స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

నూతన సంవత్సరం|Noothana samvathsaram

నూతన సంవత్సరం దయచేసిన దేవా / నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) / ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2) / అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || / పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు / శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు / చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా / ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా / నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని / నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| / కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా / కష్టాలతో నేను సతమతమౌతుండగా / నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా / ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి / నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని / నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని ||నూతన||

అంతే లేని నీ ప్రేమ ధార|Anthe Leni Nee Prema Dhaara

అంతే లేని నీ ప్రేమ ధార / ఎంతో నాపై కురిపించినావు / వింతైన నీ ప్రేమ కొంతైన గాని / కాంతింప కృప నాకు చూపించినావు (2) / ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో / పొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కాను / అంతో ఇంతో ఆ ప్రేమను నేను / పంచేటందుకు నీ భాగ్యము పొందాను ||అంతే|| / పరిశుద్ధుడు పరిశుద్ధుడు / అని దూతలతో పొగడబడే దేవా / పదివేలలో అతి సుందరుడా / నీవేగా అతి కాంక్షనీయుడా (2) / నా దోషములకై ఆ కలువరి సిలువలో / బలియాగమైనావ దేవా (2) / సొంతముగా నే చేసిన నా పాపములన్ని / శాంతముతో సహియించి క్షమియించినావు / పంతముతో నిను వీడి నే పారిపోగా / నీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు ||అంతే|| / ఏమున్నదీ నాలో దేవా / మంచన్నదే లేనే లేదు / అయినా నీవు నను రక్షించి / నీ సాక్షిగ నిలిపావు ఇలలో (2) / అర్హతయే లేదు నీ పేరు పిలువ / నీ సొత్తుగా నను మార్చినావా (2) / ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు / నా జీవితమంతయును నీ కొరకే దేవా / నీ సేవలో నేను కొనసాగెదనయ్యా / ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు ||అంతే||

యేసయ్యా కనికరపూర్ణుడా|Yesayyaa Kanikarapoornudaa

యేసయ్యా కనికరపూర్ణుడా / మనోహర ప్రేమకు నిలయుడా (2) / నీవే నా సంతోష గానము / సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| / నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి / నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) / సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి / శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| / నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు / దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) / అలసిన వారి ఆశను తృప్తిపరచితివి / అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| / నీ వలన బలమునొందిన వారే ధన్యులు / నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) / నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు / నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా|| / ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) / ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

నీతి న్యాయములు|Neethi Nyaayamulu

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా / నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) / వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా / నీ ప్రియమైన స్వాస్థ్యమును / రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను / నీ రాజ్య దండముతో ||నీతి|| / ప్రతి వాగ్ధానము నా కొరకేనని / ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2) / నిత్యమైన కృపతో నను బలపరచి / ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) ||నీతి|| / పరిమళ వాసనగ నేనుండుటకు / పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2) / ప్రగతి పథములో నను నడిపించి / ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) ||నీతి|| / నిత్య సీయోనులో నీతో నిలుచుటకు / నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2) / మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు / ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) ||నీతి||

స్తుతులపై ఆసీనుడా|Sthuthulapai Aaseenudaa

స్తుతులపై ఆసీనుడా / అత్యున్నత నా దేవుడా (2) / నీ ప్రేమలో నీ ప్రేమలో / నను నేను మరిచాను నీ ప్రేమలో / నీ నీడలో నీ జాడలో / మైమరచిపోయాను నేను ||స్తుతులపై|| / నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు / నీవు పొందిన గాయాలకు బదులు (2) / బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు / వెండినడుగలేదు నీవు / విరిగి నలిగి – కరిగి వెలిగే / హృదయాన్నే కోరావు నీవు (2) / ఓ మాట సెలవియ్యి దేవా / నీ పాద ధూళిని కానా ప్రభువా / నీ పాదం స్పర్శించగానే / నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై|| / నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు / మా బ్రతుకులో విజయము మొదలు (2) / మరణం అనేటి ముల్లును విరచి / తిరిగి లేచావు నీవు / చీకటి నిండిన మాదు బ్రతుకులో / వెలుగులు నింపావు నీవు (2) / నీకోసం ఏదైనా దేవా / నే వెచ్చింప సంసిద్ధమయ్యా / ఆఖరికి నా ప్రాణమైనా / చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

Praise Telugu Songs — Page 37 | UEC Telugu Church