131 love songs available. Lyrics in Roman and Telugu script.
నమ్మకమైన నా స్నేహితుడు / నా ప్రభు యేసుడు (2) / ఎడబాయనివాడు విడువనివాడు (2) / నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| / ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2) / వ్యాధిలో భాధలో (2) / నను స్వస్థపరచువాడు / అనుక్షణం నా ప్రక్కన నిలచి / ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2) / అన్నివేళలా నన్నాదరించువాడు (2) / నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| / కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2) / కలతలలో కన్నీళ్ళలో (2) / నను ఓదార్చువాడు / కన్నతల్లిని మించిన ప్రేమతో / అరచేతిలో నను దాచినవాడు (2) / ఎన్నడు నన్ను మరువనివాడు (2) / నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) ||నమ్మకమైన||
తేనెకన్న తీయనైనది / నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) / నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను / కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| / ఆగకనే సాగిపోదును / నా ప్రభువు చూపించు బాటలో (2) / అడ్డంకులన్ని నన్ను చుట్టినా / నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| / నా వాళ్ళే నన్ను విడిచినా / నా బంధువులే దూరమైనా (2) / ఏ తోడు లేక ఒంటరినైననూ / నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||
ఎంత మధురము యేసుని ప్రేమ / ఎంత మధురము నా యేసుని ప్రేమ (2) / ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| / అంధకార బంధము నన్నావరించగా / అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2) / బంధము తెంచెను / బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| / రక్షించు వారు లేక పక్షినైతిని / భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2) / బంధము తెంచెను / బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ / మరణము కంటె బలమైన ప్రేమది / నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| / పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ / నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| / పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ / నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన|| / శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ / విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన|| / నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ / నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||
పదివేలలో అతిప్రియుడు / సమీపించరాని తేజోనివాసుడు / ఆ మోము వర్ణించలేము / స్తుతుల సింహాసనాసీనుడు / నా ప్రభు యేసు (4) / ఏ బేధము లేదు ఆ చూపులో / ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) / జీవితములను వెలిగించే స్వరం / కన్నీరు తుడిచే ఆ హస్తము (2) / అంధకారంలో కాంతి దీపం / కష్టాలలో ప్రియనేస్తం (2) / నా ప్రభు యేసు (2) ||పదివేలలో|| / దొంగలతో కలిపి సిలువేసినా / మోమున ఉమ్మి వేసినా (2) / తాను స్వస్థతపరచిన ఆ చేతులే / తన తనవును కొరడాలతో దున్నినా (2) / ఆ చూపులో ఎంతో ప్రేమ / ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2) / నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
దేవర నీ దీవెనలు / ధారాళముగను వీరలపై / బాగుగ వేగమే దిగనిమ్ము / పావన యేసుని ద్వారగను (2) / దంపతులు దండిగ నీ / ధాత్రిలో వెలయుచు సంపదలన్ / సొంపుగ నింపుగ పెంపగుచు / సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| / ఈ కవను నీ కరుణన్ / ఆకరు వరకును లోకములో / శోకము లేకయే ఏకముగా / బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| / ఇప్పగిది నెప్పుడును / గొప్పగు ప్రేమతో నొప్పుచు దా / మొప్పిన చొప్పున దప్పకను / మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| / తాపములు పాపములు / మోపుగ వీరిపై రాకుండగా / గాపుగ బ్రాపుగ దాపునుండి / యాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| / సాధులుగన్ జేయుటకై / శోధనలచే నీవు శోధింపగా / కదలక వదలక ముదమున నీ / పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ|| / మెండుగ భూమండలపు / గండములలో వీరుండగను / తండ్రిగ దండిగ నండనుండి / వెండియు వానిని ఖండించావే ||దేవర నీ|| / యిద్దరు వీరిద్దరును / శుద్ధులై నిన్ను సేవించుటకై / శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ / దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ|| / వాసిగ నీ దాసులము / చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని / మా సకలేశ్వర నీ సుతుడ / యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||
సిలువలో సాగింది యాత్ర / కరుణామయుని దయగల పాత్ర (2) / ఇది ఎవరి కోసమో / ఈ జగతి కోసమే / ఈ జనుల కోసమే ||సిలువలో|| / పాలు కారు దేహము పైన / పాపాత్ముల కొరడాలెన్నో (2) / నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) / నోరు తెరువ లేదాయే ప్రేమ / బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| / వెనుక నుండి తన్నింది ఒకరు / తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) / గేలి చేసినారు పరిహాసమాడినారు (2) / నోరు తెరువ లేదాయే ప్రేమ / బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది / నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది / ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ / ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| / తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును / కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| / భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము / వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| / బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము / నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| / ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును / క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు / నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా / నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా / నిరసించక సాగెదా నే వెనుదిరుగా / నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు / నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| / నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు / నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| / నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు / నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| / నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు / నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో||
నా జీవం నా సర్వం నీవే దేవా (2) / నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల / నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| / తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి / మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2) / ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై / విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం|| / మరణము జయించి తిరిగి లేచితివి / నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2) / అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ / భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం|| / నీవే నీవే నీవే దేవా (4)
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా / అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) / నా పాపము బాప నరరూపివైనావు / నా శాపము మాప నలిగి వ్రేలాడితివి / నాకు చాలిన దేవుడవు నీవే / నా స్థానములో నీవే (2) ||ఎందుకో|| / నీ రూపము నాలో నిర్మించియున్నావు / నీ పోలికలోనే నివసించుమన్నావు / నీవు నన్ను ఎన్నుకొంటివి / నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో|| / నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు / నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు / నన్ను నీలో చూచుకున్నావు / నను దాచియున్నావు (2) ||ఎందుకో|| / నీ సన్నిధి నాలో నా సర్వము నీలో / నీ సంపద నాలో నా సర్వస్వము నీలో / నీవు నేను ఏకమగువరకు / నన్ను విడువనంటివే (2) ||ఎందుకో|| / నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే / నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే / ఏమి అద్భుత ప్రేమ సంకల్పం / నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||