799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నిరతము నిను స్తుతియించినా / దేవా – సరిపోదు ఆరాధన / ప్రతి క్షణము కీర్తించినా / ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము|| / ప్రభువా యెహోవా రాఫా నీవే / నా స్వస్థతలు అన్ని నీవే నీవే / దేవా యెహోవా నిస్సి నీవే / నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన|| / ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా / కోపానికి కాలయాపన నీదే ప్రభువా / నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా / నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2) ||ఆరాధన|| / నా గతము రద్దు చేసిన నాదు దేవా / నా రేపును నడిపించేది నీవే ప్రభువా / నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా / నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2) ||ఆరాధన||
సమస్త జనులారా మీరు / యెహోవాకు స్తుతిగానము పాడి / సంతోషముతో సన్నిధిలో / ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| / తానెయొనర్చె మహకార్యములన్ / పాపిని రక్షింప బలియాయెన్ (2) / శత్రుని రాజ్యము కూలద్రోసెను / స్మరియించుడి మీరందరును (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు / విడిపించె నైగుప్తునుండి (2) / నలువది వత్సరములు నడిపించె / కానానుకు మిమ్ము చేర్చుటకు (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / మోషేకు తన సేవను నొసగె / యెహోషువా జయమును పొందె (2) / శత్రుని గెల్చి రాజ్యము పొందె / ఘనకార్యములను స్మరియించి (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / మీరే ప్రభుని స్వంత ప్రజలుగా / కొనె మిమ్ము తన రక్తముతో (2) / ఆత్మల చేర్చి సంఘము కట్టె / ఆ రీతిని కని స్మరియించు (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము / నేడే వినుమాయన స్వరము (2) / అర్పించుడి మీ జీవితములను / సాగిలపడి ఆయన యెదుట (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త||
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు / ఓ మనసా! నా మనసా! (2) / నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2) / నీ మహిమే మేటి (3) || ప్రభుని || / ప్రభూ నీ శరణాగతులగువారు (2) / విడుదల నొందెదరు (3) || ప్రభుని || / పాపుల కొరకై సిలువను మోసి (2) / ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని || / మా ప్రభువా మా మొరనాలించి (2) / నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని ||
మేలు చేయక నీవు ఉండలేవయ్యా / ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| / నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా / నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) / నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) / క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| / ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను / పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) / నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) / నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| / పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను / క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) / నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) / అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు / గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) / గుండె నిండా నువ్వే / యేసు గుండె నిండా నువ్వే (4) / లోక స్నేహం వెలివేసినా / శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం / నా హృదయం చెప్పేదొక్కటే / గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే|| / ఊపిరంతా శాపమైనా / గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి / జాలి లేని ఇలలోన / నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే|| / చిరకాలం నీ ఒడిలో / ఉండాలని ఆశతో / చెమ్మగిల్లే కలలతోనే / పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే / నా తండ్రి నీవే – నీవే (2) / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా / యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి|| / నా అడుగులు తప్పటడుగులై / నడిచిన నా ప్రతి మార్గము / సరిచేయు నా తండ్రివి (2) / పగలు ఎండ దెబ్బయైనను / రాత్రి వెన్నెల దెబ్బయైనను / తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా|| / గాడాంధకార లోయలో / నే నడచిన ప్రతివేళలో / తోడున్న నా తండ్రివి (2) / వేయిమంది కుడి ఎడమకు / కూలినా కూలును కాని / చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా||
