స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

స్వస్థపరచు దేవుడు|Swasthaparachu Devudu

స్వస్థపరచు దేవుడు – సర్వ శక్తిమంతుడు / కష్ట కాలములోన నన్ను – మరచిపోడు / నమ్మదగిన దేవుడు – ఎన్నడూ ఎడబాయడు / మాట ఇచ్చిన దేవుడు – నెరవేరుస్తాడు / నన్నే ఎన్నుకున్నాడు – నా పేరు పెట్టి పిలిచాడు / శ్రమ ఎదురైనా – బాధేదైనా విడువని దేవుడు / నా పక్షముగానే ఉన్నాడు – నా చేయి పట్టి నడిపాడు / కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు ||స్వస్థపరచు|| / చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు / మరణము నుండి జీవముకు నను దాటించాడు / మారా వంటి జీవితము మధురముగా మార్చాడు / రోగము నిండిన దేహమును బాగు చేసాడు / పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు / చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు / కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు ||స్వస్థపరచు|| / దూతను ముందుగ పంపించి – మార్గము చక్కగ చేసాడు / ఆటంకములు తొలగించి – విజయమునిచ్చాడు / అగ్ని వంటి శ్రమలోన – నా తోడుగ ఉన్నాడు / ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు / నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు / సమాధానకరమైనవిగా రూపొందించాడు / అతడే నా ప్రియ యేసుడు – యేసే నా పరిహారకుడు / వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు ||స్వస్థపరచు||

దేవా నీ ఆవరణం|Devaa Nee Aavaranam

దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2) / ఒక ఘడియ యిచట గడుపుట మేలు / వేయి దినములకంటెను (2) ||దేవా|| / అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2) / అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా / అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2) / ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు / ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా|| / అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2) / నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్ / జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2) / శ్రేష్టమౌ నీదు వాక్కులచేత / మము తృప్తి పరచుమయా (2) ||దేవా|| / పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2) / పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం / మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2) / ప్రాణ ప్రియుడవు పదముల జేరి / ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||

నీతో నడుతుము|Neetho Naduthumu

నీతో నడుతుము – నిన్నే కొలుతుము / నీ సహవాసము – నిత్యము క్షేమము (2) / ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా / మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా / దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో / దేవా.. మా సర్వస్వము నీకే / దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో / దేవా.. పొందెదము దినదినము / నీలో ఉండెదం – నీకై బ్రతికెదం / ఈ ఆనందము- ఇలలో చాటెదం (2) / ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా / మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా / దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో / దేవా.. మా సర్వస్వము నీకే / దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో / దేవా.. పొందెదము దినదినము

విశేషమైన కృప|Visheshamaina Krupa

విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2) / నా యెడల నీవు విశేషమైన (2) / కృప చూపుచున్నావా ||విశేషమైన|| / నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ / నీ కృపయే నన్ను లేవనెత్తగా (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| / గడ్డి పూవు లాంటిది నా జీవితం / పరిమళింపజేయవా నీ కృపచేత (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| / వెలుపట లోపట పోరాటములే / యెటు చూచినా దారి కానరాలేదే (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము|Athi Parishuddhudaa Sthuthi Naivedyamu

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము / నీకే అర్పించి కీర్తింతును (2) / నీవు నా పక్షమై నను దీవించగా / నీవు నా తోడువై నను నడిపించగా / జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా|| / సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా / ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) / ముందెన్నడూ చవిచూడని / సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) / నీలోనే దాచావు ఈనాటికై / నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా|| / సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని / గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) / కృప వెంబడి కృప పొందగా / మారాను మధురముగా నే పొందగా (2) / నాలోన ఏ మంచి చూసావయ్యా / నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతిపరిశుద్ధుడా|| / సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక / శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) / ఉన్నావులే ప్రతిక్షణమునా / కలిసున్నావులే ప్రతి అడుగున (2) / నీవేగా యేసయ్యా నా ఊపిరి / నీవేగా యేసయ్యా నా కాపరి (2) ||అతిపరిశుద్ధుడా||

