318 hope songs available. Lyrics in Roman and Telugu script.
నాకై నా యేసు కట్టెను / సుందరము బంగారిల్లు / కన్నీరును కలతలు లేవు / యుగయుగములు పరమానందం / సూర్య చంద్రులుండవు / రాత్రింబగులందుండవు / ప్రభు యేసు ప్రకాశించును / ఆ వెలుగులో నేను నడచెదను / జీవ వృక్షమందుండు / జీవ మకుట మందుండు / ఆకలి లేదు దాహం లేదు / తిని త్రాగుట యందుడదు
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి / నా తండ్రి యేసుని నేను చూడాలి (2) / నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది / నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది / నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న|| / మగ్ధలేని మరియలాగా (2) / నీ పాదాలు చేరెదను (2) / కన్నీటితో నేను కడిగెదను (2) / తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న|| / బేతనీయ మరియలాగా / నీ సన్నిధి చేరెదను (2) / నీ వాక్యమును నేను ధ్యానింతును (2) / ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న|| / నీ దివ్య సన్నిధి నాకు / మధురముగా ఉన్నదయ్యా (2) / పరలోక ఆనందం పొందెదను (2) / ఈ లోకమును నేను మరిచెదను (2) ||నా నాన్న||
ప్రభువా నీ పరిపూర్ణత నుండి / పొందితిమి కృప వెంబడి కృపను / ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో / ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా|| / జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి / సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి / కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును / దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు / డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను / చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| / కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప / హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే / ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు / కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే / ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు / నూతనాకాశము.. నూతన లోకము… / నూతనెరుషలేము వచ్చును / దేవుడే మనతో.. గుడారమై యుండును… / మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| / జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే / నిత్యము మనలో ఉందును (2) / తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు / మనతో ఏకమై యుండును ||భూపునాది|| / వేదన బాధయు – కన్నీరు దుఃఖము / ఇంకెక్కడా ఉండే ఉండవు (2) / సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు / దేవుడే వెలుగై యుండును ||భూపునాది||
మాధుర్యమే నా ప్రభుతో జీవితం / మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| / సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు / వారి అందమంతయు పువ్వు వలె / వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| / నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే / దేవుని యందలి భయ భక్తులతో / ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| / నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే / నా రోగమంతయు సిలువలో / పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| / వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను / తేజోవాసులైన పరిశుద్ధులతో / ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||
చూడాలని ఉన్నది / నా యేసుని చూడాలని ఉన్నది (2) / కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని / కొనియాడుచుండగా చూడాలని (2) / పగలు ఎగురు బాణమైనను / రాత్రి కలుగు భయముకైనను (2) / కదలక నను కాపాడే నా నాథుడే నీవే / ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2) / నా పాదములకు దీపమై / నా త్రోవలకు వెలుగువై (2) / నను వీడని ఎడబాయని నా తోడువు నీవే / కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)
