పోదాము పోదాము పయనమోదాము
సువార్త చెప్ప పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము
సువార్త చాటింప సాగిపోదాము (2)
ఆ జాతి ఈ జాతి ఏ జాతండి
పరిశుద్దతే మన సొంత జాతండి (2)
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
కానాను దేశమే మన ఊరండి (2)
ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి
క్రీస్తు రక్తమే పాపం బాపునండి (2)