799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన / మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా|| / నా జీవిత గమనము – నా జీవన గమనము / నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము / అందులకు యెహోవాకు / స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| / నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త / నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము / అందులకు యెహోవాకు / స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||
మట్టినైన నన్ను మనిషిగా మార్చి / జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2) / ఎంత పాడినా – ఎంత పొగిడినా / ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా / నీ ఋణమును నేను తీర్చలేనయ్యా / నా యేసురాజా నా దైవమా (2) / నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే / నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2) / నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2) / అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా|| / అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే / కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే (2) / నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం (2) / విశ్వ మానవాళికి పాపవిమోచన (2) ||ఎంత పాడినా||
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం / దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం / నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా / నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం / అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు / మహిమ పొందాలని ఘనత నొందాలని / వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి / నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2) / తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2) / నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో|| / నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం / ఆవిరైపోవును ఇది మన్నైపోవును / అల్ప కాలమేగా ఈ లోకము / పాడైపోవును ఇది లయమైపోవును (2) / ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు / సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు / ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను / నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||
కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక / కలుగు నున్నతమైన – ఘన స్థలములందున / నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును|| / ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా / పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను / మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును|| / మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను / మహిమాతిశయమును – మది దలంచియు నీకు / మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| / ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా / లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె / పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ ||కలుగును|| / పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ / పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు / బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్ ||కలుగును||
కాలాలు మారిన గాని – యేసు మారడు / తరతరాలు మారినా యేసుని / ప్రేమ మారదు – (2) ||కాలాలు|| / గర్భమున పుట్టిన మొదలు / తల్లి ఒడిలోనున్నది మొదలు (2) / కడవరకు మోసే ప్రేమది / ముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు|| / నింగి నేల మారిన గాని / పర్వతాలు తొలగిన గాని (2) / కడవరకు నిలిచే ప్రేమది / కలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు||
ఆరాధించెదము ఆత్మతో నిరతము / యెహోవా దేవుని మనమంతా / ఆనంద గానము మనసారా పాడుచు / అనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము|| / అక్షయ నాథుడు అద్వితీయుడు / పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2) / ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2) / అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము|| / సత్య స్వరూపి మహోన్నతుడు / మహిమాన్వితుడు మనకును తండ్రియే (2) / ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2) / పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము|| / సమస్తమునకు జీవాధారుడై / శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2) / భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2) / యుగములకు కర్తయే శ్రీమంతుడు (2) ||ఆరాధించెదము||
నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా / నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2) / నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా / నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం|| / మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి / విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2) / నీకెవరూ సాటే రారయ్యా / నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం|| / ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా / అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2) / నిజమైన స్నేహం నీదయ్యా / నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా (2) ||నిత్యం||
ఎడబాయని నీ కృప / నను విడువదు ఎన్నటికీ (2) / యేసయ్యా నీ ప్రేమానురాగం / నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| / శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో / కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) / అర్ధమేకాని ఈ జీవితం / ఇక వ్యర్థమని నేననుకొనగా (2) / కృపా కనికరముగల దేవా / నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| / విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు / లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) / దుష్టుల క్షేమమునే చూచి / ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) / దీర్ఘశాంతముగల దేవా / నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| / నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో / నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) / భారమైన ఈ సేవను / ఇక చేయలేనని అనుకొనగా (2) / ప్రధాన యాజకుడా యేసు / నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ / పొంగి పారెనే – పొంగి పారెనే (2) / నే ప్రేమింతును – నా యేసుని మనసారా (2) / ఆరిపోవు లోక ప్రేమల కన్నా / ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| / నా కన్నీటిని తుడిచినా ప్రేమ / నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా దీన స్థితిని చూచిన ప్రేమ / తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| / నా భారంబును మోసిన ప్రేమ / సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) / ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ / నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||
కరుణించి కాపాడే యేసయ్యా.. / యేసయ్యా… యేసయ్యా.. / కూడుకొని మనమీవేళ / ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) / గడచిన దినముల కలిగిన సుఖముకై / ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| / వేసవి వడగాలుల బాధ తీరిపోయే / యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే / విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే / విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే / గానమై గళమున పాడగా / ధ్యానమై మనసుని తాకగా / ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| / పాతవి కడ తేరగ మనసు మారిపోయే / నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే / ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే / సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే / స్తోత్రమే నిలువుగ లేవగా / ధూపమై వరదుని చేరగా / తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు / ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2) / నీకే నీకే నీకే పాదాభివందనము / నీకే నీకే నీకే స్తోత్రాభివందనము ||ఎన్నిక|| / బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు / ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2) / ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను / ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే|| / పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు / ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2) / ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను / ఏ రీతి నిను నేను సేవించను (2) ||నీకే||
ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా . / నూతన బలముతో నను నింపినావు (2) / బలహీనులను బలపరచువాడా / కృంగిన వారిని లేవనెత్తువాడా (2) / యేసయ్యా నా ఆశ్రయమా / యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| / సొమ్మసిల్లక అడుగులు తడబడక / నడిచెద నీ వెంట జీవితమంతా (2) / లోకము నన్ను ఆకర్షించినా / వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| / అలయక నేను పరుగెత్తెదను / అంతము వరకు ఆత్మల రక్షణకై (2) / సిద్ధము చేసిన బహుమానముకై / గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| / రెక్కలు చాపి పక్షి రాజువలెనే / పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2) / పరవశించెదను నీ ముఖమును చూచి / ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||