స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

ఆరాధించెదము యేసయ్య|Aaraadhinchedamu Yesayya

ఆరాధించెదము యేసయ్య నామమును / పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2) / ఆరాధన ఆరాధన ఆరాధనా / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము|| / ఆది యందు ఉన్న దేవుడు / అద్భుతాలు చేయు దేవుడు (2) / అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2) / అద్వితీయ సత్య దేవుడు / యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన|| / మోక్షము నిచ్చు దేవుడు / మహిమను చూపు దేవుడు (2) / మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2) / మహిమ గల దేవుడు నిత్య దేవుడు / యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన|| / దాహము తీర్చు దేవుడు / ధన ధాన్యములిచ్చు దేవుడు (2) / దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2) / ధరణిలోన గొప్ప దేవుడు / యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన||

యెహోవా యీరే|Yehovaa Yire

యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు / యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు / యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) / యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి / యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు / యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) / యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా / యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు / యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు / నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4)

ఆనందం నీలోనే|Aanandam Neelone

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా / ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు / అర్హతేలేని నన్ను – ప్రేమించినావు / జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| / పదే పదే నిన్నే చేరగా / ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) / కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2) / కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన / దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం|| / నిరంతరం నీవే వెలుగని / నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) / నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2) / నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా / సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం|| / సర్వసత్యమే నా మార్గమై / సంఘక్షేమమే నా ప్రాణమై (2) / లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2) / నీతోనే నిలవాలి నిత్య సీయోనులో / ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||

మరువని నీదు ప్రేమతో|Maruvani Needu Prematho

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా / విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) / ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా / పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| / కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె / వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) / పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు / ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| / నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది / తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) / పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము / నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని||

సర్వశక్తుని స్తోత్రగానము|Sarvashakthuni Sthothra Gaanamu

సర్వశక్తుని స్తోత్రగానము / సల్పరే జగమెల్లను / నిర్వహించును దాస భారము / నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| / ముదముతో నిర్మానకుండగు / మూల కర్తను బాడరే / వదన మీక్ష్మాన్వoచి దేవుని / వందనముతో వేడరే (2) ||సర్వ|| / వేదపారాయణము సేయుచు / విశ్వమంత జయింపరే / సాదరముగా దేవు నిక మీ / స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| / ఎదను విశ్రాంతిన్ పరేశుని / హెచ్చుఁగా నుతి జేయరే / సదమలంబగు భక్తితో మీ / సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| / చావు పుట్టుక లేనివాడుగ / సంతతము జీవించును / ఈవులిచ్చుచు దన్ను వేడు మ- / హేష్టులను రక్షించును (2) ||సర్వ|| / దాసులై దేవునికి నెదలో / దర్పమును బోగాల్పరే / యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము / నే మరక మైదాల్పరే (2) ||సర్వ||

తీయని స్వరాలతో|Theeyani Swaraalatho

తీయని స్వరాలతో నా మనసే నిండెను / యేసుని వరాలతో నా బ్రతుకే మారెను / భావమధురిమ ఉప్పొంగెను / రాగసుధలతో భాసిల్లెను (2) / పరవశించి నిను స్తుతించి / ఘనపరచెద వైభవముగా ||తీయని|| / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను / నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను / సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము / ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను / యేసుతో రాజ్యము చేసే భాగ్యము / నాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను / సహాయుడా నీలోనేగా నా సాఫల్యము / ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను / యేసుని సన్నిధి చేరే భాగ్యము / నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము ||తీయని||

నిరంతరమైన నీ కృపలో|Nirantharamaina Nee Krupalo

నిరంతరమైన నీ కృపలో / నే పొందుచున్న ఆనందమే అది / అవధులు లేని ఆనందమే అది / శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| / అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు / అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు / బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) / నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే / నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| / మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా / మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||