మా మధ్యలో సంచరించువాడా / ఆరాధన నీకేనయ్యా / మా మధ్యలో అద్భుతాలు చేయువాడా / ఆరాధన నీకేనయ్యా / మార్గము తెరిచే అద్భుతకరుడా / మాట తప్పని తేజోమయుడా / నీవే.. నీవే యేసయ్యా (2) / మాలో నీవు హృదయాలు మార్చుము / యేసయ్యా యేసయ్యా.. / మా మనసులను స్వస్థపరచుము / యేసయ్యా యేసయ్యా.. నీవే ||మార్గము|| / చీకటి లోయలో సంచరించినా / నిరీక్షణ కోల్పోయినా / గొప్ప కార్యము జరిగించెదవు / నాలో నెరవేర్చెదవు (2) ||మార్గము||
భయము లేదు దిగులే లేదు / నా జీవితమంతా ప్రభు చేతిలో / నిరాశ నన్నెన్నడు ముట్టలేదు / నిరీక్షణతో అనుదినం సాగెదను (2) / యావే నీవే నా దైవం – తరతరముల వరకు / యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు / నీవు కునుకవు నీవు నిదురపోవు / ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2) / మరణ భయం అంతా పోయెను / శత్రు భీతి అంతా తొలగించెను (2) / మరణమును ఓడించి / శత్రువును జయించిన / సర్వాధికారివి నా దేవా (2) ||యావే|| / ఓటమిని అంతా తీసివేసి / రోగాన్ని అంతా మాన్పివేసి (2) / జయశీలుడవు / పరమ వైద్యుడవు / సర్వశక్తుడవు నా రక్షకా (2) ||యావే||
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి / మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా / ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము / ఆనందించెదము మేము ఆనందించెదము / నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము / మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము / యేసు యేసు నీ ద్వారనే / మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి / యేసు యేసు నీ వలనే కదా / మేము నీతోడి దేవునికి వారసులమైతిమి ||మా హృదయములలో|| / ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి / కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి / మా అపరాధముల కొరకు అప్పగింపబడి / మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు / మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు / పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి ||మా హృదయములలో|| / శ్రమల కాలములో శోకముల ఘడియలలో / నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము / మేమికను పాపులముగా నుండగానే ప్రభూ / మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి / మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము / ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము ||మా హృదయములలో||
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు / నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము / ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు / నేనేమాత్రము మేము ఏ మాత్రము / నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే / నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు|| / ఎన్నుకొంటివే నన్ను ఎందుకని / హెచ్చించితివే నన్ను ఎందుకని (2) / మందను వెంటాడి తిరుగుచుంటినే (2) / సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన|| / నా ఆలోచనలన్ని చిన్నవని / నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) / తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) / యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||
నీవే నా స్నేహము – నీవే నా సర్వస్వము / నీవే ఆధారము – నీవే నా ఆనందము / నీ ప్రేమ నాలో పదిలము / నీలోనే సాక్ష్యమే సంతోషము (2) / సర్వోన్నతుడా నీకే మహిమ / పరమ తండ్రి నీకే ఘనత (2) ||నీవే|| / నా జీవితాంతం నిన్నే పొగడెదను / నా ప్రతి ఆశ నిన్ను మహిమ పరచుటయే (2) / నా దేవుని మందిరములో నివసించెదను / నా స్తుతి నైవేద్యం నీకే అర్పించెదను – (2) ||సర్వోన్నతుడా|| / నా బలహీన స్థితిలో గతివి నీవైతివే / నా కన్నీరు నాట్యముగా మార్చినది నీవే (2) / కృంగిన నా హృదయమును లేవనెత్తితివి / అసాధ్యమైనది నీకు ఏదియు లేదయా – (2) ||సర్వోన్నతుడా||
ఆకాశము నీ సింహాసనం / భూలోకము నీ పాద పీఠము / మహోన్నతుడా – మహా ఘనుడా / నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము / స్తుతులకు పాత్రుడా యేసయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా / జీవాధిపతివి నీవయ్యా / జీవము గల మా యేసయ్యా / పాపుల రక్షకా యేసయ్యా / రక్షించుటకు పుట్టావయ్యా / నీ సిలువే నా మరణమును / తప్పించి రక్షించెనయ్యా / అద్భుతకారుడా మహనీయా / ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా / దయగల మా ప్రభు యేసయ్యా / కృపగల మా ప్రభు నీవయ్యా / రానైయున్న యేసయ్యా / బూరధ్వనితో నీవేనయ్యా / మధ్యాకాశంలో విందయ్యా / ఎంతో ధన్యత మాకయ్యా