535 worship songs available. Lyrics in Roman and Telugu script.
నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో / మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు / లేవరా వీరుడా – నిరాశను వీడరా / నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు / అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా / భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే ౹౹నా ప్రాణమా|| / యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం / విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా / లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ / యేసు నీతో ఉండును నీ సహాయమాయనే / నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు / నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2) ||నా ప్రాణమా|| / గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను / ఎదురు తిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును / జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను / నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే / నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు / నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు (2) ||నా ప్రాణమా|| / నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు / నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే / నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను / తన తండ్రి ఇంట నీకును సిద్ధపరచెను నివాసము / ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును / ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును (2) ౹౹నా ప్రాణమా||
కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు / కదలవేమి అపవాది చెరసాల పునాదులు / ఇది నీ లోపమా – మరి నా లోపమా / యోచించుమా క్రీస్తు సంఘమా (2) / యోచించుమా క్రీస్తు సంఘమా ||కానరావే|| / సమూయేలుల నందించే హన్నాలేరి / సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి (2) / నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది (2) / నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో / కాలేబులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| / అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి / ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి (2) / శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి (2) / శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో / దావీదులెటు పోయిరో ||ఇది నీ లోపమా|| / నిద్ర లేవాలి ఓ సంఘమా / అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా / క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా / ఉజ్జీవం నీలో నిండాలి / ఓ సంఘమా… నిజ సంఘమా
భూమ్యాకాశములను సృజియించిన దేవా / నీ సన్నిధిలోనే ప్రవేశించెదను / నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు / నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము / మహిమా నీకే… ఘనతా నీకే… / ప్రతి దినం నా ఆరాధన నీకే / మహిమా నీకే… ఘనతా నీకే… / నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే / యేసయ్యా.. నీకే వందనం – (4) / మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు / వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2) / నీ కౌగిలిలో నను హత్తుకొని / అర చేతులలో నను చెక్కుకొని / నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు (2) / ఏమివ్వగలను నేను నీ ప్రేమకై / పగిలిన హృదయముతో ఆరాధింతును ||మహిమా|| / ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు / సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు (2) / నా మనో నేత్రమును వెలిగించి / నా హృదయ కాఠిన్యమును మార్చి / అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు (2) / ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును / విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును ||మహిమా||
మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు / సే… భయమే లేదు / మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు / ఎస్… కొదువ లేదు (2) / ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ / వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ (2) / ఎస్… నో వర్డ్స్ / లాలాలా… లలలల్ల లాలాలా (2) / పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ.. / అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ.. / పగలు మేఘమై నీడనిచెను / అగ్ని స్తంభమై రాత్రి కాచెను ||మైటీ జీసస్|| / మధుర మన్నాతో ఆ… ఆ… ఆ.. పోషించెను ఓ… ఓ… ఓ.. / బండ చీల్చెను ఆ… ఆ… ఆ.. నీరు నిచ్చెను ఓ… ఓ… ఓ.. / మధుర మన్నాతో పోషించెను / బండ చీల్చెను నీరు నిచ్చెను ||మైటీ జీసస్||
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / నిన్ను భజియించి పూజించి ఆరాధింప / నీకే నీకే మహిమ (2) / దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప / ఎంతో ఎంతో మహిమ / మహిమా నీకే మహిమా – (4) ||దేవా|| / కష్టాలలోన నష్టాలలోన / కన్నీరు తుడిచింది నీవే కదా (2) / నా జీవితాంతం నీ నామ స్మరణే / చేసేద నా యేసయ్యా (2) ||మహిమా|| / నా కొండ నీవే నా కోట నీవే / నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2) / నిన్నే భజించి నిన్నే స్తుతించి / ఆరాధింతునయా (2) ||మహిమా||
నిన్ను వెంబడించెద / నీ కాడి మోయుదున్ / నీదు పాదముల చెంత / నే నేర్చుకొందును (2) / మాదిరి నీవే – నెమ్మది నీవే / దీనుడవు యేసయ్యా (2) ||నిన్ను|| / పాపాంధకారం లో నుండి / రక్షించి వెలిగించితివి (2) / పరిశుద్ధమైన పిలుపుతో / నీ వెంబడి రమ్మంటివి (2) / నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను|| / లోకాశలన్ని నీ కోసం / నేనింక ఆశించను (2) / లోపంబులేని ప్రేమతో / నీ కోసం జీవింతును (2) / నీ కోసం జీవింతును ||నిన్ను|| / పవిత్రపరచుకొందును / అర్పించు కొందును (2) / కష్టాలు శ్రమలు రేగినా / నిను వీడిపోనయ్యా (2) / నిను వీడిపోనయ్యా ||నిన్ను|| / ప్రేమ సువార్త ప్రకటింప / భారంబు మోపితివి (2) / సత్యమార్గంబు చాటగ / పంపుము నా ప్రభువా (2) / పంపుము నా ప్రభువా ||నిన్ను||
శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు / నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) / సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు / ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు / ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? / ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? / శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు / యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు / అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త / మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు / దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు / విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము / శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును / విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను / యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను / ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో / మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో / మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు / విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||
న్యాయాధిపతి అయిన దేవుడు / నిను తీర్పు తీర్చేటి వేళలో / ఏ గుంపులో నీవుందువో / యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి|| / ఆకలితో అలమటించగా / దాహముతో తపియించగా (2) / రోగముతో కృశియించగా (2) / నను చేర్చుకొనలేదు నీవెందుకు / అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి|| / గ్రహియించుకో నీదు గమ్యము / విడనాడు పాప గతమును (2) / లేదింక నీకు తరుణము (2) / ప్రభునాశ్రయించుటే బహు క్షేమము / ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి||
తండ్రీ దేవా… తండ్రీ దేవా… / నా సర్వం నీవయ్యా / నీవుంటే నాకు చాలు (2) / నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదన్ / నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదన్ (2) ||తండ్రీ|| / నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా / నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2) / తండ్రీ దేవా… నా ఆనందమా… / నీ ఒడిలో నాకు సుఖము (2) / నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే / జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా (2) / తండ్రీ దేవా… నా ఆనందమా… / నీ ఒడిలో నాకు సుఖము (2)
యేసు యేసూ.. యేసూ.. యేసు / యేసు యేసూ.. యేసూ.. యేసు / నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు / నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు / ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు / శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు ||యేసు యేసూ|| / నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు / ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2) / నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు / నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు ||యేసు యేసూ|| / ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు / అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2) / పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు / నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు ||యేసు యేసూ||
దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2) / పాపుల మార్గములయందు నిలిచి యుండక (2) / అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2) / ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2) / యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2) / ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2) / కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2) / కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2) / ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2) / ఆయన చేయునదియెల్ల సఫలమగును (2) / దుష్ట జనులు ఆ విధముగా నుండక (2) / పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు (2) / న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు (2) / నీతిమంతుల సభలో పాపులును నిలువరు (2) / నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును (2) / నడుపును దుష్టుల దారి నాశనమునకు (2) ||దుష్టుల||
అన్యజనులేల లేచి / గల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేల / జనములేల వ్యర్థమైన / దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల|| / భూలోక రాజులు లేచి / వారేకముగా ఆలోచించి – భూలోక రాజులు / వారి పాశములను తెంపి / పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల|| / ఆకాశ వాసుండు వారిని / అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు / వారలతో పల్కి కోపముతో / వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల|| / పరిశుద్ధమైన నాదు / పర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైన / నారాజు నాసీనునిగా జేసి / యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల|| / కట్టడ వివరింతు నాకు / యిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతు / నీవు నా కుమారుడవు / నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల|| / నన్ను అడుగుము నీకు / జనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుము / దిగంతముల వరకు / స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల|| / ఇనుప దండముతో నీవు / వారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతో / కుండను పగులగొట్టునట్లు / వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల|| / ఓ రాజులారా మీరు / జ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారా / ఓ భూపతులారా మీరు / నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||