167 prayer songs available. Lyrics in Roman and Telugu script.
ఇదియేనయ్య మా ప్రార్థన / ఇదియే మా విజ్ఞాపన / ఆలకించే దేవా / మము నీ ఆత్మతో నింపగ రావా (2) / నీ వాక్యములో దాగియున్న / ఆంతర్యమును మాకు చూపించయ్యా / నీ మాటలలో పొంచియున్న / మర్మాలను మాకు నేర్పించయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ దృష్టిలో సరిగా జీవించే / మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా / నీ సృష్టిని మరిగా ప్రేమించే / లోబడని మా మనసులు సరిచేయయ్యా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| / నీ సువార్తను గొప్పగ చాటే / బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా / నీ సేవలో తప్పక కొనసాగే / అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2) / నీ జ్ఞానమే మా వెండి పసిడి / నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||
నా ప్రాణమా నాలో నీవు / ఎందుకు కృంగియున్నావు / యెహోవాయందే ఇంకను / నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా|| / ఈతి బాధల్ కఠిన శ్రమలు / అవమానములే కలిగిన వేళ (2) / నీ కొరకే బలియైన యేసు / సిలువను గూర్చి తలపోయుమా (2) / అల్పకాల శ్రమల పిదప / మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఆప్తులంతా నిను వీడిననూ / శత్రువులే నీపై లేచిననూ (2) / తల్లి అయినా మరచినా మరచున్ / నేను నిన్ను మరువాననినా (2) / యేసుని ప్రేమన్ తలపోయుమా / ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా|| / ఐశ్వర్యమే లేకున్ననూ / సౌఖ్య జీవితమే కరువైననూ (2) / ప్రభు సేవలో ప్రాణములనే / అర్పించవలసి వచ్చిననూ (2) / క్రీస్తునికే అంకితమై ఆనందించు / ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||
ఆశీర్వాదంబుల్ మా మీద / వర్షింపజేయు మీశ / ఆశతో నమ్మి యున్నాము / నీ సత్య వాగ్దత్తము / ఇమ్మాహి మీద / క్రుమ్మరించుము దేవా / క్రమ్మర ప్రేమ వర్షంబున్ / గ్రుమ్మరించుము దేవా / ఓ దేవా పంపింపవయ్యా / నీ దీవెన ధారలన్ / మా దాహమెల్లను బాపు / మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || / మా మీద కురియించు మీశ / ప్రేమ ప్రవాహంబులన్ / సమస్త దేశంబు మీద / క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || / ఈనాడే వర్షింపు మీశ / నీ నిండు దీవెనలన్ / నీ నామమందున వేడి / సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
నా కనుల వెంబడి కన్నీరు రానీయక / నా ముఖములో దుఖమే ఉండనీయక / చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) / ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| / అవమానాలను ఆశీర్వాదముగా / నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) / నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| / సంతృప్తి లేని నా జీవితములో / సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) / నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||
కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కరుణ చూపి కలత మాన్పె (2) / యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| / నీకేమీ లేదని ఏమీ తేలేదని / అన్నారా నిన్ను అవమాన పరిచారా / తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని / రేపటిని గూర్చి చింతించుచున్నావా / చింతించకన్న యేసు మాటలు మరిచావా / మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| / నీకెవరూ లేరని ఏం చేయలేవని / అన్నారా నిన్ను నిరాశపరచారా / పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని / నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా / నేనున్నానన్న యేసు మాటలు మరిచావా / కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) / రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| / గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) / తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| / మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా (2) / మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| / మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో (2) / ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| / కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) / క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| / ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) / సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) / నీవు పలికితే నాకు మేలయ్యా (2) / నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| / నీ వాక్యమే నన్ను బ్రతికించేది / నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే స్వస్థత కలిగించేది / నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| / నీ వాక్యమే నన్ను నడిపించేది / నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||
నీ రూపు చూడ నేనాశపడితి / నీ దర్శనమునే నే కోరుకుంటి (2) / నీ సుందర రూపము చూపించు దేవా / నీ మెల్లని స్వరమును వినిపించు ప్రభువా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) / పదివేలమందిలో అతి సుందరుడా / పరలోకనాథా అతికాంక్షనీయుడా (2) / నా ఆశ తీరగను నిన్ను నేను చూడాలి (2) / మధురాతి మధురంబు నీ స్వరము వినాలి (2) ||హల్లెలూయా|| / నీ సన్నిధిలో సుఖ శాంతి దొరికే / నీ మాటతోనే జీవంబు కలిగే (2) / నీ తోడు నీడలో నా బ్రతుకు సాగాలి (2) / నీ దరహాసములో నేనెదిగి పోవాలి (2) ||నీ రూపు||
దినమెల్ల నే పాడినా కీర్తించినా / నీ ఋణము నే తీర్చగలనా / కొనియాడి పాడి నీ సాక్షిగానే / ఇలలో జీవించనా ||దినమెల్ల|| / గాయపడిన సమయాన మంచి సమరయునిలా / నా గాయాలు కడిగిన దేవా / ఆకలైన వేళలో ఆహారమిచ్చి / నన్ను పోషించినావు దేవా (2) / నిను విడువనూ ఎడబాయననినా (2) / నా యేసయ్య ||దినమెల్ల|| / నా బలహీనతయందు నా సిలువను మోస్తూ / నిన్ను పోలి నేను నడిచెదన్ / వెనుకున్నవి మరచి ముందున్న వాటికై / సహనముతో పరుగెత్తెదన్ (2) / ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) / నేను పొందాలని ||దినమెల్ల||
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా / నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) / నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) / నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| / కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా / ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) / నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా / నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| / అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా / మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) / కోపతాపములు దూరపరచయ్యా / అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే||
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా / నిలవాలని ఉన్నా నిలవలేకున్నా (2) / చూడాలని ఉన్నా చూడలేకున్నా / చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా / బ్రతికించుమో యేసయ్యా / దరి చేర్చుమో నన్నయ్యా (2) ||బ్రతకాలని|| / కాపరి లేని గొర్రెనైతి / కాటికి నే చేరువైతి / కావలి లేని తోటనైతి / కారడవిగా నే మారితి / గూడు చెదరిన గువ్వనైతి / గుండె పగిలిన ఎకాకినైతి / గుండె దిగులుగా ఉందయ్యా / గూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రతకాలని|| / నా ఆశలే అడియాశలై / అడుగంటెనే నా జీవితం / శోధనల సుడివడిలో / తొట్రిల్లెనే నా పయనం / చుక్కాని లేని నావనైతి / గమ్యం తెలియక అల్లాడుచుంటి / గురి చేర్చుమో యేసయ్యా / గుండె గుడిలో నీవుండయ్యా (2) ||బ్రతకాలని||
ఆకాశమందున్న ఆసీనుడా / నీ తట్టు కనులెత్తుచున్నాను / నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| / దారి తప్పిన గొర్రెను నేను / దారి కానక తిరుగుచున్నాను (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / గాయపడిన గొర్రెను నేను / బాగు చేయుమా పరమ వైద్యుడా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / పాప ఊభిలో పడియున్నాను / లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||