Songs sorted by number of likes. 1604 songs total.
యెహెూవాయే నా బలము / యెహెూవాయే నా శైలము (2) / యెహెూవాయే నా కోటయు / యెహెూవాయే నా కేడెము / యెహెూవాయే నా శృంగము / యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| / నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను / నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2) / నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను / నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| / నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను / నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2) / నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను / నా ముందుగా తానే నడచి నన్ను బలపరచెను (2) ||యెహెూవాయే||
యెహోవాయే నా కాపరిగా / నాకేమి కొదువగును (2) / పచ్చికగల చోట్లలో / నన్నాయనే పరుండజేయును (2) / శాంతికరమైన జలములలో (2) / నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| / గాఢాంధకార లోయలలో / నడిచినా నేను భయపడను (2) / నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) / నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| / నా శత్రువుల ఎదుట నీవు / నా భోజనము సిద్ధపరచి (2) / నా తల నూనెతో నంటియుంటివి (2) / నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| / నా బ్రతుకు దినములన్నియును / కృపాక్షేమాలు వెంట వచ్చును (2) / నీ మందిరములో నే చిరకాలము (2) / నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు / సంతోషాలే పొంగేనండి – హైలెస్సా / దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే / సంగీతాలే పాడాలండి – హైలెస్సా / అంధకారాన్ని తొలగించే మహనీయుడు / పుట్టినాడండి యేసయ్య మన దేవుడు / నిన్నే కోరి – నిన్నే చేరి / ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| / లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా / ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2) / దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక / ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని / మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| / వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి / ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2) / మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే / కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే / ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| / ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా / వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2) / సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ / భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా / మన యేసయ్య మనకుండగా ||ఏలో||
యేసన్న స్వరమన్నా / నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న|| / ఏదేను తోటలో ఆదాము చెడగా / ఆ దేవుడే పిలిచె (2) / యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2) / అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న|| / జనముల శబ్దము జలముల శబ్దము / బలమైన ఉరుములతో (2) / కలిసిన స్వరము పిలిచిన యేసు (2) / పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న|| / ఆనాడు దేవుడు మోషేను పిలువగా / ఆలకించెను స్వరము (2) / ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2) / కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||
యేసయ్య మాట బంగారు మూట / ఎన్నటికి మారని మాటేనన్న / ఎన్నటెన్నటికి మారని మాటేనన్న / నిత్యజీవానికి సత్యమైనది / పరలోక రాజ్యానికి మార్గమైనది / పదరా పదరా పోదాం పదరా / (మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2) / చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా / పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా / తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా / అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| / సమరయ స్త్రీని చూసాడయ్యా / కుండను బద్దలు కొట్టాడయ్యా / జీవపు ఊటలు ఇచ్చాడయ్యా / జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||
యేసయ్య మాట జీవింపజేయు లోకంలో / యేసయ్య నామం కోరికలన్ని తీర్చును / యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము / యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య|| / వ్యభిచార స్త్రీ యొక్క పాపము / క్షమించె యేసు దేవుడు (2) / ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2) / ఇదే కదా యేసు ప్రేమ / క్షమించు ప్రతి పాపము (2) / విరిగి నలిగినా హృదయమా / యేసుపై వేయుము భారము (2) / నీ దుఃఖ దినములు సమాప్తము / యేసుని అడిగినచో (2) / ఇదే కదా యేసు ప్రేమ / కన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య||
యేసయ్య మాట విలువైన మాట / వినిపించుకోవా సోదరా / వినిపించుకోవా సోదరీ (2) / నీ గుండెలోన ముద్రించుకోవా / ఏ నాటికైనా గమనించలేవా / గమనించుము పాటించుము ప్రచురించుము / నిన్నూవలె నీ పొరుగువారిని / ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| / ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట / నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట / కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) / సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) / దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| / నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని / అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని / కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) / అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) / నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా / నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| / పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం / మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం / దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం / మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| / పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం / పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
యేసయ్య నామము నా ప్రాణ రక్ష / గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) / నాశనకరమైన తెగులుకైనా / భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| / రోగ భయం – మరణ భయం / తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| / అపాయమేమియు దరికి రాదు / కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| / పరలోక సేన నన్ను కాయును / పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| / యేసుని నామమే స్తుతించెదము / వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య||
యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము / యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము / ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము / ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| / ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు / నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు / నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు / నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం / నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి / నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ ||యేసయ్య|| / ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు / లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే / నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా / పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం / సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు / మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||
యేసయ్య నిన్నే సేవింతును / ఆరాధింతును స్తుతింతును (2) / బంధీనైపోయ నీలో మునిగి తేలాక / నావల్ల కాదయ నిను వీడి ఉండుట (2) / యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) / నను వీడని నీ ప్రేమను / యెడబాయని నీ కరుణను / వెన్నంటి ఉండే కృపలను / వర్ణించగలనా (2) / నింపావు నీ అగ్నితో / నింపావు నీ శక్తితో / నింపావు జీవ జలముతో / నిన్నే మహిమపరతును (2) / నీలో మునిగి తేలాక / నే విడుదలనే పొందా / నీలో మునిగి తేలాక / నే ఉప్పోంగి పోయా / నీలో మునిగి తేలాక / నే జీవమునే పొందా / నీలో మునిగి తేలాక / నే బంధీనైపోయా
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2) / ఎండల్లో కందాయయ్యా / అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య|| / మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2) / నడలేక తూలాడయ్యా / అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య|| / కొయ్యపై కాళ్ళు పెట్టి / సీలను కొట్టిరయ్యా (2) / పాదాలు అదిరాయయ్యా / అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య|| / ఈ ప్రేమమూర్తి / పాదాలు నమ్ముకుంటే (2) / పాపాలు పోతాయయ్యా / అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా / పాపాలు పోతాయయ్యా / అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య|| / రాతి గుండెలను మాంసపు గుండెలుగా / మార్చేందుకు వచ్చాడయ్యా / ప్రాణము పెట్టాడయ్యా