Songs sorted by number of likes. 1604 songs total.
సర్వ యుగములలో సజీవుడవు / సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును / కొనియాడదగినది నీ దివ్య తేజం / నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) / ప్రేమతో ప్రాణమును అర్పించినావు / శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) / శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు / జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| / స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు / శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) / నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను / మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| / కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు / బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) / నెమ్మది కలిగించే నీ బాహుబలముతో / శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
సర్వాంగ కవచము నీవే / ప్రాణాత్మ దేహము నీవే / నా అంతరంగము నీవే దేవా (2) / నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి / నా పాపమును తీసీ / నా భారమును మోసావయ్యా… యేసయ్యా / నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. / నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) / వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై / సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా / నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై / సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| / దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై / బూడిదెనకు ప్రతిగా పూదండవై / దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై / భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా / యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా / పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2) / నా ప్రార్థన ఆలకించువాడా / నా కన్నీరు తుడుచువాడా (2) / నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై / నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ|| / నా శాపములు బాపినావా / నా ఆశ్రయ పురమైతివా (2) / నా నిందలన్నిటిలో యెహోషాపాతువై / నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ|| / నా అక్కరలు తీర్చినావా / నీ రెక్కల నీడకు చేర్చినావా (2) / నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై / నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||
సర్వకృపానిధియగు ప్రభువా / సకల చరాచర సంతోషమా (2) / స్తోత్రము చేసి స్తుతించెదను / సంతసముగ నిను పొగడెదను (2) / హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను / నేను… ఆనందముతో సాగెదను / ప్రేమించి నన్ను వెదకితివి / ప్రీతితో నను రక్షించితివి (2) / పరిశుద్ధముగా జీవించుటకై / పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| / అల్పకాల శ్రమలనుభవింప / అనుదినము కృపనిచ్చితివి (2) / నాథుని అడుగుజాడలలో / నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| / మరణ శరీరము మర్పునొంది / మహిమ శరీరము పొందుటకై (2) / మహిమాత్మతో నను నింపితివి / మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| / భువినుండి శ్రేష్ట ఫలముగను / దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2) / భూజనములలోనుండి నన్ను / ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2) ||హల్లెలూయా|| / ఎవరూ పాడని గీతములు / యేసుతో నేను పాడుటకై (2) / హేతువు లేకయే ప్రేమించెన్ / యేసుకు నేనేమివ్వగలన్ (2) ||హల్లెలూయా||
సర్వశక్తుని స్తోత్రగానము / సల్పరే జగమెల్లను / నిర్వహించును దాస భారము / నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| / ముదముతో నిర్మానకుండగు / మూల కర్తను బాడరే / వదన మీక్ష్మాన్వoచి దేవుని / వందనముతో వేడరే (2) ||సర్వ|| / వేదపారాయణము సేయుచు / విశ్వమంత జయింపరే / సాదరముగా దేవు నిక మీ / స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| / ఎదను విశ్రాంతిన్ పరేశుని / హెచ్చుఁగా నుతి జేయరే / సదమలంబగు భక్తితో మీ / సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| / చావు పుట్టుక లేనివాడుగ / సంతతము జీవించును / ఈవులిచ్చుచు దన్ను వేడు మ- / హేష్టులను రక్షించును (2) ||సర్వ|| / దాసులై దేవునికి నెదలో / దర్పమును బోగాల్పరే / యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము / నే మరక మైదాల్పరే (2) ||సర్వ||
సర్వోన్నత స్థలములలో సమాధానము / ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) / హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ / రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత|| / పశువుల పాకలో మనకు శిశువు జన్మించె / పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2) / ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2) / నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా|| / మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై / మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) / మన దోషము బాప – మానవరూపమున (2) / జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా||
సర్వోన్నతుడా / నీవే నాకు ఆశ్రయదుర్గము (2) / ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) / ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) / నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట / నిలువలేరని యెహోషువాతో (2) / వాగ్దానము చేసినావు / వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥ / నిందలపాలై నిత్య నిబంధన / నీతో చేసిన దానియేలుకు (2) / సింహాసనమిచ్చినావు / సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥ / నీతి కిరీటం దర్శనముగా / దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2) / విశ్వాసము కాచినావు / జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) / శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) / యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) / మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) / పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| / ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2) / జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే|| / అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2) / ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే||
సీయోను పాటలు సంతోషముగా / పాడుచు సీయోను వెల్లుదము (2) / లోకాన శాశ్వతానందమేమియు / లేదని చెప్పెను ప్రియుడేసు (2) / పొందవలె నీ లోకమునందు / కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| / ఐగుప్తును విడచినట్టి మీరు / అరణ్యవాసులే ఈ ధరలో (2) / నిత్యనివాసము లేదిలలోన / నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| / మారాను పోలిన చేదైన స్థలముల / ద్వారా పోవలసియున్ననేమి (2) / నీ రక్షకుండగు యేసే నడుపును / మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| / ఐగుప్తు ఆశలనన్నియు విడిచి / రంగుగ యేసుని వెంబడించి (2) / పాడైన కోరహు పాపంబుమాని / విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| / ఆనందమయ పరలోకంబు మనది / అక్కడనుండి వచ్చునేసు (2) / సీయోను గీతము సొంపుగ కలసి / పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) / సమాధానమై – సదాకాలము నను నీతో / నడిపించుచున్నావు నీ కీర్తికై / సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) / నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) / నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) / నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు / విడువవు నను యెడబాయవు / నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| / నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2) / కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2) / నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని / కీర్తిoచెదను ప్రతినిత్యం / నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో|| / నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2) / నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2) / నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును / మరువను ఎన్నడు విడువను / నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును / నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సీయోనులో స్థిరమైన పునాది నీవు / నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) / సూర్యుడు లేని చంద్రుడు లేని / చీకటి రాత్రులు లేనే లేని (2) / ఆ దివ్య నగరిలో కాంతులను / విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / కడలి లేని కడగండ్లు లేని / కల్లోల స్థితి గతులు దరికే రాని (2) / సువర్ణ వీధులలో / నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) / నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) / ఆనందమే పరమానందమే (10)
సేవకులారా సువార్తికులారా / యేసయ్య కోరుకున్న శ్రామికులారా / సేవకులారా సువార్తికులారా / మీ మాదిరికై వందనము / ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా / మా కొరకై నీ ప్రాణం అర్పించితివి / నీలో నిలిచి యుండుటే మా భాగ్యము / నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| / మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే / మనము గొప్పవారము కాదు / మనము మంచివారము కాదు / మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు / దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు / ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు / మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు / నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| / ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి / మీ శరీరము దేవుని ఆలయమిది / మీరు విలువ పెట్టి కొనబడిన వారు / సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు / సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు / మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు / మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| / హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, / దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ / షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ / సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు / ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు / మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు / మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||