Songs sorted by number of likes. 1604 songs total.
యేసు ఉంటే చాలు / నా జీవితం ధన్యము (2) / ఆయనే నా సర్వము / ఆయనే నా కేడెము / అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు|| / ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు / ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2) / ఆయనే నా మార్గము / ఆయనే నా సత్యము / ఆయనే నా జీవము (2) ||యేసు|| / ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు / లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2) / ఆయనే నా శైలము / ఆయనే నా ధైర్యము / ఆయనే నా విజయము (2) ||యేసు||
యేసు వలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం / శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2) / ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు / ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు / నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2) / నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం / సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2) / ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే / ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే / నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు – (2) / విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం / కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం (2) / ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే / ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె / నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… – (2)
యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో / ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా / పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు / నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య / మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను / పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను / పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను / సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు|| / యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి / నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు|| / దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది / యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము ||యేసు||
యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2) / చూడాలి నిత్యం చూడాలి (2) / అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2) / మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు|| / అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2) / అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు|| / దహించు అగ్ని నిన్ను చూడాలి (2) / పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు|| / మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2) / పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు|| / దీప వృక్షమా నిన్ను చూడాలి (2) / నీతి సూర్యుడా నిన్ను చూడాలి (2) ||యేసు||
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది / చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు / ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ|| / గాలి వానొచ్చి నడి యేటిలోన / నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. / కంట చూడంగ గాలాగిపోయే / అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) / నీవే రేవంట ఏ నావకైనా / కడలే నీవంట ఏ వాగుకైనా (2) / ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా|| / దిక్కు లేనట్టి దీనాత్ములంటే / నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. / జంతు బలులిచ్చే మూడాత్ములంటే / నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2) / నిన్ను పొగడంగ నేనెంత వాడ / నీటి మడుగులలో చేపంటి వాడ (2) / నా దారి గోదారిలో ||ప్రభువా||
యేసు మాతో నీవుండగా / మేము అలసిపోలేమయ్యా (2) / అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| / సమాధానకారకుడు నీవేనయ్యా / సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| / అద్భుత దేవుడవు నీవేనయ్యా / ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| / నా యొక్క సౌందర్యం నీవేనయ్యా / నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు / యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) / ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును / చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| / శాశ్వతమైన ప్రేమతో / నిన్ను నన్ను ప్రేమించాడు (2) / సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు / తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| / శాంతి సమాధానం మనకిచ్చాడు / సమతా మమత నేర్పించాడు (2) / మార్గము సత్యము జీవమైనాడు / మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి||
యేసు నీ వారము – నీవే మా రాజువు (2) / తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు|| / మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం / అన్నీ నీవొసగినవే / మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే / స్తుతి స్తోత్రముల్ నీకేలే (2) / సర్వంబు నీవైన ప్రభువా / హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు|| / ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు / అన్నీ నీవొసగినవే / ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని / మాకోసం నిలిపితివే (2) / ఆద్యంతముల ప్రభువా / ఆరాధింతుము నిన్నే (2) ||యేసు|| / సిలువలో మరణించి – మరణమునే ఓడించి / జయమును పొందితివే / పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి / పరమును ఒసగితివే (2) / మమ్మెంతో ప్రేమించి / మా కొరకు నిలచితివే (2) ||యేసు||
యేసు రాజు రాజుల రాజై / త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె / హోసన్నా జయమే – హోసన్నా జయమే / హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| / యోర్దాను ఎదురైనా / ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) / భయము లేదు జయము మనదే (2) / విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| / శరీర రోగమైనా / అది ఆత్మీయ వ్యాధియైనా (2) / యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) / రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| / హల్లెలూయ స్తుతి మహిమ / ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) / యేసు రాజు మనకు ప్రభువై (2) / త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా||
యేసు రక్తములో నాకు జయమే జయము / ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2) / జయం జయం జయం జయం – నా యేసునిలో / జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| / పాపాలను క్షమియించి – శాపాలను భరియించి / విడుదలను కలిగించే యేసు రక్తము / మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి / పరలోకానికి చేర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| / శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి / ఆదరణను కలిగించే యేసు రక్తము / రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి / స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2) / అమూల్యమైనది పవిత్రమైనది / ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||
యేసుకు యేసే ఇల సాటి / వివరింపగ నేనేపాటి (2) / పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) / వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు|| / రక్షణనిచ్చే రక్షకుడవు / విడుదలనిచ్చే విమోచకుడవు (2) / ఆదరించే ఆధారణకర్తవు (2) / అభిషేకించే అభిషిక్తుడవు (2) / ఇలలో ఎవ్వరు నీ సాటి / వివరింపగ నేనేపాటి ||పరమ|| / శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు / ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2) / ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2) / రాజ్యాలేలే రాజాధి రాజువు (2) / ఇలలో ఎవ్వరు నీ సాటి / వివరింపగ నేనేపాటి ||పరమ||
యేసుని నా మదిలో స్వీకరించాను / ఆయన నామములో రక్షణ పొందాను (2) / నేను నేనే కాను… నాలో నా యేసే… (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| / పాతవి గతియించెను / క్రొత్తవి మొదలాయెను (2) / నా పాప హృదయింలో రారాజు జన్మించె / నా పాపం తొలగి పోయెను – నా దుఃఖం కరిగి పోయెను (2) / యేసే నా జీవం… / ఆ ప్రభువే నా దైవం (2) ||హల్లెలూయ|| / నీ పాపం తొలగాలన్నా / నీ దుఃఖం కరగాలన్నా (2) / యేసుని నీ మదిలోకి స్వీకరించాలి / ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) / యేసే మన జీవం… / ఆ ప్రభువే మన దైవం (2) ||హల్లెలూయ|| / నీవు నమ్మితే రక్షణ / నమ్మకున్నచో శిక్షయే (2) / ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో / విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) / ఈ క్షణమే నీవు తేల్చుకో… / ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||