Songs sorted by number of likes. 1604 songs total.
వేయి నోళ్లతో స్తుతియించినా / నీ ఋణమును నే తీర్చగలనా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / నా రోగములను భరియించి / నా వ్యసనములను వహియించి / నా దోషములను క్షమియించి / స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| / శోధనలో నాకు జయమిచ్చి / బాధలలో నను ఓదార్చి / బలహీనతలో బలమిచ్చి / నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||
విధేయత కలిగి జీవించుటకు / జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు / ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు / ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు / యేసయ్యతో ఉంటే సంతోషమే / యేసయ్యతో ఉంటే ఆనందమే / సాతానుతో ఉంటే కష్టాలు / సాతానుతో ఉంటే నష్టాలూ / అందుకని / ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి / దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి / మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి / మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా / సరే ఇప్పుడు ఏం చేయాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / ఏం చెయ్యాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / బుడి బుడి బుడి అడుగులతో / చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) / యేసయ్యను ఆరాధించెదము / యేసయ్యా ఈ రోజు నుండి / నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా / విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా / అవిధేయత తొలగించుమయ్యా / నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| / పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి / ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) / సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) / అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| / పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి / ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) / శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) / రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||
విడిపిస్తాడు నా యేసుడు / మరణపు లోయైనా నను విడువడూ (2) / మనసు ఓడిపోయిననూ / మనువు వాడిపోయిననూ (2) / నను ఎత్తుకొనీ… / నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు|| / ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా / కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| / ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా / బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| / కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ / గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడూ||
విడువదు మరువదు – విడువదు మరువదు / విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు / ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ / మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| / నా స్థితి ఏదైనా – చింత ఏదైనా / బాధ ఏదైనా – నను విడువదు / లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా / యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు / మా నాన్న నా చేయి విడువడు / ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) / విడువడు మరువడు – విడువడు మరువడు / విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు / నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న / నా తండ్రి కౌగిలి – నే విడువను / శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా / నా ప్రియుని చిరునవ్వు – నే మరువను / నన్నెంతో ప్రేమించిన రాజును / ఎడబాసి మనలేనే రోజును (2) / విడువను మరువను – విడువను మరువను / విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను / ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ / మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||
విడువను నిను ఎడబాయనని నా / కభయ మొసంగిన దేవా / నా కభయ మొసంగిన దేవా / నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) / నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| / పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) / నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| / మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) / గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| / సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2) / నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||
విడువవు నన్నిక ఎన్నడైననూ / పడిపోకుండా కాయు రక్షకా (2) / పడిపోవు వారెల్లరిని / లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| / ప్రభువా నీకవిధేయుడనై / పలు మారులు పడు సమయములలో (2) / ప్రేమతో జాలి దీన స్వరముతో / ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| / ఆదాము హవ్వలు ఏదెనులో / ఆశతో ఆజ్ఞ మీరినను (2) / సిలువకు చాయగా బలినర్పించి / ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| / మా శక్తియు మా భక్తియు కాదు / ఇలలో జీవించుట ప్రభువా (2) / కొల్లగా నీ ఆత్మను నొసగితివి / హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||
విజయ గీతము మనసార నేను పాడెద / నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) / పునరుత్తానుడ నీవే / నా ఆలాపన నీకే నా ఆరాధన (2) / ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే / పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) / యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది / నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| / ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి / నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) / యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము / నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| / నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు / ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) / యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె / నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
విజయ గీతముల్ పాడరే / క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) / వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ / నిజ కుమారుని నామమున్ / హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| / మంగళముగ యేసుడే / మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను / నింగిన్ విడిచి వచ్చెను / శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను / రంగు మీరగదన – రక్త బలము వలన / పొంగు నణగ జేసెను / సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| / పాపముల్ దొలగింపను / మనలను దన స్వ – రూపంబునకు మార్పను / శాపం బంతయు నోర్చెను / దేవుని న్యాయ – కోపమున్ భరియించెను / పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు / పాప యాగము దీర్చెను / దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ|| / సిలువ మరణము నొందియు / మనలను దనకై – గెలువన్ లేచిన వానికి / చెలువుగన్ విమలాత్ముని / ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి / కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని / సిలువ మోయుచు నీ కృపా / రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా / కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) / నా యేసయ్యా నిను వేడుకొనగా / నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| / అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2) / ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) / నిత్యానందము కలిగించె నీ / శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| / ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2) / అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) / నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి / వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా|| / ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2) / అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) / నిత్యము నీతో నేనుండుటకై / నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||
వికసించు పుష్పమా (2) / యేసు పాదాల చెంతనే వికసించుమా / తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| / నీ ప్రాణ ప్రియుడు సుందరుడు / నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) / మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) / స్తోత్రార్హుడు (2) ||వికసించు|| / నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) / మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) / పరిశుద్ధుడు (2) ||వికసించు|| / నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) / విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) / నీతి సూర్యుడు (2) ||వికసించు||
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము / ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం / దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో / ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో / నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా / నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| / గడచినా కాలమంతా తోడైయున్నావు / అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) / లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2) / నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత|| / సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా / నూతన కార్యాలు ఎన్నో చేశావు (2) / సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2) / నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు / మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||