స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

ధన్యము ఎంతో ధన్యము|Dhanyamu Entho Dhanyamu

ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) / ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) / వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| / ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) / ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| / క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) / క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| / ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2) / ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు|| / ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2) / అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు|| / శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2) / శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||

నిను స్తుతించినా చాలు|Ninu Sthuthinchinaa Chaalu

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో / నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) / ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా / నీ సన్నిధిలో… / నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| / స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ఆరాధ్య దైవము నీవేనయ్యా / ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| / ఆదిసంభూతుడవు నీవేనయ్యా / ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2) / నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

Praise Telugu Songs — Page 47 | UEC Telugu Church