Songs sorted by number of likes. 1604 songs total.
యేసుని నామములో – మన బాధలు పోవును / దుష్టాత్మలు పారిపోవును / శోధనలో జయమొచ్చును / మృతులకు నిండు జీవమొచ్చును / హృదయములో నెమ్మదొచ్చును / యేసు రక్తముకే – యేసు నామముకే / యుగయుగములకూ మహిమే / అభిషిక్తులగు తన దాసులకు / ప్రతి సమయమునా జయమే ||యేసుని|| / ఘోరమైన వ్యాధులెన్నైనా / మార్పులేని వ్యసనపరులైనా / ఆర్ధికముగా లోటులెన్నున్నా / ఆశలు నిరాశలే ఐనా / ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు / పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || / రాజువైనా యాజకుడవైనా / నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా / ఆశ్రయముగా గృహములెన్నున్నా / నిలువ నీడే నీకు లేకున్నా / శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా / నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||
యేసుని తిరు హృదయమా / నన్ను రక్షించు నా దైవమా (2) / స్నేహితుని వోలె ఆదరించావు / బోధకుడై నన్ను మందలించావు (2) ||యేసుని|| / కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు / దుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2) / ఏ విధమున నిన్ను నే పొగడగలను (2) / నీ ఋణమును నేనెలా తీర్చగలను / నా తండ్రి నా దేవా ||యేసుని|| / నను కాచి కాపాడే నా మంచి కాపరివి / నాకింక భయమేల నీ అండదండలలో (2) / జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2) / నీ ఆత్మతో దీవించు నా యేసు / నా తండ్రి నా దేవా ||యేసుని||
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) / రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| / ఎనలేని ప్రేమ నాపై చూపించితివే / నీ బలియాగం నన్ను రక్షించెనే (3) / రక్షణ విడుదల స్వస్థత (2) / కుమ్మరించుము నీ ఆత్మను / వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||
యేసుని ప్రేమ యేసు వార్త / వాసిగ చాటను వెళ్ళెదము / ఆశతో యేసు సజీవ సాక్షులై / దిశలన్నిటను వ్యాపించెదము / వినుము ప్రభుని స్వరము (2) / ప్రభు యేసు సన్నిధి తోడు రాగా / కడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| / మరణ ఛాయ లోయలలో / నాశన కూపపు లోతులలో (2) / చితికెను బ్రతుకులెన్నో (2) / ప్రేమ తోడను చేరి వారిని / ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| / కాపరి లేని గొర్రెలుగా / వేసారెనుగ సమూహములే (2) / ప్రజలను చూచెదమా (2) / ప్రేమ తోడను చేరి వారిని / ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||
యేసుతో ఠీవిగాను పోదమా / అడ్డుగా వచ్చు వైరి గెల్వను / యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| / రారాజు సైన్యమందు చేరను / ఆ రాజు దివ్య సేవ చేయను (2) / యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / విశ్వాస కవచమును ధరించుచు / ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) / అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / శోధనలు మనల చుట్టి వచ్చినా / సాతాను అంబులెన్ని తగిలినా (2) / భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / ఓ యువతి యువకులారా చేరుడి / శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) / లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) / సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
యూదా స్తుతి గోత్రపు సింహమా / యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) / నీవే కదా నా ఆరాధన / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన స్తుతి ఆరాధన (2) / నీ ప్రజల నెమ్మదికై / రాజాజ్ఞ మార్చింది నీవేనని / అహమును అణచి అధికారులను / అధముల చేసిన నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| / నీ నీతి కిరణాలకై / నా దిక్కు దెశలన్ని నీవేనని / ఆనతికాలాన ప్రధమ ఫలముగా / భద్రపరచిన నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| / నీ వారసత్వముకై / నా జయము కోరింది నీవేనని / అత్యున్నతమైన సింహాసనమును / నాకిచ్చుఁటలో నీకు (2) / అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
యుద్ధము యెహోవాదే (4) / రాజులు మనకెవ్వరు లేరు / శూరులు మనకెవ్వరు లేరు (2) / సైన్యములకు అధిపతి అయినా / యెహోవా మన అండ ||యుద్ధము|| / వ్యాధులు మనలను పడద్రోసినా / బాధలు మనలను కృంగదీసినా (2) / విశ్వాసమునకు కర్త అయినా / యేసయ్యే మన అండ ||యుద్ధము|| / ఎరికో గోడలు ముందున్నా / ఎర్ర సముద్రము ఎదురైనా (2) / అద్బుత దేవుడు మనకుండా / భయమేల మనకింకా ||యుద్ధము|| / అపవాది అయిన సాతాను / గర్జించు సింహంవలె వచ్చినా (2) / యూదా గోత్రపు సింహమైనా / యేసయ్య మన అండ ||యుద్ధము||
యుగయుగాలు మారిపోనిది / తరతరాలు తరిగిపోనిది / ప్రియ యేసు రాజు నీ ప్రేమా / నిను ఎన్నడు వీడిపోనిది / నీకు ఎవ్వరు చూపలేనిది / ఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమది / హద్దే లేని ఆ దివ్య ప్రేమతో / కపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతో / నీ కోసమే బలి అయిన దైవము రా (2) / లోకంతో స్నేహమొద్దు రా / చివరికి చింతే మిగులు రా / పాపానికి లొంగిపోకు రా / అది మరణ త్రోవ రా (2) / నీ దేహం దేవాలయము రా / నీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) / తను చేసిన మేలు ఎట్టిదో / యోచించి కళ్ళు తెరువరా / జీవమునకు పోవు మార్గము / క్రీస్తేసుని ఆలకించారా (2) / నీ ముందర పందెము చూడరా / విశ్వాసపు పరుగులో సాగరా (2)