535 worship songs available. Lyrics in Roman and Telugu script.
శ్రమలందు నీవు నలిగే సమయమున / ప్రభు నీకు తోడుండునని / యోచించలేదా? గమనించలేదా? / ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు|| / శ్రమలందు ఏలియాకు కాకోలముచేత / ఆహారము పంపించ లేదా? (2) / ఈనాడు నీకు జీవాహారముతో / నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు|| / శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి / రాజ్యాధికారమీయలేదా? (2) / ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి / పరలోక రాజ్యమీయలేదా? (2) ||శ్రమలందు||
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు / ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2) / ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2) / నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే / నీ శక్తినే చాట నన్నుంచెనే చోట / నిన్నెరుగుటే మా ధనం / ఆరాధనే మా ఆయుధం / ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా / ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2) / నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా / నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో|| / ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు / అన్యాయము చేయుట అసంభవమేగా (2) / వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు / దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో|| / అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా / అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2) / యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను / చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) / నేను ఓడిపోనయా – నా పక్షానుండగా / నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) / నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) / నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| / అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే / వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే / నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే / నన్ను దూషించిన చోటే దీవించినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||
నూతన హృదయము నూతన స్వభావము / నూతన ప్రారంభం నాకు దయచేయుము / చెదరిన బ్రతుకును పగిలిన గుండెను / నలిగిన మనస్సును నూతన పరచుము / యేసు నీవే నన్ను సృజియించిన వాడవు / నా బలహీనతలన్ని యెరిగియున్నావు / రాతి గుండెను నాలో తీసివేయుము / అతి మెత్తని హృదయము దయచేయుము ||నూతన హృదయము|| / జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని / పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని / నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను / హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని / నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక / వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను / శుద్ధజలమును నాపై వెదజల్లుము / హిమము కంటెను తెల్లగా కడిగివేయుము ||నూతన హృదయము|| / నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని / నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని / నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని / నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను / నీ శరణు కోరువారిని త్రోసివేయవు / కృపగల మహాదేవ నన్ను మన్నించుము / సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును / సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును ||నూతన హృదయము||
యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం / యేసుని పోలి నడిచే సాక్షులం / యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం / లోకములో యేసుని ప్రతినిధులం / శోధనలెదురైనా అవరోధములెన్నున్నా / విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు / ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా / లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే|| / నిందారహితులుగా జీవించుట మన పిలుపు / నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు / యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము / లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే / ప్రేమయు సహనము యేసుని హృదయము / కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు కోసమే|| / యేసు స్వభామును ధరించిన వారలము / మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము / సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను / రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము / రాజులు జనములు యేసుని చూచెదరు / విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు ||యేసు కోసమే||
షారోను పొలములో పూసిన పుష్పమా / అగాధ లోయలో దాగిన పద్మమా (2) / ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను|| / ఆనందభరితం నీ హృదయం / నీ ప్రేమ అపారము (2) / యేసు నాథుడు నిన్ను పిలువగా / సిద్ధపడుమా ఓ సంఘమా / ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను|| / కొండలు దాటి బండలు దాటి / యేసు నాథుడు నిను చేరగా (2) / నీదు హృదయమున నివసింపనీయుమా / సిద్ధపడుమా ఓ సంఘమా / ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము / నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున|| / చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో / బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున|| / దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము / భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున|| / నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున / సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున|| / జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం / అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2) / క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2) / దావీదు రాజు దీనుడై వేడ (2) / అవనిలో బొందిన నష్టములన్నియు (2) / దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి|| / శత్రు సమూహపు కుతంత్రములతో (2) / బొత్తిగా నేను నష్టపడితిని (2) / మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి|| / పసరు గొంగళి – చీడ పురుగులు (2) / నాశనము చేసిన పంటను కూర్చుమా (2) / యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి|| / ప్రేమ సంతోషానందములను (2) / ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2) / ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| / పాపపు విషముతో నా పాత్ర నిండెను (2) / ప్రభు యేసుండను పిండిని కలుపుము (2) / పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి|| / ఆత్మీయ సోమరితనములో నుండి (2) / ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2) / ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| / పాపము చేసి పడియున్న చోటున్ (2) / ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2) / కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి|| / చేసిన పాపము కప్పుకొనక (2) / విశ్వాసముతో ఒప్పుకొందున్ (2) / సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి||
రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారా / రాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2) / ఓ… మేఘ వాహనంబు మీద వేగమే / ఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి|| / ఓ… భూజనంబులెల్ల తేరిచూడగా / ఓ… నీ జనంబు స్వాగతంబునీయగా / నీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవ / భూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి|| / ఆ… ఆకసమున దూత లార్భటింపగా / ఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగా / ఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయ / యేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ ||రాజాధి|| / ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమా / ఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా / పరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా! / గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు / నాలో నెరవేర్చుచున్నాడు (4) / నేను జడియను భయపడను అలసిపోను / వాగ్దానముల్ నా సొంతమేగా (4) / కన్నీటిని తుడచువాడవు / కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2) / ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2) / నా నీతివలన కానీ కాదయ్యా / అంతా నీ నీతి వలనేనయ్యా (2) ||నేను జడియను|| / కృంగిపోక నే సాగిపోదును / నీ కృప నా తోడున్నదిగా (2) / అది ఇరుకైననూ విశాలమైననూ (2) / విస్తారమైన కృప ఉండగా / నే అలయక సాగెదనయ్యా (2) / నే అలయక సాగెదనయ్యా… / అది ఇరుకైననూ విశాలమైననూ (2) / నా యేసయ్య తోడుండగా / నే అలయక సాగెదనుగా (2) ||నేను జడియను||
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము / యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా / నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి / సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| / అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా / ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా / ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు / ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము / ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| / హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా / ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు / నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును / ఇది నా భాగ్యము నాలోని ధైర్యము / ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| / నా జీవితం పదిలము యేసుని చేతిలో / నా పయనము సఫలము యేసుదే భారము / నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము / ఇది నా విశ్వాసము నాకున్న అభయము / కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు / నీవే నా బలం నీవే నా నమ్మకం (2) / గడచిన కాలము నాతో ఉన్నావు / నేడు నా తోడు నడుచుచున్నావు / సదా నాతోనే ఉంటావు / ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము / ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2) / వ్యాధి నను చుట్టినా / లెమ్మని సెలవిచ్చెదవు / యెహోవా రాఫా / నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ / ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే / నాపై నీ అధికారం చెల్లదే / రూపింపబడిన ఏ ఆయుధం / నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