తెలుగు పాటలు|Most Popular

Songs sorted by number of likes. 1604 songs total.

స్తోత్రం చెల్లింతుము|Sthothram Chellinthumu

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము / యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| / దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) / దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| / గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) / కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| / సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) / సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| / సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) / సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) / యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) / సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||

నీ రక్తమే నీ రక్తమే|Nee Rakthame Nee Rakthame

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్ / నీ రక్తమే నా బలము (2) / నీ రక్త ధారలే ఇల / పాపికాశ్రయంబిచ్చును (2) / పరిశుద్ధ తండ్రి పాపిని / కడిగి పవిత్ర పరచుము (2) ||నీ రక్తమే|| / నశించు వారికి నీ సిలువ / వెర్రితనముగ నున్నది (2) / రక్షింపబడుచున్న పాపికి / దేవుని శక్తియై యున్నది (2) ||నీ రక్తమే|| / నీ సిల్వలో కార్చినట్టి / విలువైన రక్తముచే (2) / పాప విముక్తి చేసితివి / పరిశుద్ధ దేవ తనయుడా (2) ||నీ రక్తమే|| / పంది వలె పొర్లిన నన్ను / కుక్క వలె తిరిగిన నన్ను (2) / ప్రేమతో చేర్చుకొంటివి / ప్రేమార్హ నీకే స్తోత్రము (2) ||నీ రక్తమే|| / నన్ను వెంబడించు సైతానున్ / నన్ను బెదరించు సైతానున్ (2) / దునుమాడేది నీ రక్తమే / దహించేది నీ రక్తమే (2) ||నీ రక్తమే|| / స్తుతి మహిమ ఘనతయు / యుగయుగంబులకును (2) / స్తుతి పాత్ర నీకే చెల్లును / స్తోత్రార్హుడా నీకే తగును (2) ||నీ రక్తమే||

దేవా నీ ఆవరణం|Devaa Nee Aavaranam

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2) / ఒక ఘడియ యిచట గడుపుట మేలు / వేయి దినములకంటెను (2) ||దేవా|| / అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2) / అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా / అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2) / ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు / ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా|| / అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2) / నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ / జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2) / శ్రేష్టమౌ నీదు వాక్కులచేత / మము తృప్తి పరచుమయా (2) ||దేవా|| / పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2) / పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం / మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2) / ప్రాణ ప్రియుడవు పదముల జేరి / ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||

స్వస్థపరచు దేవుడు|Swasthaparachu Devudu

స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు / కష్ట కాలములోన నన్ను – మరచిపోడు / నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు / మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు / నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు / శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు / నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు / కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు ||స్వస్థపరచు|| / చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు / మరణము నుండి జీవముకు నను దాటించాడు / మారా వంటి జీవితము మధురముగా మార్చాడు / రోగము నిండిన దేహమును బాగు చేసాడు / పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు / చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు / కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు ||స్వస్థపరచు|| / దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు / ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు / అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు / ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు / నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు / సమాధానకరమైనవిగా రూపొందించాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు / వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు ||స్వస్థపరచు||

ఈ జీవితం విలువైనది|Ee Jeevitham Viluvainadi

ఈ జీవితం విలువైనది / నరులారా రండని సెలవైనది (2) / సిద్ధపడినావా చివరి యాత్రకు / యుగయుగాలు దేవునితో ఉండుటకు / నీవుండుటకు ||ఈ జీవితం|| / సంపాదన కోసమే పుట్టలేదు నీవు / పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) / పోతున్నవారిని నువు చుచుటలేదా (2) / బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| / మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు / కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) / చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) / కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| / పాపులకు చోటు లేదు పరలోకమునందు / అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) / యేసు రక్తమే నీ పాపానికి మందు (2) / కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||

చాటించుడి మనుష్యజాతి|Chaatinchudi Manushya Jaathi

చాటించుడి మనుష్యజాతి కేసు నామము / చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము / జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము / కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో / నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో / మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము – చక్కని మార్గము / సమీపమందు నుండునేమో చావు కాలము / సదా నశించిపోవువారికీ సుభాగ్యము / విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము – సత్య సువార్తను

దేవుని స్తుతియించుడి|Devuni Sthuthiyinchudi

దేవుని స్తుతియించుడి / ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| / ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) / ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) / ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) / ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) / స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సన్న తంతుల సితారతోను (2) / చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / తంబురతోను నాట్యముతోను (2) / తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / పిల్లనగ్రోవుల చల్లగనూది (2) / ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) / గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| / సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) / హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||