / మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా / నిన్నే ఎదిరించానా (2) / ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) / నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| / ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా / శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా / నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || / ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా / భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా / సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||

ఏమని నే పాడెదన్|Emani Ne Paadedan

ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2) / నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2) / కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2) / అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2) / ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2) / నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2) / తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2) / నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2) / ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2) / రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2) / నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)

Most Popular Telugu Songs — Page 32 | UEC Telugu Church