తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

యెహోవా నీదు మేలులను|Yehovaa Needu Melulanu

యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను / కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం / దైవం నీవయ్యా పాపిని నేనయ్యా / నీదు రక్తముతో నన్ను కడుగు / జీవం నీవయ్యా జీవితం నీదయ్యా / నీదు సాక్షిగా నన్ను నిలుపు / కారణ భూతుడా పరిశుద్ధుడా / నీదు ఆత్మతో నన్ను నింపు / మరనాత యేసు నాథా / నీదు రాజ్యములో నన్ను చేర్చు / ఘనుడా సిల్వ ధరుడా / అమూల్యం నీదు రుధిరం (2) ఓ… / నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం / నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం / ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం / సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| / ప్రియుడా ప్రాణ ప్రియుడా / వరమే నీదు స్నేహం (2) / నా రక్షణకై పరమును వీడే / నా విమోచనకై క్రయ ధనమాయె / ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం / పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా||

యెహోవా నిస్సీ|Yehovaa Nissy

యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ / యెహోవా నిస్సీ – అనుచు పాడెదం / మా ధ్వజము విజయ ధ్వజమే (2) / యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| / ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయును / కలత చెంద కారణమే లేదుగా / సడలకుండ కరముల కాధారమై / శక్తి గల యేసు ఆత్మ నిలుపును (2) / సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| / మనయందున్నట్టి బలము చాలును / నాధుడేసు సెలవిచ్చెను పోదము / ఆయుధములు భుజబలమవసరమా / పరమ దేవునాత్మ మనలో నుండగా (2) / మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| / హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధం / యేసు నామ శక్తే సామర్ధ్యము / యేసు రాక వరకే పోరాటము / జయము పొందుటే జీవిత ధ్యేయము (2) / సిలువే మన జయ పతాకము (2) ||యెహోవా||

యెహోవా యీరే|Yehovaa Yire

యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు / యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు / యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) / యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి / యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు / యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) / యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా / యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు / యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4)

యెహోవా నా బలమా|Yehovaa naa balamaa

యెహోవా నా బలమా / యదార్థమైనది నీ మార్గం / పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| / నా శత్రువులు నను చుట్టిననూ / నరకపు పాశములరికట్టిననూ (2) / వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) / విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| / మరణపుటురులలో మరువక మొరలిడ / ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) / తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) / ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| / నా దీపమును వెలిగించువాడు / నా చీకటిని వెలుగుగా చేయును (2) / జలరాసులనుండి బలమైన చేతితో (2) / వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| / పౌరుషముగల ప్రభు కొపింపగా / పర్వతముల పునాదులు వణకెను (2) / తన నోటనుండి వచ్చిన అగ్ని (2) / దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా|| / మేఘములపై ఆయన వచ్చును / మేఘములను తన మాటుగ జేయును (2) / ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) / అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా|| / దయగలవారిపై దయ చూపించును / కఠినులయెడల వికటము జూపును (2) / గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) / సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా|| / నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును / ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) / రక్షణ కేడెము నాకందించి (2) / అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా|| / యెహోవా జీవముగల దేవా / బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) / అన్యజనులలో ధన్యత చూపుచు (2) / హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||

యెహోవా నీ నామము ఎంతో బలమైనది|Yehovaa nee naamamu entho balamainadi

యెహోవా నీ నామము ఎంతో బలమైనది / ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది / యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది / ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || / మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) / యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || / నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) / అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || / సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) / ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా || / చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) / సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా || / పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) / పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

యెహోవాకు స్తుతులు పాడండి|Yehovaaku Sthuthulu Paadandi

యెహోవాకు స్తుతులు పాడండి – మీరు / సమాజములో ప్రభు ప్రశంస పాడి / సభలో పాడండి మీరు యెహోవాకు / ఇశ్రాయేలు తమ సృష్టికర్తను / సీయోను వాసులు తమ రాజును / స్మరియించుకొని సంతోషింతురు / నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు|| / తంబురతోను సితారతోను / తనను గూర్చి గానము చేసి / దేవుని ప్రేమరసమును గ్రోలి / పావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు|| / భక్తులై ఘనులై హర్షింతురు / ఉత్సాహమున ఊప్పొంగెదరు / పడకల మీద ప్రభువును కోరి / పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు|| / అన్య జనులను శిక్షించుటకు / రాజుల గొలుసుతో బంధించుటకు / రెండంచుల ఖడ్గమును ధరించిరి / దైవ భక్తులకు ఘనత యునిదే – మీరు ||యెహోవాకు||

యెహోవాను సన్నుతించెదన్|Yehovaanu Sannuthinchedan

యెహోవాను సన్నుతించెదన్ / ఆయనను కీర్తించెదను / ప్రభువును ఘనపరచెదన్ / ఆ నామమునే గొప్ప చేసెదన్ (2) / హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను|| / నాకున్న సర్వము నన్ను విడచినను / నావారే నన్ను విడచి నిందలేసినను (2) / నా యేసయ్యను చేరగా / నేనున్నానన్నాడుగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| / నాకున్న భయములే నన్ను కృంగదీయాగా / నా హృదయం నాలోనే నలిగిపోయేగా (2) / నా యేసయ్యను చేరగా / నన్నాదరించెనుగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| / నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా / నాపైన చీకటియే నాన్నవరించెగా (2) / నా దీపము ఆరుచుండగా / నా యేసయ్య వెలిగించెగా (2) / ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి / యుగయుగములు చెల్లును (2) ||యెహోవాను||

యెహోవాను స్తుతియించు|Yehovaanu Sthuthiyinchu

యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు / మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2) / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2) / సమాధానకర్త అయిన రారాజును / ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను / కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి / కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| / ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు / భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు / తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు / పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు / నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| / స్వరమండలముతో ఆయనను స్తుతియించు / సితార స్వరములతో ఆయనను స్తుతియించు / గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో / తంబుర నాట్యముతో తంతి వాద్యముతో / జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||