Songs sorted by number of likes. 1604 songs total.
ఆశ్చర్యాకరుడా / నా ఆలోచన కర్తవు (2) / నిత్యుడగు తండ్రివి / నా షాలేము రాజువు (2) / సింహపు పిల్లలైనా / కొదువ కలిగి ఆకలిగొనినా (2) / నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా / నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| / విత్తని పక్షులను / నిత్యము పోషించుచున్నావు (2) / నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా / నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా|| / చీకటి తొలగే / నీతి సూర్యుడు నాలో ఉదయించె (2) / నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను / నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త / బలవంతుడైన దేవుడా / నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి / మనకై జన్మించెను (2) / వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) / హోసన్నా హల్లలూయా / క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| / ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై / స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ / అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై / ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ / ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు / దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2) / దొంగలను మార్చి దయచూపినావు (2) / ధవళ వస్త్రములు ధరింప చేసి / ధన్యుని చేసావు ||వి విష్|| / నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు / నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2) / నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) / నీతో నిరతం జీవించుటకు / నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / నిత్యుడగు తండ్రి బలవంతుడు / లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి / తిరిగి లేచిన పునరుద్ధానుడు / రండి మన హృదయాలను ఆయనకు అర్పించి / ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / సత్య స్వరూపి సర్వాంతర్యామి / సర్వాధికారి మంచి కాపరి / వేలాది సూర్యుల కాంతిని మించిన / మహిమా గలవాడు మహా దేవుడు / రండి మనమందరము – ఉత్సాహగానములతో / ఆ దేవ దేవుని – ఆరాధించెదము / ఆరాధించెదము / ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన / పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్టుడు / రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) / తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో / తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| / తన చేతిలో రోగాలు లయమైపోయెను / తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) / తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) / నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు|| / మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు / మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) / తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) / తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ / మరణము కంటె బలమైన ప్రేమది / నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| / పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ / నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| / పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ / నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన|| / శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ / విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన|| / నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ / నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను / ఆత్మతో సత్యముతో స్తుతించెదను / ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము / ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| / దుప్పి నీటికై ఆశపడునట్లుగా / దేవుని కొరకై ఆశ పడుచున్నాను / దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) / దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| / లోక ఆశలు లయమైపోవును / లోకులెవ్వరు కాపాడలేరు / లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2) / లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా / ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా / మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| / ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా / దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2) / వెండి బంగారు వెలగల వస్త్రం / పరిమళ పుష్ప సుగంధములు (2) / మట్టిలోనుండి వచ్చినవేనని / మరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు|| / అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా / పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2) / అందమైన ఆ దీనా షెకెములు / హద్దులేక ఏమయ్యిందమ్మా (2) / అంతరంగమున గుణముకలిగిన / శారా చరిత్రకెక్కిందమ్మా (2) ||ఆశపడకు|| / జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా / నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2) / కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి / తన కురులతో తుడిచిన మగ్దలీనలా (2) / హన్నా వలె మన దోర్కా వలె / ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2) / వారి దీక్షయే వారసత్వమై / అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2) / పవిత్రమైన హృదయము కలిగి / ప్రభువు కొరకు జీవించాలమ్మా (2) ||ఆశపడకు||
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా . / నూతన బలముతో నను నింపినావు (2) / బలహీనులను బలపరచువాడా / కృంగిన వారిని లేవనెత్తువాడా (2) / యేసయ్యా నా ఆశ్రయమా / యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| / సొమ్మసిల్లక అడుగులు తడబడక / నడిచెద నీ వెంట జీవితమంతా (2) / లోకము నన్ను ఆకర్షించినా / వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| / అలయక నేను పరుగెత్తెదను / అంతము వరకు ఆత్మల రక్షణకై (2) / సిద్ధము చేసిన బహుమానముకై / గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| / రెక్కలు చాపి పక్షి రాజువలెనే / పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2) / పరవశించెదను నీ ముఖమును చూచి / ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||
యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక (2) / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) / తన జాలి – నీ పైన / వెయ్యి తరములు – ఉండు గాక / నీ వంశం – సంతానం / వారి పిల్లల – వారి పిల్లలు (4) / నీ ముందు – నీ వెనుక / నీ పక్కన – నీ చుట్టూ / నీతోనూ – నీలోనూ / తన సన్నిధి ఉండు గాక / ఉదయాన – సాయంత్రం / నీ రాక – పోకలలో / కన్నీటిలో – సంతోషంలో / నీ పక్షం – నీ తోడు / నీ నీడగా – ఉంటాడు / మన ప్రభువు – నీ వాడు / నా వాడు – మన వాడు / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)
ఆశీర్వాదంబుల్ మా మీద / వర్షింపజేయు మీశ / ఆశతో నమ్మి యున్నాము / నీ సత్య వాగ్దత్తము / ఇమ్మాహి మీద / క్రుమ్మరించుము దేవా / క్రమ్మర ప్రేమ వర్షంబున్ / గ్రుమ్మరించుము దేవా / ఓ దేవా పంపింపవయ్యా / నీ దీవెన ధారలన్ / మా దాహమెల్లను బాపు / మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || / మా మీద కురియించు మీశ / ప్రేమ ప్రవాహంబులన్ / సమస్త దేశంబు మీద / క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || / ఈనాడే వర్షింపు మీశ / నీ నిండు దీవెనలన్ / నీ నామమందున వేడి / సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా / నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా / ఊహించలేనే నీ కృపలేని క్షణమును / కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| / లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే / ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే / నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను / నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2) / అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| / నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే / ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2) / స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా / హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా / నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2) / నిను విడచి నేనుండలేను / క్షణామైనా నే బ్రతుకలేను (2) / కష్ట కాలములు నన్ను కృంగదీసినను / అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2) / నా వెంటే నీవుండినావు / నీ కృపను చూపించావు (2) / భక్తిహీనులు నాపై పొర్లిపడినను / శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2) / నా వెంటే నీవుండినావు / కాపాడి రక్షించినావు (2) / మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను / బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2) / నా వెంటే నీవుండినావు / దయచూపి దీవించినావు (2)