స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

నిరతము స్తుతియించుము|Nirathamu Sthuthiyinchumu

నిరతము స్తుతియించుము ఓ మనసా / క్రీస్తేసుని స్తుతించు (2) / బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని / కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) / మరువక స్తుతియించుము ఓ మనసా / జయగీతముతో స్తుతించు ||నిరతము|| / వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము / ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) / నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) / ఆ నిజ స్నేహితుని / కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| / అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము / పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) / నీ భారం తొలగించి / తన కృపలో ఆదరించే (2) / నీ ఆత్మ కాపరియైన / పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము||

ఆశీర్వాదం|Aasheervaadam

యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక (2) / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) / తన జాలి – నీ పైన / వెయ్యి తరములు – ఉండు గాక / నీ వంశం – సంతానం / వారి పిల్లల – వారి పిల్లలు (4) / నీ ముందు – నీ వెనుక / నీ పక్కన – నీ చుట్టూ / నీతోనూ – నీలోనూ / తన సన్నిధి ఉండు గాక / ఉదయాన – సాయంత్రం / నీ రాక – పోకలలో / కన్నీటిలో – సంతోషంలో / నీ పక్షం – నీ తోడు / నీ నీడగా – ఉంటాడు / మన ప్రభువు – నీ వాడు / నా వాడు – మన వాడు / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)

దేవా ఇలలోన నీవు|Devaa Ilalona Neevu

దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము / మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2) / మా యజమానివి నీవై మమ్ములను నడిపించు / నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2) / వందనములు అందుకో మా యేసయ్యా / కలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| / నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా / పరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2) / ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యా / నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| / నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా / నీ నీడలో మే సాగుటకు మా గృహమును కట్టుమయా (2) / శోధన వేదనలెదిరించే బలమును అందించుమయ్యా / నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా ||వందనములు|| / నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి / నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి (2) / సమాధాన కర్తవు నీవై మా తోడుగా నీవుండాలి / కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి ||వందనములు||

నా ప్రాణ నాథా|Naa Praana Naathaa

నా ప్రాణ నాథా – నా యేసు నాథా / స్తుతించెదన్ నిన్నే దేవా / స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన / స్తుతించెదన్ దేవ దేవా / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్… / ఓహ్.. ఓహ్.. / ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్ / ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ / నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల / నా ద్వారమైయున్న దేవా ||ఓహ్.. ఓహ్..|| / నా జీవా-హారమా – నా సత్య మార్గమా / నా పునరుత్తానమైన దేవా ||ఓహ్.. ఓహ్..|| / నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా / నా నిత్య వెలుగైన దేవా ||ఓహ్.. ఓహ్..|| / ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్ / ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్ / ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్ / ఐ అడోర్ యు, మై ఫాదర్. ||ఓహ్.. ఓహ్..||

Praise Telugu Songs — Page 9 | UEC Telugu Church