799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు / నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృప చూపే దేవుడవు / నిడిపించే నజరేయూడ – కాపాడే కపరివి / శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను / వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై / శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించేను / వాక్యమే కృపావక్యమే – నను వీడని అంబంధమై / ని మాటలే జలధరలై – సంప్తృప్తి నిచ్చెను / ని మాటలే ఔషదమై – గాయములు కట్టెను / నీ మాటే మధురం… / రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు / ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి / మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు / ఏదియు కోడువచేయవు నిన్నశ్రయించినా వారికి / భీకరమైన కార్యములు చేయుచున్నవాడా / సజీవుడావై అధికస్తోత్రము పొందుచున్నవాడా / ఘనపరతును నిన్నే… / ప్రేమించే యెసయ్యా నివుంటే చలునయ్యా / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి / నా నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / సంఘమై నీ స్వాస్థ్యమై – నన్ను ని యెదుట నిలపాలని / ఆత్మతో మహిమాత్మతో – నన్ను ముద్రించియున్నావు నీవు / సంఘమై నీ స్వాస్థ్యమై – నన్ను ని యెదుట నిలపాలని / ఆత్మతో మహిమాత్మతో – నన్ను ముద్రించియున్నావు నీవు / వరములతో ఫలములతో నీకై బ్రతకాలని / తిదిశ్వాస నీ సన్నిదిలో విజయం చూడాలని / ఆశతో ఉన్నానయా… / కరుణించే యెసయ్యా నీ కోసమే నా జీవితం / నిను చేరే ఆశయం తీరాలయ్యా / నిను చూసే ఆ క్షణం రావాలయ్య / నీతి సూర్యుడా – భూవినేలే యెసయ్యా / సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని / రాజులకే మహారాజువు – కృపాచూపే దేవుడవు / నడిపించే నజరేయూడ – కాపాడే కాపరివి
దేవుని స్తుతియించి ఆరాధింతుము / మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) / రండీ ఓ జనులారా / సర్వలోక నివాసులారా (2) / సంతోషగీతము పాడెదము (2) / ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని|| / వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును / భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2) / ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2) / ఆయనే రక్షించును ||రండీ ఓ|| / బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను / నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2) / శత్రువుల చెర నుంచి విడిపించెను (2) / తోడుండి నడిపించెను ||రండీ ఓ|| / మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును / కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2) / వేదనలు శోధనలు ఎదిరించగా (2) / శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ|| / కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును / భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2) / ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2) / దిగులే మనకెందుకు ||రండీ ఓ||
ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను / నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా|| / గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ / ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ / ప్రభువా నా ప్రక్కనుండి / నన్ను తప్పించినావు (2) ||ప్రభువా|| / నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు / కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు / ఎన్నాళ్ళు బ్రతికియున్నా / నిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా||
మమ్మెంతో ప్రేమించావు / మా కొరకు మరణించావు / మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా / నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) / ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ… / హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో|| / మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు / మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2) / మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| / మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు / పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2) / రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో||
చాహే తుమ్ కో దిల్ సే / గాయే యే గీత్ మిల్ కే / తేరే నామ్, యేషు నామ్ కి జై (2) / జిస్ నామ్ మె హై జిందగీ / వో నామ్ హై యేషు మసీహ్ / జిస్ నామ్ మె హై బందగీ / వో నామ్ హై యేషు మసీహ్ / యేషు నామ్ యేషు నామ్ / యేషు నామ్ యేషు నామ్ / యేషు నామ్ యేషు నామ్ కి జై (2) / యేషు నామ్ మే మిల్తీ హై క్షమా / యేషు నామ్ మే మిల్తీ హై షిఫా / యేషు నామ్ మే మిల్తీ హై క్రిపా / యేషు నామ్ మే కరుణా దువా / యేషు నామ్ యేషు నామ్ – (2) ||యేషు నామ్||
నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు / శ్రమ కాలమైనా తోడుగ నీవుండ / నీ నామ ధ్యానం నే చేతునయ్యా / నీతోనే నేను ఉంటానయ్యా (2) / నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా / నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా ||నీ సన్నిధిలో|| / అర్పించినావు నా కొరకు నీ ప్రాణం / నా పాప భారం తొలగింప గోరి / నాతోనే నీవు ఉండాలని (2) / ఆశించినది నా రక్షణేగా – నీవు / నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు ||నీ సన్నిధిలో|| / నను చంపబోయి సాతాను రాగా / నీ చేతి గాయం రక్షించునయ్యా / నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2) / నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం / నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం ||నీ సన్నిధిలో||
స్నేహితుడా నా స్నేహితుడా / నా ప్రాణ స్నేహితుడా / ఆపదలో నన్నాదుకొనే / నిజమైన స్నేహితుడా (2) / నన్నెంతో ప్రేమించినావు / నాకోసం మరణించినావు (2) / మరువగలనా నీ స్నేహము / మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| / నా ప్రాణ ప్రియుడా నీ కోసమే / నే వేచానే నిరతం నీ తోడుకై (2) / ఇచ్చెదన్ నా సర్వస్వము / నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| / కన్నీటితో ఉన్న నన్ను / కరుణించి నను పలుకరించావు (2) / మండిన ఎడారిలోన / మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా / కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) / ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని / అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2) / అభయమునిచ్చిన నా యేసయ్యా / అండగ నిలిచిన నా యేసయ్యా / యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||
నను విడువక ఎడబాయక / దాచితివా.. నీ చేతి నీడలో / (యేసయ్యా) నీ చేతి నీడలో (2) / సిలువలో చాపిన రెక్కల నీడలో (2) / సురక్షితముగా నన్ను దాచితివా (2) / కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి / ఆదరించిన యేసయ్యా (2) ||నను|| / ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2) / నీవున్న చోటున నేనుండుటకై (2) / పిలుపుకు తగిన మార్గము చూపి / నను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను||
నీలి ఆకాశంలో (2) / నీ నీతి రాజ్యంలో / నేనుండ గోరితి ప్రభువా ఆ… / నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియుడు నా చెంతనున్నాడు / గోప రసమంత సువాసన కలవాడు / నా ప్రియుడు ఏదేను వనమాలి / కర్పూరాల పుష్పాల సమానుడు / అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా / అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా / ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా / నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను / నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా / ఆ రత్నాల వర్ణుడు నను తాకగా / నేను నిదురించిన మనసు మేలుకొన్నది / నా మనసంతా యేసుతో నిండగా / రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) / శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) / యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా / యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) / మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) / పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే|| / ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2) / జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే|| / అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2) / ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే||
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. / నిన్నే నిన్నే నే కొలుతునయ్యా / నీవే నీవే నా రాజువయ్యా (2) / యేసయ్య యేసయ్య యేసయ్యా… / కొండలలో లోయలలో / అడవులలో ఎడారులలో (2) / నన్ను గమనించినావా / నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| / ఆత్మీయులే నన్ను అవమానించగా / అన్యులు నన్ను అపహసించగా (2) / అండ నీవైతివయ్యా / నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| / మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ / నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) / నన్ను బలపరచెనయ్యా / నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| / వంచెన వంతెన ఒదిగిన భారాన / ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) / కలలా కడతేర్చినావా / నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||