మానను మానను|Maananu Maananu

యేసు నిన్ను నే స్తుతియించుట / మానను మానను మానను / కృతజ్ఞతలు నీకు చెల్లించుట / ఎన్నడూ మాననే మానను / ప్రతికూల పరిస్థితులు / వెంటాడు ఘడియలలో / నీ సిలువ తట్టు తిరిగి / నీ యాగమును తలచి ||యేసు నిన్ను|| / సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి / వరముగా నిత్యజీవము నిచ్చితివి / నాకింక నిన్ను స్తుతియించకుండా / ఉండు కారణమేది లేకపోయెను ||యేసు నిన్ను|| / పరమందు ధనవంతుడు నేనగుటకు / దారిద్యములో నీవు జీవించితివి / ఈ లోక ధనము నను విడచిపోయి / దరిద్రునిగా నే మిగిలినను ||యేసు నిన్ను|| / నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి / నా పాప రోగము కడిగితివి / ఈనాడు నీవు నా దేహరోగము / స్వస్థపరచినా లేకున్నా ||యేసు నిన్ను|| / అసాధ్యుడవు నీవు సర్వాధికారివి / సార్వభౌముడవు దయాలుడవు / నా జీవితములో నా మేలుకోరకే / సమస్తమును జరిగించు వాడవు ||యేసు నిన్ను||

గతకాలమంత నీ నీడలోన|Gathakaalamantha Nee Needalona

గతకాలమంత నీ నీడలోన / దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / ఎన్నెన్నో అవమానాలెదురైననూ / నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా / ఇక్కట్లతో నేను కృంగిననూ / నీ చేయి నను తాకి లేపెనయ్యా / నిజమైన నీ ప్రేమ నిష్కళంకము / నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / మాటలే ముళ్ళుగ మారిన వేళ / నీ మాట నన్ను పలకరించెనయా / నిందలతో నేను నిండిన వేళ / నీ దక్షిణ హస్తం నను తాకెనయా / నీ మాట చక్కటి జీవపు ఊట / మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) / గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||

నీవు తప్ప నాకు ఇలలో|Neevu Thappa Naaku Ilalo

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా / నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా / నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా / నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా / నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా / గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప|| / కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను / నీ ప్రేమ వరమే కురిపించినావు / ఈ లోకమంతా వెలివేస్తున్న / నీ ప్రేమ నాపై చూపించినావు / నీ అరచేతిలో నను దాచినావయ్యా / నా చేయి విడువక నను నడిపినావయ్యా / నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ|| / కన్నీటి అలలో మునిగిన నన్ను / నీ దివ్య కరమే అందించినావు / ఆ సిలువలోనే నీ ప్రాణమును / నను రక్షింప అర్పించినావు / నీ కృప నీడలో నను కాచినావయ్యా / ఒక క్షణము వీడక కాపాడినావయ్యా / నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా ||నువ్వంటూ||

క్రీస్తుని స్వరము విందును|Kreesthuni Swaramu Vindunu

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు / మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2) / యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2) / మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని|| / బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2) / దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని|| / అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2) / ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని|| / ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2) / ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2) / ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2) / అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని|| / నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2) / కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని|| / తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2) / భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని|| / మరణాంధకార లోయలో నేనుండ (2) / నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని|| / ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2) / దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||

దేవాది దేవా|Devaadhi Devaa

దేవాది దేవా ప్రభువుల ప్రభూ / రాజుల రాజా హల్లెలూయ (2) / నీ రక్తముతో విమోచించి / నీ రక్తముతో సంపాదించి (2) / పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) / పరలోక పాటన్ నా కొసగితివి (2) ||దేవాది దేవా|| / జీవిత నావలో తుఫాను రేగ / భయపడకుడని అభయము నిచ్చి (2) / జయప్రదముగా నన్ను నడిపించి (2) / జయజీవితము నా కొసగుచున్న (2) ||దేవాది దేవా|| / పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి / కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2) / అరమర లేక నన్నాదరించి (2) / పరలోక దర్శనంబిచ్చితివి (2) ||దేవాది దేవా|| / మరణ పాత్రులం యిద్ధరణిలోన / దురిత ఋణముల స్మరణను మాన్పి (2) / ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2) / నీ రాజ్యమందు రాజులన్ జేసి (2) ||దేవాది దేవా|| / శోధనగాధల కష్టములలో / నా దుఃఖములలో నే నేడ్వకుండా (2) / నీ దయ నాపై నిండార నింపి (2) / ఓదార్చి నన్ను నీ దారినడుపు (2) ||దేవాది దేవా|| / ప్రతి వత్సరము దయతోడ నింపున్ / ప్రభు జాడలు సారము జల్లున్ (2) / ప్రతి బీడునూ సారము చిలకన్ (2) / ప్రతి పర్వతము ఆనందించున్ (2) ||దేవాది దేవా|| / పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట / సర్వశక్తిగల క్రీస్తుని యెదుట (2) / పరలోక నూతన గీతము పాడ (2) / జేర్చితివి నన్ నీ జనమునందు (2) ||దేవాది దేవా||