799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నా ఆశల పల్లకి నీవే / నా ఊహల ఊట నీవే / నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా నా ఆశ నీవయ్యా (2) / ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా / నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2) / నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే / దాహము తీర్చావని (2) / దాహము తీర్చావని ||యేసయ్యా|| / దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా / నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2) / నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే / తోడుగ ఉన్నావని (2) / తోడుగ ఉన్నావని ||యేసయ్యా|| / స్నేహితులు లేరని – తోడెవరు రారని / నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2) / నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు / ఆదరించావయ్యా (2) / ఆదరించావయ్యా ||యేసయ్యా||
వేసారిన మనసే ఊగెనే / చేజారిన స్ధితికి చేరెనే / యే గాయమైన మానదే / నాకున్న బలము చాలదే (2) / వినిపించు యేసు నీ స్వరం / నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన|| / కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే / తాళలేను లేసమైన నీ కోపమే / భారము మోపకే లోపమూ చూడకే / ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన|| / వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే / వీడిపోదు ఆదరించే నీ స్నేహమే / తోడుగా ఉండునే – త్రోవను చూపునే / చెకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన||
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు / నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2) / నా దోషము భరియించి నా పాపము క్షమియించి / నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2) / ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి / కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| / కష్టాల కడలిలో కన్నీటి లోయలలో / నా తోడు నిలిచావు నన్నాదరించావు (2) / అందరు నను విడచినా నను విడువని యేసయ్యా / విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| / నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా / నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2) / నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా / నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||
యేషు మసీహ్ / తేరే జైసా హై కోయి నహీ / తేరే చరణో మే ఝుకే ఆస్మాన్ / ఔర్ మహిమా గాయే జమీన్ (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (2) / ప్యారే పితా / తూనే హమ్ సే కిత్నా ప్యార్ కియా / హమే పాపోన్ సే చుడానే కో / అప్నే బేటే కో కుర్బాన్ కియా (2) / హమ్ గాయే హో-స్సనా / తూ రాజావో కా హై రాజా / తేరీ మహిమా హోవే సదా / తూ హై ప్రభు, హమారా ఖుదా (4)
నీ కృపను గూర్చి నే పాడెదా / నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) / నిత్యము నే పాడెదా / నా ప్రభుని కొనియాడెదా (2) / మహిమా ఘనతా / ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| / ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా / నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను|| / వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా / మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) / నా యేసు నాకుండగా / నా క్రీస్తే నా అండగా / భయమా దిగులా / మనసా నీకేలా (2) ||నీ కృపను||
నా చిన్ని హృదయముతో / నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్ / పగిలిన నా కుండను / నా కుమ్మరి యొద్దకు తెచ్చి / బాగుచేయమని కోరెదన్ (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే / మట్టి నుండి తీయబడితిని / మరలా మట్టికే చేరుదును (2) / మన్నైన నేను మహిమగ మారుటకు / నీ మహిమను విడచితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / అడుగులు తడబడిన వేళలో / నీ కృపతో సరి చేసితివే (2) / నా అడుగులు స్థిరపరచి నీ సేవకై / నడిచే కృప నాకిచ్చితివే (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2) / ఈ లోక యాత్రలో / నాకున్న ఆశంతయూ (2) / నా తుది శ్వాస విడచే వరకు / నీ పేరే ప్రకటించాలని (2) / హోసన్న హోసన్నా యూదుల రాజుకే / హోసన్న హోసన్నా రానున్న రారాజుకే (2)
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో / కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2) / మహదానందమే నాలో పరవశమే / నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| / ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా / నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2) / నీవే నీవే నా ఆనందము / (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర|| / సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే / జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2) / నీవే నీవే నా జయగీతము / (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర|| / వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును / పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2) / నీవే నీవే నా అతిశయము / (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||
జీవాధిపతివి నీవే నా యేసయ్య / నాకున్న ఆధారము నీవేనయ్యా (2) / నీవుంటే చాలు, కీడు కాదా! మేలు / లెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి|| / ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవు / అల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2) / నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యము / నీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2) ||నీవుంటే|| / రాజుల హృదయాలను తిప్పువాడవు / నిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2) / ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగను / నీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా (2) ||నీవుంటే||
కీర్తింతును నీ నామము / మనసారా యేసయ్యా (2) / మదిలో ధ్యానించి (2) / తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును|| / ఏలేశమైన కరుణకు / ఈ దోషి పాత్రమా (2) / కల్వరిలో కృప చూపి / కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును|| / వేనోళ్ళతోను పొగిడినా / నీ ఋణము తీరునా (2) / ఇన్నాళ్లు కన్నీళ్లు (2) / తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును|| / జీవింతు నేను నీ కొరకే / నీ సాక్షిగా ఇలలో (2) / సేవించి పూజింతు (2) / నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును||
జగములనేలే శ్రీ యేసా / మా రక్షణ ప్రాకారమా / మా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే|| / వేల్పులలోన నీవంటి దేవుడు / ఎవరున్నారు ప్రభు (2) / పూజ్యులలోన పూజార్హుడవు (2) / నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2) / అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా / శరణము వేడిన అభయము నొసగే దేవా (2) / అవధులు లేని నీ ప్రేమను (2) / వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే|| / జీవనమంతయు నీకర్పించి / పానార్పణముగా నే పోయబడుదును (2) / శ్రేష్టఫలములను ఫలియించెదను (2) / నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2) / విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా / నలిగిన హృదయం నీ ఆలయంలో దేవా (2) / అన్ని వేళలలో మాతో ఉండి (2) / మమ్ము నడిపించు ప్రభో మమ్ము నడిపించు ప్రభో ||జగములనేలే||
సమాధాన గృ-హంబులోను / సమాధాన-కర్త స్తోత్రములు (2) / క్రీస్తు యేసు మనకిలలో / నిత్య సమాధానము (2) / మద్యపు గోడను కూల ద్రోసెను (2) / నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| / పర్వతములు తొలగినను / తత్థరిల్లిన కొండలు (2) / నాదు కృప నిను విడువదనెను (2) / నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| / లోకమిచ్చునట్లుగా / కాదు ప్రభు సమాధానము (2) / సత్యమైనది నిత్యము నిల్చును (2) / నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన||
నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2) / నా ఇంటి వస్తువులు లెక్క చూడగా (2) / ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము|| / కంచె వేసితివి నా చుట్టు నీవు / ఘనముగా చెప్పితివి నా విషయమై (2) / రాజ్యములు జయించితిని విశ్వాసముతో (2) / కృప వెంబడి కృప చూపుచుండగా (2) / నా కుటుంబీకులు పచ్చిక వలెను / విస్తారమగును నా సంతానము (2) / ఆకు వాడక తన కాలమందున (2) / ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును (2) / పితరులు చూడని వాగ్ధాన ఫలమును / అనుభవించుచుంటిని నీ దయతో (2) / విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు (2) / మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను (2) / ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు / పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద (2) / నా చేతి పనులన్ని సఫలము చేసి (2) / ఆశీర్వాదము నా సొత్తు చేసితివి (2) / యాత్రికుడనై పరదేశిగా నేను / నివసించుచుంటిని గుడారాలలో (2) / మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై (2) / మరచిపోతిని నా జన్మ భూమిని (2) ||నా గుడారము||