గూడు విడచి వెళ్లిన నాడే / చేరెదనా ఇంటికి / పాడెదన్ జయగీతమే / నాకై శ్రమలు పొందిన యేసుకై / నిందలు పోవును బాధలు తీరును / ప్రాణప్రియతో ఎత్తబడగా / పావురము వలెనే ఎగురుచు / రూపాంతరము పొందెదనే / బంధువు మిత్రులంతా నన్ను విడచినను / ఏకమై కూడి రేగినను / చేయి పట్టిన నాధుడే నన్ను / తన చెంత చేర్చుకొనును / లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు / నడిచెద యేసుని అడుగులో / నాకున్న సమస్తమును నీకై / అర్పించెదను యేసువా
అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా / పదే పదే నేను పాడుకోనా / ప్రతి చోట నీ మాట నా పాటగా / మరి మరి నే చాటుకోనా / మనసంతా పులకించని సాక్షిగా / నా జీవిత గమనానికి గమ్యము నీవే / చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| / మమతల మహా రాజా / (నా) యేసు రాజా (4) / అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| / అడిగిన వేళ అక్కున చేరి / అనురాగం పంచిన అమ్మవు నీవే / నలిగిన వేళ నా దరి చేరి / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) / అనురాగం పంచిన అమ్మవు నీవే / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
ఓ నావికా.. ఓ నావికా.. / ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. / ఓ నావికా…. ఓ నావికా…. / శ్రమలలో శ్రామికా… (2) / ఊసు వింటివా వింత గంటివా / యేసు సామి ఊసు నీవు వింటివా (2) / హైలెస్సో హైలెస్సా / హైలెస్సో హైలెస్సా (2) / వలేసావు రాతిరంతా / ధార పోసావు కష్టమంతా (2) / చిక్కలేదు చేప ఒక్కటైనా / దక్కలేదు ఫలము కొంతైనా (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / నింపాడు నీ నావ అద్భుత రీతితో / తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా|| / విరిగి నలిగిన మనస్సుతో / చేసావు నీ సమరం (2) / శయనించక ఎడతెగక / ఈదావు ఈ భవ సాగరం (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / కరుణించాడు నిన్ను చల్లని చూపుతో / నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా||
నిన్నంత దేవరు యారు ఇల్ల / నిన్న హాగె ప్రీతిసువవరు ఒబ్బరు ఇల్ల (2) / యేసయ్యా యేసయ్యా నీనిల్లదే నానిల్లయ్యా (2) ||నిన్నంత|| / పాపదా మరణదల్లి ఇద్దంతా నన్నా / ప్రీతి మాడి ప్రాణ కొట్టు బదుకిసిడే దేవా (2) / నిన్న కృపే శాశ్వతా ఎందెందు దేవా (2) / నిన్న ప్రీతియింద నాను జీవిసువే దేవా (2) ||యేసయ్యా|| / నన్నయ జీవితవెల్లవన్ను తిలిదిరువే నీను / నన్నయ కురితు హితవాగి చింతిసువే నీను (2) / నిన్నయ కరది హిడిదు నన్న నడిసిరువే దేవా (2) / నన్న సహాయ నన్న బండె నీనే యేసయ్యా (2) ||యేసయ్యా|| / కష్టగలల్లి దుఃఖగలల్లి జొతేయాగిరువవను / రోగదల్లి సంకటదల్లి బలవా కొడువవవను (2) / కొరితెగలన్ను నీగిసువవను నీనే యేసయ్యా (2) / సోలుగలల్లి జయవను కొడువ దేవా నీనయ్యా (2) ||యేసయ్యా||
నా జీవిత యాత్రలో / ప్రభువా నీ పాదమే శరణం / ఈ లోకమునందు నీవు తప్ప / వేరే ఆశ్రయం లేదు (2) ||నా జీవిత|| / పలు విధ శోధన కష్టములు / ఆవరించియుండగా (2) / కలత చెందుచున్న హృదయమును / కదలక కాపాడుము (2) ||నా జీవిత|| / నీ సన్నిధిలో సంపూర్ణమైన / సంతోషము కలదు (2) / నీదు కుడి హస్తములో నిత్యమున / నాకు సుఖ క్షేమముగా (2) ||నా జీవిత|| / ఈ లోక నటన ఆశలన్నియు / తరిగిపోవుచుండగా (2) / మారని వాగ్ధానములన్నియు / నే నమ్మి సాగెదను (2) ||నా జీవిత|| / ముందున్న సంతోషము తలంచి / నిందలను సహించి (2) / నీ సిలువను నే మోయుటకై / నీ కృప నాకీయుము (2) ||నా జీవిత|| / సీయోను యొక్క ఆలోచనతో / సదా నడిపించుము (2) / మహిమలో నీతోనే నిల్చుటకు / నా తండ్రి దయచూపుము (2) ||నా జీవిత||
ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నువ్వెవరో యేసు నువ్వెవరో… / నా తల్లి కన్నా నీవే / నా తండ్రి కన్నా నీవే / నా అండ దండ తోడు నీడ నీవై / నన్ను కాచితివే / ఈ లోకం కన్నా మిన్నగా / నా బంధం కన్నా అండగా / అన్నీ నీవై నిలిచి / నను వెదకి వచ్చితివే / నా తల్లి నను మరచే / నేనెన్నో సార్లు ఏడ్చే / నీవు నన్ను మరువక / నా ప్రక్కన ఉంటివే / నా కన్నుల్లోని నీళ్లు నిను మసక చేసెనే / నా కంటి నీరు తుడిచి నేనున్నానంటివే ||ఈ లోకం|| / నా తండ్రి నను విడచే / నేనొంటరినై నడచే / నీవు నన్ను విడువక / నా చెంత నడచితివే / ఎవరు లేరనే బాధలో నిన్నే కానకపోయే / తుళ్ళిపడిన వెంటనే నన్నాదుకొంటివే / (యేసు) నువ్వేలే నా సర్వం – (2) ||నా తల్లి||