తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

వందనంబొనర్తుమో ప్రభో|Vandanambonarthumo prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా / వందనంబు లందుకో ప్రభో ||వందనం|| / ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు / గన్న తండ్రి మించి ఎపుడు గాచియు / ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా / యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| / ప్రాత వత్సరంపు బాప మంతయు / బ్రీతిని మన్నించి మమ్ము గావుము / నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా / దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| / దేవ మాదు కాలుసేతు లెల్లను / సేవకాలి తనువు దినములన్నియు / నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ / సేవకై యంగీకరించుమా ||వందనం|| / కోతకొరకు దాసజనము నంపుము / ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము / పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము / ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| / మా సభలను పెద్దజేసి పెంచుము / నీ సువార్త జెప్ప శక్తి నీయుము / మోసపుచ్చు నందకార మంత ద్రోయుము / యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||

వందనము నీకే నా|Vandanamu Neeke Naa

వందనము నీకే నా వందనము (2) / వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| / నీ ప్రేమ నేనేల మరతు / నీ ప్రేమ వర్ణింతునా (2) / దాని లోతు ఎత్తునే గ్రహించి (2) / నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| / సర్వ కృపానిధి నీవే / సర్వాధిపతియును నీవే (2) / సంఘానికి శిరస్సు నీవే (2) / నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| / పరిశుద్ధమైన నీ నామం / పరిమళ తైలము వలె (2) / పరము నుండి పోయబడి (2) / పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| / మృతి వచ్చెనే ఒకని నుండి / కృప వచ్చెనే నీలో నుండి (2) / కృషి లేక నీ కృప రక్షించెను (2) / కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము|| / తండ్రియైన దేవునికే / కుమారుడైన దేవునికే (2) / పరిశుద్ధాత్మ దేవునికే (2) / వందన వందన వందనము (2) ||వందనము||

వర్ణించలేను|Varninchalenu

వర్ణించలేను వివరించలేను / అతి శ్రేష్టమైన నీ నామమున్ / యేసు నీ నామమున్ – (2) / కొనియాడెదన్ కీర్తించెదన్ (2) / అత్యంతమైన నీ ప్రేమను / యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| / మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే / పాపినేని చూడక ప్రేమించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / సర్వాధికారి సర్వోన్నతుడా (2) / హీనుడైన నన్ను కరుణించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) / నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||

వీచే గాలుల్లో|Veeche Gaalullo

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే / నీవే నా మంచి యేసయ్యా / ప్రవహించే సెలయేరై రావా నీవు / జీవ నదిలా మము తాకు యేసయ్యా / నీవే నా ప్రాణము – నీవే నా సర్వము / నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి / నీలోనే తరియించాలి ప్రభు (2) / నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం / నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| / ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం / కడవరకు కాపాడే నీవే నా దైవం / పోషించే నా తండ్రి నీవే ఆధారం / కరుణగల నీ మనసే నాకు చాలును / నీ మాటలే మాకు ఉజ్జీవం / నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| / ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం / ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై / నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే / నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి / మా కోసమే నీవు మరణించి / పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

వీనులకు విందులు చేసే|Veenulaku Vindulu Chese

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర / వేగిరమే వినుటకు రారండి / ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| / రండి… విన రారండి / యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) / నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి / మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / రండి… వచ్చి చూడండి / యేసయ్య చేసే కార్యములు చూడండి (2) / నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి / శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / సృష్టి కర్తను మరచావు నీవు / సృష్టిని నీవు పూజింప దగునా (2) / భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి / నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు||

వేటగాని ఉరిలో నుండి|Vetagaani urilo nundi

వేటగాని ఉరిలో నుండి / నా ప్రాణాన్ని రక్షించావు / బలమైన రెక్కల క్రింద / నాకాశ్రయమిచ్చావు (2) / లేనే లేదయ్యా వేరే ఆధారం / నా దుర్గమా నా శైలమా / లేనే లేదయ్యా వేరే ఆధారం / నా శృంగమా నా కేడెమా / ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన / ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2) / రాత్రి వేళ భయముకైననూ / పగటి వేళ బాణమైననూ / రోగము నన్నేమి చేయదు / నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| / వేయిమంది పడిపోయినా / పదివేల మంది కూలిపోయినా / అపాయము రానే రాదు / నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| / మానవులను కాపాడుటకు / నీ దూతలను ఏర్పరిచావు / రాయి తగలకుండా / ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

Most Popular Telugu Songs — Page 122 | UEC Telugu Church