318 hope songs available. Lyrics in Roman and Telugu script.
నే సాగెద యేసునితో / నా జీవిత కాలమంతా (2) / యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) / పరమును చేరగ నే వెళ్లెద (2) / హనోకు వలె సాగెదా ||నే సాగెద|| / వెనుక శత్రువులు వెంటాడిననూ (2) / ముందు సముద్రము ఎదురొచ్చినా (2) / మోషె వలె సాగెదా ||నే సాగెద|| / లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) / కఠినులు రాళ్ళతో హింసించినా (2) / స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| / బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) / క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) / పౌలు వలె సాగెదా ||నే సాగెద|| / తల్లి మరచిన తండ్రి విడచిన (2) / బంధువులే నన్ను వెలివేసినా (2) / బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
మూడునాళ్ళ ముచ్చట కోసం / ఈ మనిషి పడే తపన చూడరా (2) / నీటిబుడగలాంటి జీవితం / ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) / మనిషికి తన మనసే చేరసాలరా / మమతలు మమకారాలే బంధాలురా (2) / వల్లకాటి వరకేరా భవబంధాలు / అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) / కల్లలైన కళలు మానుకో / ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| / ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము / అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) / గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం / అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) / నిత్యమైన సుఖము వెదకరా / నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| / తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు / అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) / జిగటగల ఊభినుండి పైకి లేపి / నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) / తీర్పు తీర్చబడకమునుపే / తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి / మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) / పాప మమతల చేత – పారిపోయిన నాకు / ప్రాప్తించె క్షామము / పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు / పంపుము క్షేమము (2) / ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు / పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| / ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు / తండ్రిని వీడితి / ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ / దేహీ నిను చేరితి (2) / దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు / దారిని జూపుము (2) ||మార్గము|| / దూర దేశములోన – బాగుందుననుకొనుచు / తప్పితి మార్గము / తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల / తరిమే దారిద్య్రము (2) / దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి / ధన్యుని చేయుము (2) ||మార్గము|| / అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు / ఆకలి బాధలో / అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ / అలవడెను వేదన (2) / అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత / ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| / కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు / కోపించి వెళ్ళితి / కూలివానిగనైన – నీ యింట పని చేసి / కనికరమే కోరుదు (2) / కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు / క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| / నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి / నాపైబడి ఏడ్చెను / నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి / నన్నూ దీవించెను (2) / నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో / సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
సీయోను పాటలు సంతోషముగా / పాడుచు సీయోను వెల్లుదము (2) / లోకాన శాశ్వతానందమేమియు / లేదని చెప్పెను ప్రియుడేసు (2) / పొందవలె నీ లోకమునందు / కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| / ఐగుప్తును విడచినట్టి మీరు / అరణ్యవాసులే ఈ ధరలో (2) / నిత్యనివాసము లేదిలలోన / నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| / మారాను పోలిన చేదైన స్థలముల / ద్వారా పోవలసియున్ననేమి (2) / నీ రక్షకుండగు యేసే నడుపును / మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| / ఐగుప్తు ఆశలనన్నియు విడిచి / రంగుగ యేసుని వెంబడించి (2) / పాడైన కోరహు పాపంబుమాని / విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను|| / ఆనందమయ పరలోకంబు మనది / అక్కడనుండి వచ్చునేసు (2) / సీయోను గీతము సొంపుగ కలసి / పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది / మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది / యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని / ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| / గుండె చెదరిన వారిని బాగుచేయువాడని / వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| / నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును / వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| / ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు / జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| / దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును / సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| / ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును / భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| / పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను / అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| / గుర్రముల నరులందలి బలము నానందించడు / కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| / యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని / కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| / పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ / మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| / భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే / వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| / వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని / ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
ఆనంద యాత్ర / ఇది ఆత్మీయ యాత్ర / యేసుతో నూతన / యెరుషలేము యాత్ర / మన.. యేసుతో నూతన / యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| / యేసుని రక్తము / పాపములనుండి విడిపించెను (2) / వేయి నోళ్ళతో స్తుతించినను / తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| / రాత్రియు పగలును / పాదములకు రాయి తగలకుండా (2) / మనకు పరిచర్య చేయుట కొరకై / దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| / కృతజ్ఞత లేని వారు / వేలకొలదిగ కూలినను (2) / కృపా వాక్యమునకు సాక్షులమై / కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| / ఆనందం ఆనందం / యేసుని చూచే క్షణం ఆసన్నం / ఆత్మానంద భరితులమై / ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||