167 prayer songs available. Lyrics in Roman and Telugu script.
నీతోనే నే నడవాలని / నీలోనే నే నిలవాలని / నీవలె నే మారాలని / నీ సాక్షిగా నే బ్రతకాలని (2) / (నా) మదిలోని కోరిక నా యేసయ్యా / నే నీతోనే ఉండాలని (2) / నీతో నీతో నీతో నీతో / నీతో నీతో నీతో (2) ||నీతోనే|| / దవళవర్ణుడా రత్న వర్ణుడా / పదివేల మందిలో అతి సుందరుడా (2) / సువర్ణ వీధులలో నీతోనే నడవాలని / నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో|| / కీర్తనీయుడా పూజ్యనీయుడా / స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2) / ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని / నా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||
సువార్తను ప్రకటింపవా / సునాదము వినిపింపవా / సిలువను ధరియించవా / దాని విలువను వివరింపవా / లెమ్ము సోదరా / లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను|| / సుఖము సౌఖ్యము కోరి నీవు / సువార్త భారం మరచినావు (2) / సోమరివై నీవుండి / స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| / నీలోని ఆత్మను ఆరనీకు / ఎదలో పాపము దాచుకోకు (2) / నిను నమ్మిన యేసయ్యకు / నమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం / నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం / ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము / జిహ్వా ఫలము అర్పింతుము (2) / మేమున్నాం నీ చిత్తములో / మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| / తల్లి గర్భమునందు – మమ్మును రూపించి / శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) / ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు / భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు / కృంగిపోము మేమెన్నడు / ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| / ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం / నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2) / జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం / నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం / కలత చెందము మేమెన్నడు / అలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ||
నన్ను గన్నయ్య రావె నా యేసు / నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| / ముందు నీ పాదారవిందము / లందు నిశ్చల భక్తి ప్రేమను (2) / పొందికగా జేయరావే నా / డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| / హద్దులేనట్టి దురాశల / నవివేకినై కూడి యాడితి (2) / మొద్దులతో నింక కూటమి / వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| / కాలము పెక్కు గతించెను / గర్వాదు లెడదెగవాయెను (2) / ఈ లోకమాయ సుఖేచ్ఛలు / చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| / దారుణ సంసార వారధి / దరి జూపి ప్రోవ నీ కన్నను (2) / కారణ గురువు లింకెవ్వరు / లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| / నా వంటి దుష్కర్మ జీవిని / కేవలమగు నీదు పేర్మిని (2) / దీవించి రక్షింపనిప్పుడే / రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
నీ స్వరము వినిపించు ప్రభువా / నీ దాసుడాలకించున్ (2) / నీ వాక్యమును నేర్పించు / దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| / ఉదయమునే లేచి – నీ స్వరము వినుట / నాకు ఎంతో మధురము / దినమంతటి కొరకు – నను సిద్ధపరచు / రక్షించు ఆపదలనుండి – (2) ||నీ స్వరము|| / నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు / నేను సరి చేసికొందు / నీ మార్గములో – నడుచునట్లుగా / నేర్పించుము ఎల్లప్పుడూ – (2) ||నీ స్వరము|| / భయ భీతులలో – తుఫానులలో / నీ స్వరము వినిపించుము / అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా / ధైర్య పరచుము నన్ను – (2) ||నీ స్వరము|| / నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా / నీ స్వరము నా కొరకే / నీతో మనుష్యులతో – సరిచేసికొందు / నీ దివ్య వాక్యము ద్వారా – (2) ||నీ స్వరము|| / నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా / నీ వాక్యమును ఎంతో / నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో / నీ యందు నిలచునట్లు – (2) ||నీ స్వరము|| / నా హృదయములోని – చెడు తలంపులను / చేధించు నీ వాక్యము / నీ రూపమునకు – మార్చుము నన్ను / నీదు మహిమ కొరకేగా – (2) ||నీ స్వరము||
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ / నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్ / నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ / నీ ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా / కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) / జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా / ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా / క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్ / యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||
నాతో నీవు మాటాడినచో / నే బ్రతికెదను ప్రభు (2) / నా ప్రియుడా నా హితుడా / నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో|| / యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి / చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2) / బుద్ధి మీరినాను హద్దు మీరినాను / లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం / ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు / ఒక్క మాట చాలు ప్రభు ||నాతో|| / కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను / వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2) / గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి / దిక్కు లేక నేను దయను కోరుచుంటి / ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు / ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||
నీ చరణములే నమ్మితి నమ్మితి / నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే|| / దిక్కిక నీవే చక్కగ రావే (2) / మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే|| / ఐహిక సుఖము – నరసితి నిత్యము (2) / ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే|| / న్యాయము గాని – నా క్రియలన్ని (2) / రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే|| / భావము మార్చి – నావెత దీర్చి (2) / దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే|| / చంచల బుద్ధి – వంచన యెద్ది (2) / ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే|| / చుర్రుకొని యున్న – శోధనలున్న (2) / పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే|| / నాచు పిశాచి – నరుకుట గాచి (2) / కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే|| / యేసుని తోడ – నెవ్వరు సాటి (2) / దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
వికసించు పుష్పమా (2) / యేసు పాదాల చెంతనే వికసించుమా / తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు|| / నీ ప్రాణ ప్రియుడు సుందరుడు / నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2) / మనోహరుడు అతి కాంక్షణీయుడు (2) / స్తోత్రార్హుడు (2) ||వికసించు|| / నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4) / మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2) / పరిశుద్ధుడు (2) ||వికసించు|| / నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4) / విడువని వాడు నిను ఎడబాయని వాడు (2) / నీతి సూర్యుడు (2) ||వికసించు||
గూడు లేని గువ్వలా దారి తప్పితి / గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2) / నీ గుండెలో దాచుమా / నీ గూటికే చేర్చుమా (2) / నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా / నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| / గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం / నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2) / నువ్వంటే ఇష్టం యేసయ్యా / నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా|| / చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం / నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2) / నేనంటే నీకెంతో ఇష్టమయ్యా / నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
కరుణించవా నా యేసువా / ఓదార్చవా నజరేతువా (2) / నీ కృపలో అనుదినము రక్షించవా / నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| / నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ / బలమైన శోధన నను తరిమిన వేళ (2) / మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) / లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| / ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ / నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) / సాతాను పోరాటమే అధికమైన వేళ (2) / విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||
అమ్మా అని నిన్ను పిలువనా / యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2) / అమ్మా… నాన్నా… (2) / (నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా / ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / ఎవరూ లేని ఒంటరి నేనయ్యా / ఎవరూ లేని అనాథను నేనయ్యా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| / నేనున్నాను భయమేలను అని / నాకభయమిచ్చిన నా యేసు రాజా (2) / అమ్మా… నాన్నా… (2) / అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||