Songs sorted by number of likes. 1604 songs total.
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను / పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| / నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా / నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| / దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై / నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| / పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు / పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| / పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే / పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||
చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా / ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా / చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా / ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా / స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా / సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2) / తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని / కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2) / కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం / పద్దు గీసుకోవటమా నీ జీవితం (2) / వ్యర్ధమైనవాటిని విడిచి / పరమార్ధంలోకి నడిచి / దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల||
క్రిస్మస్ ఆనందం సంతోషమే / నా యేసుని జన్మదినమే / యూదుల రాజుగ జన్మించెనే / పశులతొట్టెలో పరుండబెట్టెనే (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను / ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి / విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు / నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2) / క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్ / క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి / దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2) / ఆనందము మహదానందము / సంతోషము బహు సంతోషము (2) / మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ / హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్|| / శోధనలేమైనా – బాధలు ఎన్నైనా / రండి క్రీస్తు నొద్దకు… / రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము|| / చింతయే నీకున్నా – శాంతియే కరువైనా / రండి క్రీస్తు నొద్దకు… / నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన / క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) / క్రీస్తులోనే విశ్వాసం / క్రీస్తులోనే ఉల్లాసం / క్రీస్తులోనే అభిషేకం / క్రీస్తులోనే సమస్తం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్|| / యేసులోనే రక్షణ / యేసులోనే స్వస్థత / యేసులోనే విడుదల / నమ్మితే నిత్య జీవం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే / రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2) / ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే / ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| / పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో / లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2) / యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| / కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను / బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2) / దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం|| / ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా / మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా / ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా / మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2) / ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే / ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||
నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలో / యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలో (2) / హల్లెలూయా హల్లెలూయా (4) / మేము వెళ్లి చూచినాము స్వామి యేసు నాథుని (2) / ప్రేమ మ్రొక్కి వచ్చినాము మామనంబు లలరగా (2) / బేతలేము పురములోన బీద కన్య మరియకు (2) / పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో (2) / పేద వడ్ల వారి కన్య మరియమ్మ / ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ / ప్రేమ గల యేసు తల్లి / పేరెళ్ళిన దేవా దేవుడే / యేసయ్య.. ప్రేమ గల అవతారం (2) / స్వర్గ ద్వారాలు తెరిచిరి / యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే / యేసయ్య… స్వర్గ రాజు పుట్టగానే / సరుగున దూతలు వచ్చిరి / యేసయ్య.. చక్కని పాటల్ పాడిరి (2) / నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడి కాడ (2) / అచ్ఛం మల్లె పూల తోట యేసయ్య (2) / దొడ్డు దొడ్డు బైబిళ్లు దోసిట్లో పెట్టుకొని (2) / దొరోలే బయలెల్లినాడే యేసయ్య (2) / రాజులకు రాజు పుట్టన్నయ్య (2) / రారే చూడ మనం వెళ్లుదాం అన్నయ్య (2) / తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) / తరలినారే బెత్లహేము అన్నయ్య (2) / పదరా పోదాము రన్న / శ్రీ యేసుని చూడ / పదరా పోదాము రన్న (2) / శ్రీ యేసన్న నట లోక రక్షకుడట (2) / లోకులందరికయ్యె ఏక రక్షకుడట (2) / పదరా.. హే – పదరా.. హే / పదరా పోదాము రన్న – శ్రీ యేసుని చూడ / పదరా పోదాము రన్న (4)
నర జన్మమెత్తి వరసుతునిగా / అరుదెంచె నేడు సరసముగా / శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి / క్రీస్తేసు స్వామి ఈ భువిలోన / మానసవేది పావనమూర్తి / మానవులను పాలించుకర్త / నర జన్మమెత్తి… / లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ / మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2) ||మానసవేది|| / బంతి యనగ యాడరే మన / బాల చిన్న ముద్దుల యేసుకు (2) / ముత్తిక తోడ కూడి యాడి / ముద్దుల పరుడు పల్క పరుడు / గ గ గ రి గ మ మ మ మ / ప మ ప మ ప ద ని స (2) / ప ద ని స.. ప ద ని స.. / ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి|| / జ్ఞానులెల్ల వచ్చిరి / మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక|| / జననము నొందెను జయ యేసు / జయ గీతములు పాడుడి (2) / ఆ ఆ ఆ ఆ ఆ ఆ / ఆ ఆ ఆ ఆ ఆ ఆ / ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ / గొర్రెల కాపరులకు దూత / గొప్ప వార్తను తెలిపినట (2) ||జననము|| / శ్రీ యేసుండు జన్మించే రేయిలో (2) / నేడు పాయక బేత్లెహేమ యూరిలో (2) / సత్రమందున పశువుల శాలయందున (2) / దేవపుత్రుండు మనుజుండాయెనందున (2) ||శ్రీ యేసుండు|| / చూడబోదాము రారే / సకల జనంబులార / శ్రీ యేసు నాథుని జన్మంబు (2) / ఆనందముతో మనమందరం (2) ఆహ ||చూడబోదాము|| / ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని / పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ||ఆనందముతో|| / ఆహ చూడ… ఆహ చూడ… / ఆహ చూడబోదాము రారే / సకల జనంబులార / శ్రీ యేసు నాథుని జన్మంబు (2)
క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు / యేసయ్య జన్మదినం వచ్చేనులే (2) / ఆనందించెదం నూతన కీర్తన పాడెదం / యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం / యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2) / కన్యక గర్భములో యేసయ్య జన్మించెను / పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను / దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2) / గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి / రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2) ||క్రిస్మస్|| / దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను / తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను / సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2) / జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి / బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2) ||క్రిస్మస్||
క్రిస్మస్ శుభదినం / మహోన్నతమైన దినము / ప్రకాశమైన దినము / నా యేసు జన్మ దినము (2) / క్రిస్మస్ శుభదినం / హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) / విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ / వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) / దావీదు వేరు చిగురు / వికసించె నేడు భూమిపై (2) / అద్వితీయ కుమారునిగా / లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| / కన్నుల పండుగగా మారెను / నా యేసు జన్మదినం (2) / కన్య మరియకు జన్మించెను / కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| / ఆనందముతో ఆహ్వానించండి / క్రీస్తుని మీ హృదయములోకి (2) / ఆ తారగా మీరుండి / నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు / రక్షణ తెచ్చిందయ్యా చూడు (2) / ఆనందం వెల్లి విరిసే / జగతిలో జ్యోతిగా నేడు (2) / క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ / యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| / లోక పాపం తొలగింప / జీవితాలను వెలిగింప (2) / ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు / విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| / యేసుకు మనలో చోటిస్తే / మానమొక తారగ కనిపిస్తాం (2) / పరలోక మార్గం క్రీస్తే / సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె / పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను / ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా / ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో / గొర్రెల విడచి మందల మరచి / గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా / గానములతో గంతులు వేస్తూ / గగనాన్నంటేలా ఘనపరచెదం (2) / చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే / పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో / తారను చూచి తరలి వచ్చాము / తూర్పు దేశపు జ్ఞానులము / తన భుజముల మీద రాజ్య భారమున్న / తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2) / బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము / మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం / ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు / ఇహం పరం అందరము / జగమంతా సందడి చేద్దాం / చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో / జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో / నీవేలే మా రాజు – రాజులకు రాజు / నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో / మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి / క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము